EPAPER

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

CSK physio reacts to Harbhajan Singh’s claim of MS Dhoni breaking a TV in anger: మహేంద్రసింగ్ ధోని గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరియర్ ప్రారంభంలో ధనాధన్ ధోనిగా పేరు తెచ్చుకున్న ధోని ఆ తర్వాత తనని తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. అగ్రెసివ్ మైండ్ సెట్ నుంచి పూర్తిగా మిస్టర్ కూల్ కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ధోని కెప్టెన్ అయ్యాక మైదానంలో చాలా కూల్ గా కనిపించేవాడు. తన భావోద్వేగాలను, సంతోషాన్ని, బాధను అస్సలు ప్రదర్శించేవాడు కాదు. తనదైన ప్రత్యేకమైన శైలితో క్రికెట్లో రాణిస్తాడు. ఎంత ఒత్తిడి సమయంలోనైనా చాలా ప్రశాంతంగా తోటి ఆటగాళ్లలో చాలా ధైర్యాన్ని నింపుతాడు.


అలా ఎన్నో మ్యాచ్ లలో జట్టుకు విజయాలను అందించాడు. అలాంటి ధోని ఫైర్ అవుతే పరిణామాలు మరోలా ఉంటాయని చెబుతున్నాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ధోని ఎంత అగ్రెసివ్ గా ఉండేవాడో వివరిస్తూ గతంలో జరిగిన ఓ అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. మైదానంలో చాలా ప్రశాంతంగా కనిపించే మహేంద్రసింగ్ ధోని…. తన కోపాన్ని అదుపు చేసుకోలేని పరిస్థితులు చాలానే ఉన్నాయని, తన తోటి ఆటగాళ్లు కొన్ని కొన్ని సందర్భాల్లో చెబుతారు. తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివరించాడు. టీవీలు, కెమెరాల ముందు ధోని తన భావోద్వేగాలను అస్సలు బయట పెట్టేవాడు కాదు. కానీ ఐపీఎల్ 2024 సందర్భంగా ధోని తన సహనాన్ని కోల్పోయి ఏకంగా టీవీనే బద్దలు కొట్టాడని వెల్లడించాడు.

గత సీజన్లో ఆర్సిబితో జరిగిన ఆఖరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. ప్లేఆప్స్ కి వెళ్లాల్సిన వారి ఆశలు ఆ ఓటమితో తలకిందులుగా మారాయి. మరోవైపు సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఆర్సిబి ప్లేఆప్స్ కు దూసుకెళ్లింది. చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 18 పరుగులు మాత్రమే అవసరం ఉన్న సమయంలో ధోని అవుట్ అయ్యాడు. మరోవైపు ఆ ఓవర్ లో ఏడు పరుగులే వచ్చాయి. ఆ తర్వాత ఆర్సిబి విజయాన్ని అందుకోవడం, సంబరాలు చేసుకోవడం ప్రతి ఒక్కరం చూశాం.


Also Read: Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

ఇక మ్యాచ్ అనంతరం ధోని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లినప్పటికీ వారందరూ ధోని వద్దకి రాకపోగా, అక్కడ ఉన్నవారికి మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ధోని అక్కడి నుంచి కోపంగా తిరిగి వెళ్లిపోయాడు. ఈ వార్తలు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి. అలా ధోని కోపంతో లోపలికి వెళ్లిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న స్క్రీన్ ను పగలగొట్టాడని హర్భజన్ సింగ్ తెలియజేశాడు. ఆ మ్యాచ్ కు హర్భజన్ సింగ్ కామెంటేటర్ గా వ్యవహరించాడు. ప్రతి ఒక్క ఆటగాడికి భావోద్వేగాలు ఉంటాయని, ధోని భావోద్వేగాలకు అతిథుడు కాదని హర్భజన్ సింగ్ వెల్లడించాడు. ప్రస్తుతం ధోని గురించి హర్భజన్ సింగ్ బయటపెట్టిన ఈ వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే..దీనిపై చెన్నై మేనేజ్‌మెంట్‌ స్పందించింది. ధోని ఎలాంటి టీవీ పగులగొట్టలేదని తేల్చి చెప్పింది.

Related News

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

Azharuddin: HCAలో భారీ అక్రమాలు..అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు !

Shardul Thakur: 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్..నువ్వు రియల్‌ హీరో శార్దూల్‌!

Big Stories

×