EPAPER

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

Israel India Iran| ఇజ్రాయెల్ హిజ్బుల్లాని అంతం చేసేందుకు లెబనాన్ భూభాగంలో సైనిక చర్యలు చేపట్టింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో సామాన్య పౌరులు చనిపోతున్నారు. దీంతో ఇజ్రాయెల్ పై హిజ్బుల్లాకు మిత్ర దేశమైన ఇరాన్ దాదాపు 200 క్షిపణలు ప్రయోగించింది. దీంతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి త్వరలోనే ఇరాన్ పై దాడి చేయవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఇండియాలోని ఇజ్రాయెల్ అంబాసిడర్ (దౌత్యవేత్త) రుబిన్ రియెబెన్ అజ్హర్.. ఒక జాతీయ మీడియా ఛానెల్ లో ఇంటర్‌వ్యూ ఇ చ్చారు.


Also Read: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్

ఈ ఇంటర్‌వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ”ఈ యుద్ధం ఇరాన్ మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ పై దాడి చేయవద్దని ఇండియాతో సహా అన్ని దేశాల ద్వారా హెచ్చరించాం కానీ ఇరాన్ ఆగలేదు. ఇప్పటి వరకు ఇరాన్ తన బినామీలైన హమాస్, హిజ్బుల్లా, హౌతీల ద్వారా మాపై దాడులు చేసింది. కానీ తొలిసారి నేరుగా ఇరాన్ భూభాగం నుంచి 200 క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగంపై పడ్డాయి. దీనికి ఇరాన్ ఫలితం ఎదుర్కోక తప్పదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7, 2023న అతిపెద్ద దాడి జరిగింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ లోని 1200 మంది చనిపోయారు.


మృతులలో మహిళలు, పిల్లలు.. ఇలా మొత్తం కుటుంబాలే తుడిచి పెట్టుకుపోయాయి. ఇంత పెద్ద దాడి జరుగుతుందని మేము ఊహించలేదు. ఇదేదో రాత్రికి రాత్రే జరిగింది కాదు. దీని వెనుక ఇరాన్ చాలా కాలంగా ప్లానింగ్ చేసింది. ఇజ్రాయెల్ వినాశనమే ఇరాన్ తన లక్ష్యంగా పెట్టుకుంది. అయినా ప్రపంచదేశాలు ఇరాన్ ని తప్పుపట్టడం లేదు. అందుకే తన ఆత్మ రక్షణ కోసం ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది.

మేము అనివార్య పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నాం. మేము తిరిగి దాడి చేయకపోతే ఈ హింస ఇంతటితో ఆగదు. ఇజ్రాయెల్ పై దాడులు జరుగుతూనే ఉంటాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా ఎప్పుడూ నిలబడింది. ఇలాగే అన్ని ప్రపంచ దేశాలు చేస్తే బాగుంటుంది. ఇరాన్ క వ్యతిరేకంగా అందరూ ఐక్యమత్యంగా నిలబడకపోవడం చాలా బాధాకరంగా ఉంది.” అని రుబిన్ అజ్హర్ ఇజ్రాయెల్ పక్షంలో వాదించారు.

Related News

Indonesia Pleasure Marriages: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్

Israel-Iran Impact on India: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ కు నష్టాలు.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం

World War II Bomb Japan: ఇప్పుడు పేలిన ప్రపంచ యుద్ధం బాంబు.. జపాన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

Israel Iran War: ‘నెతన్యాహు ఒక హిట్లర్.. యద్ధం ఆపేందుకు ఇండియా సాయం చేయగలదు’.. ఇరాన్ రాయబారి కీలక వ్యాఖ్యలు

Iran Israel Attack: యుద్ధం మొదలైంది.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం

New Zealand: న్యూజిలాండ్‌ను వీడుతున్న ప్రజలు.. అదోగతిలో అందాల దీవి, అసలు ఏమైంది?

Big Stories

×