EPAPER

Martin: సొంత చిత్రాన్నే విడుదల చేయొద్దంటూ కోర్ట్ మెట్లెక్కిన డైరెక్టర్.. అసలేమైందంటే..?

Martin: సొంత చిత్రాన్నే విడుదల చేయొద్దంటూ కోర్ట్ మెట్లెక్కిన డైరెక్టర్.. అసలేమైందంటే..?

Martin.. సాధారణంగా ఏ హీరో అయినా.. డైరెక్టర్ అయినా.. తమ సినిమా ప్రాజెక్టు అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి రిలీజ్ అయ్యే వరకు సవ్యంగా సాగిపోవాలని.. ఏ కష్టం రాకూడదని ఎన్నో కలలు కంటూ ఉంటారు . అలాంటిది సినిమాను కష్టపడి షూటింగ్ చేసి విడుదలకు సిద్ధంగా ఉంచిన సమయంలో తన సినిమాను విడుదల చేయొద్దు అంటూ కోర్టుమెట్లకి అందరికీ షాక్ ఇచ్చారు ఆ సినిమా డైరెక్టర్. ఆ సినిమా ఏదో కాదు మార్టిన్. కన్నడ హీరో ధ్రువ సర్జ (Dhruva sarja) హీరోగా నటించిన మార్టిన్ (Martin) సినిమా షూటింగ్ మొదలయి దాదాపు ఆరేళ్లు కావస్తోంది.ఇన్నాళ్ల తర్వాత దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకొని , ఇప్పుడు విడుదల డేట్ కూడా అనౌన్స్ చేయడంతో సినిమా సజావుగా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే ఇప్పుడు ఈ సినిమా చిక్కుల్లో ఇరుక్కుంది . మార్టిన్ సినిమా వివాదం కాస్త కర్ణాటక హైకోర్టుకు చేరడంతో ధ్రువ సర్జ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ఏపీ అర్జున్ (AP Arjun) స్వయంగా హైకోర్టులో కేసు వేయడం ఒక్కసారిగా అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.


నా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వద్దు – ఏపీ అర్జున్

అసలు విషయంలోకి వెళ్తే.. మార్టిన్ చిత్ర నిర్మాత ఉదయ్ మెహతా,దర్శకుడు ఏపీ అర్జున్ మధ్య గత రెండు సంవత్సరాలుగా కోల్డ్ వార్ నడుస్తోందని ఇన్సైడ్ టాక్ . నిర్మాత ఉదయ్ మెహతా సినిమా బడ్జెట్ అలాగే డబ్బు దుర్వినియోగం చేశారని ఆరోపించగా. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ చిత్రం యొక్క విఎఫ్ఎక్స్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థపై కూడా మోసం పేరిట కేసును దాఖలు చేశారు. ఇకపోతే దాఖలు చేసిన ఫిర్యాదులో ఏపీ అర్జున్ పేరు కూడా ఉండడం గమనార్హం. దీనికి తోడు ఇటీవల ప్రమోషన్స్ కార్యక్రమాలలో కనిపించిన సినిమా పోస్టర్లలో కూడా ఈ సినిమా డైరెక్టర్ ఏపీ అర్జున్ పేరు లేకుండానే నిర్మాత ఉదయ్ మెహతా సినిమా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో కోర్టును ఆశ్రయించిన ఏపీ అర్జున్.. ఈ సినిమాకు నేనే దర్శకుడిని.. అయినప్పటికీ నా పేరును పక్కనపెట్టి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సినిమా ఒప్పందాన్ని నిర్మాత పాటించడం లేదు..నా పేరు లేకుండా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వద్దు ” అంటూ ఏపీ అర్జున్ హైకోర్టును ఆశ్రయించగా దీనిపై విచారణ జరగాల్సి ఉంది.


నిర్మాతను మోసం చేసిన డిజిటల్ టెర్రైన్ సంస్థ..

వాస్తవానికి నిర్మాత ఉదయ్ మెహతా వీఎఫ్ఎక్స్ చేయడానికి డిజిటల్ టెర్రైన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. డైరెక్టర్ అర్జున్ సలహా మేరకే ఈ సంస్థకు పని అప్పగించారు ఉదయ్. ఇందుకోసం నిర్మాత రూ.2.5 కోట్లు కూడా చెల్లించాడు. కానీ ఈ కంపెనీ విఎఫ్ఎక్స్ వర్క్ చేయలేదు. చేసిన కొంత పని కూడా సంతృప్తికరంగా లేదని నిర్మాత ఆరోపించారు. ఇక దీంతో ఈ సంస్థ ప్రతినిధులైన సురేంద్ర రెడ్డి , సత్య రెడ్డి లపై ఉదయ్ ఫిర్యాదు చేశారు.

మోసం వెనుక డైరెక్టర్ కుట్ర..

దీంతో సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాత ఇచ్చిన రూ.2.5 కోట్లలో రూ .50 లక్షలు డైరెక్టర్ అర్జున్ కమీషన్ పొందినట్లు తెలిపారు. ఫలితంగా అర్జున్ , ఉదయ్ మధ్య కోల్డ్ వార్ చోటుచేసుకుంది. ఆ కారణంగానే ఉదయ్ అర్జున్ పేరును తొలగించి దానిని ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన సినిమాకు తన పేరు తొలగించడం పై అర్జున్ కర్ణాటక కోర్టు మెట్లు ఎక్కాడు. మరి ఆ అక్టోబర్ 11వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది. దీనికి కోర్టు ఏ విధంగా తీర్పు చెబుతుందో చూడాలి.

Related News

Janhvi kapoor: కొరటాల పరువు తీసిన జాన్వీ.. అంత మాట అనేసిందేంటి..?

Roopa Ganguly: మహాభారత ‘ద్రౌపది‘ అరెస్ట్.. అర్ధరాత్రి అదుపులోకి రూపా గంగూలి, అసలు ఏం జరిగింది?

Salman Khan: ఆ హీరోయిన్ తో రొమాన్స్.. ఛీఛీ ఏం మాట్లాడుతున్నారు..

HarshaSai: హర్షసాయికి చుక్కెదురు.. బెయిల్ దొరకనట్టేనా..?

Thalapathy 69: ఘనంగా పూజా కార్యక్రమాలు.. విడుదల ఎప్పుడంటే..?

Devara Collections : బాక్సాఫీస్ వద్ద దేవర జాతర.. వారం రోజులకు ఎంత రాబట్టిందంటే ?

Posani Krishna Murali: చిరంజీవి ఏడ్చి మొత్తుకుంటే ఆపాను.. పవన్ కళ్యాణ్ ఏం పీకావ్ నువ్వు..

Big Stories

×