EPAPER

Mystery Bangla: ముగ్గురు హీరోల జీవితాన్ని నాశనం చేసిన బంగ్లా.. సినిమా స్టోరీ ని తలపిస్తోందే..?

Mystery Bangla: ముగ్గురు హీరోల జీవితాన్ని నాశనం చేసిన బంగ్లా.. సినిమా స్టోరీ ని తలపిస్తోందే..?

Mystery Bangla.. సాధారణంగా ఇల్లు నిర్మించుకునేటప్పుడైనా లేదా అద్దె ఇంట్లోకి వెళ్లేటప్పుడు అయినా సరే ఖచ్చితంగా వాస్తు అనేది మనం తప్పనిసరిగా పాటిస్తాం. వాస్తు చూసుకొని మరీ ఆ ఇంట్లోకి అడుగుపెడతాం. అలా చూసి ఎంపిక చేసుకున్న ఇంట్లో జీవనం సాగిస్తే.. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారు అని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి ఇవన్నీ తలకిందులు కూడా అవ్వచ్చు. సరిగ్గా ఇలాగే ముగ్గురు.. అందులోనూ స్టార్ హీరోల జీవితం.. ఒకే ఇంటి కారణంగా నాశనమవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలి అంటే ప్రస్తుతం దీనిని అందరూ మిస్టరీ బంగ్లా అని కూడా పిలుస్తున్నారని సమాచారం. మరి ఆ మిస్టరీ బంగ్లా ఎక్కడుంది..? ఆ ఇంట్లో ఉన్న సెలబ్రిటీలు ఎవరు? వారికి ఏ నష్టం కలిగింది..? ఎందుకు ఇలా జరిగింది..? అనే ఎన్నో అనుమానాలు నెటిజెన్స్ లో తలెత్తుతున్నాయి. మరి ఇదేంటో ఒకసారి క్లుప్తంగా చూద్దాం.


ముగ్గురు హీరోల కెరీర్ ను బలి తీసుకున్న బంగ్లా

ఒక బంగ్లా ముగ్గురు హీరోల కెరియర్ ను నాశనం చేసిందంటే ఎవరైనా నమ్ముతారా..? ఇది అక్షర సత్యం.. ఆ ముగ్గురు హీరోలలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ కన్నా (Rajesh Khanna) కూడా ఉండడం గమనార్హం. మరి ఈ బంగ్లా ఎక్కడుంది? అనే విషయానికొస్తే.. ముంబైలోని కార్టర్ రోడ్డు ప్రాంతంలో సముద్రానికి కొద్ది దూరంలోనే ఈ బంగ్లా ఉందట. ముందు దీనిని 1950లో భరత్ భూషణ్ ( Bharath Bhushan) అనే హిందీ నటుడు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో భరత్ భూషణ్ అంటే మంచి పేరు మోసిన హీరో.. ఎన్నో సినిమాలలో నటించి, భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే అప్పటి వరకు ఉన్న ఆయన ఫేమ్ .. ఈ బంగ్లా కొనుగోలు చేసిన తర్వాత ఒక్కసారిగా కనుమరుగైపోయింది. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా అప్పుల పాలయ్యారు.


ఒంటరిగా పోరాడుతూ తుది శ్వాస విడిచిన రాజేష్ ఖన్నా..

దాంతో తాను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఆ బంగ్లాని 1960లో రాజేంద్ర కుమార్ (Rajendra Kumar) అనే మరో నటుడికి అమ్మేశారు. అయితే రాజేంద్ర కుమార్ కూడా ఆ ఇంటిని కొనుగోలు చేయక ముందు వరకు కూడా మంచి పేరున్న నటుడే. ఆ బంగ్లా కొన్న తర్వాత రాజేంద్ర కూడా అప్పుల బాధతో బంగ్లాను అమ్మకానికి పెట్టారు. దాంతో చివరికి ఆ బంగ్లాను రాజేష్ ఖన్నా (Rajesh Khanna) కొనుగోలు చేశారు. 1970లో రాజేష్ ఖన్నా ఈ బంగ్లా కొనుగోలు చేసి, ఆ బంగ్లాకు “ఆశీర్వాద్” అనే పేరు కూడా పెట్టారు. కుటుంబంతో సహా ఆ ఇంట్లోకి అలా అడుగు పెట్టారో లేదో అప్పుడే కుటుంబంలో కలహాలు, సినిమా అవకాశాలు లేకపోవడం ఇలా అన్నీ జరిగిపోయాయి. అంతేకాదు ఆయన భార్య డింపుల్ కపాడియా కూడా ఇంటి నుండి వెళ్లిపోయింది. ఇక చివరి వరకు ఆ ఇంట్లోనే ఉన్న రాజేష్ కన్నా చివరికి ఒంటరిగా ఉంటూనే చనిపోయారు అని సమాచారం. ఆ తర్వాత ఈ బంగ్లాను మరో వ్యక్తి కొనుగోలు చేసినా.. సగభాగం కూల్చేసి పాత జ్ఞాపకాలు ఏవి లేకుండా పూర్తిగా కొత్త రూపాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి మొత్తానికైతే ముగ్గురు హీరోల కెరియర్ ను బలి తీసుకున్న ఈ బంగ్లా లో ఏముంది..? ఎందుకు ఇలా అయిపోయింది..? అనే విషయాలు మాత్రం ఇంకా మిస్టరీగానే ఉన్నాయి.

Related News

Salman Khan: ఆ హీరోయిన్ తో రొమాన్స్.. ఛీఛీ ఏం మాట్లాడుతున్నారు..

HarshaSai: హర్షసాయికి చుక్కెదురు.. బెయిల్ దొరకనట్టేనా..?

Thalapathy 69: ఘనంగా పూజా కార్యక్రమాలు.. విడుదల ఎప్పుడంటే..?

Devara Collections : బాక్సాఫీస్ వద్ద దేవర జాతర.. వారం రోజులకు ఎంత రాబట్టిందంటే ?

Posani Krishna Murali: చిరంజీవి ఏడ్చి మొత్తుకుంటే ఆపాను.. పవన్ కళ్యాణ్ ఏం పీకావ్ నువ్వు..

Pushpa2 : పుష్ప 2 లో బాలీవుడ్ బ్యూటీ.. నీ అవ్వ అస్సలు తగ్గేదేలే..

Prakash Raj: పవన్ ను వదిలేలా లేడే.. మళ్లీ ఎందుకయ్యా కదిలిస్తావ్

Big Stories

×