EPAPER

Ys Jagan: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన

Ys Jagan: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన

Ys Jagan: తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సిట్ ను సుప్రీం కోర్టు రద్దు చేసి, ప్రత్యేక కమిటీ ద్వారా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. మాజీ సీఎం జగన్ తాజాగా స్పందించారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. అబద్దాలు మాట్లాడే సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ విచారణను రద్దు చేసి, సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. టీటీడీ అనేది ఒక పెద్ద వ్యవస్థ అని, అక్కడ కల్తీ జరిగే అవకాశం ఉండదన్నారు. అన్నీ పరీక్షలు చేసిన అనంతరం ట్యాంకర్ల నెయ్యిని లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు.


అలాగే సాక్షాత్తు టీటీడీ ఈవో లడ్డు తయారీకి కల్తీ నెయ్యిని ఉపయోగించలేదని ప్రకటించినా.. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు అబద్దాన్ని నిజం చేసేందుకు విశ్వప్రయత్నం చేశారన్నారు. జూలై 6న వచ్చిన నెయ్యి ట్యాంకర్ లను వెనక్కు పంపడం జరిగిందని ఈవో ప్రకటించినా.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నెయ్యి కల్తీ వ్యవహారాన్ని బాబు తెర మీదికి తెచ్చారన్నారు. తిరుమల ప్రతిష్టను, లడ్డు విశిష్టతను దెబ్బతీసేందుకు.. బాబు రాజకీయంగా ఈ వివాదాన్ని తెరమీదికి తెచ్చారన్నారు. సుప్రీం కోర్టు అక్షింతలు వేసినా.. టీడీపీ సోషల్ మీడియా ద్వారా తమ నేతలకు చుక్కెదురైందని ప్రచారం చేస్తున్నారన్నారు. దైవం అంటే బాబుకు భయం, భక్తి లేదని.. అదే ఉండి ఉంటే ఇప్పటికే ప్రజలకు క్షమాపణలు చెప్పేవారని తెలిపారు. కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసేందుకు గ్లోబల్ ప్రచారంను టీడీపీ సాగించిందని తెలుపుతూ తాము ప్రధానికి లేఖ రాశామన్నారు. ఇప్పటికైనా బాబు బుద్ది మారాలని జగన్ అన్నారు.

Also Read: Ys Sharmila: వేషం మార్చారు.. భాష మార్చారు.. ఇది మీకు తగునా పవన్.. షర్మిళ సంచలన కామెంట్స్


బాబు లాంటి పొలిటీషియన్ ఉండడం మన ఖర్మ అంటూ.. ఇలాంటి పొలిటీషియన్ రాకూడదన్నారు. లడ్డు విశిష్టతను తగ్గించేందుకు బాబు కుట్ర పన్నినట్లు తాను భావిస్తున్నానన్నారు. అలాగే 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బాబు చెప్పిన అబద్దాలను ప్రజలు విశ్వసించే స్థాయిలో కూడా లేరన్నారు.

పవన్ కు సనాతన ధర్మం ఏమిటో తెలుసా..
పవన్ వారాహి సభ ద్వారా చేసిన కామెంట్స్ పై జగన్ మాట్లాడుతూ.. పవన్ కు సనాతన ధర్మం అంటే ఏ మేరకు తెలుసో నాకు అర్థం కావడం లేదన్నారు. తిరుమల పవిత్రతను బాబు దెబ్బతీస్తుంటే.. పవన్ సనాతన ధర్మం అంటూ వత్తాసు పలుకుతున్నారన్నారు. అలాగే రాజకీయ దుర్భుద్ది కోసం లడ్డు వివాదాన్ని తీసుకువస్తే.. పవన్ తప్పు తెలిసినా కూడా బాబుకు మద్దతు తెలిపి అభాసు పాలవుతున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని రాజకీయంగా వాడుకుంటే మామూలుగా ఉండదని, ఖచ్చితంగా నాశనం కావడం ఖాయమన్నారు. ఏపీ ప్రజలకు ఈ పాపం తగలకుండా.. కూటమి ప్రభుత్వానికే తగలాలని జగన్ శాపనార్థాలు పెట్టారు.

Related News

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

Ys Sharmila: వేషం మార్చారు.. భాష మార్చారు.. ఇది మీకు తగునా పవన్.. షర్మిళ సంచలన కామెంట్స్

Tirumala: తిరుమలలో అపశృతి వార్తలపై స్పందించిన టీటీడీ.. అసలు విషయం ఇదే

Big Stories

×