EPAPER

Indonesia Pleasure Marriages: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్

Indonesia Pleasure Marriages: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్

Indonesia Pleasure Marriages| ఇండోనేషియాలో కొత్త బిజినెస్ జరుగుతోంది. ఈ బిజినెస్ గురించి సోషల్ మీడియాలో నెటిజెన్లందరూ విమర్శిస్తున్నారు. ఇండోనేషియాలో టూరిస్టులను ఆకట్టుకోవడానికి వివాహాల పేరుతో వ్యభిచారాన్ని నడుపుతున్నారు. దీంతో అక్కడ ఈ బిజినెస్ చేస్తున్న ఏజెన్సీల సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఈ ఏజెన్సీల బారిన పడి పేద కుటుంబాలకు చెందిన యువతులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.


ప్రముఖ వార్త సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం.. ఇండోనేషియా దేశంలో టూరిజం బిజినెస్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో టూరిస్టులను ఆకట్టుకోవడానికి ఈ టూరిజం ఏజెన్సీలు కొత్త సర్వీసులు ప్రారంభించాయి. అదే వ్యభిచారం. అయితే ఇండోనేషియా ముస్లిం దేశం కావడంతో అక్కడ వ్యభిచారానికి అనుమతి లేదు. అందుకే ఇస్లాం మతంలోని నియమాలను వక్రీకరిస్తూ.. వివాహ వ్యవస్థ దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఏజెంట్లు.

Also Read:  ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..


టూరిస్టులకు ఈ ప్రత్యేక సర్వీసు పశ్చిమ ఇండోనేషియాలోని పున్‌కాక్ ప్రాంతంలో లభిస్తోంది. అక్కడ టూరిస్టుల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఒక వారం లేదా ఒక నెల రోజుల వరకు భార్య సర్వీసు ఇస్తున్నారు. ఉదాహరణకు ఒక విదేశీ ఊరిస్టు ఇండోనేషియాకు వెళ్తే అతని వద్ద డబ్బులు తీసుకొని ఒక యువతితో అతనికి వివాహం చేస్తారు. ఆ టూరిస్టుకి ఆ యువతి వంట చేయడంతో పాటు, శృంగార సేవలు కూడా అందిస్తుంది. ఆ తరువాత ఆ విదేశీ టూరిస్టు తన స్వదేశానికి ఒక వారం లేదా ఒక నెల తరువాత తిరిగి వెళ్లే సమయంలో ఆ యువతికి విడాకులు ఇచ్చేస్తాడు.

ఈ బిజినెస్ లో ఎక్కువగా అరబ్బుదేశాలకు చెందినవారే కస్టమర్లు. లాస్ ఏంజిల్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఇండోనేషియాలో ప్లేజర్ మ్యారేజస్ (సుఖం కోసమే వివాహ) బిజినెస్ జోరుగా సాగుతోంది. ఈ సర్వీసు కారణంగా ఇండేనేషియాకు వచ్చే టూరిస్టుల సంఖ్య బాగా పెరుగుతోంది. పక్కనే బ్యాంగ్ కాక్ ఉన్నా.. అక్కడ యువతులు వ్యభిచారం మాత్రమే చేస్తారు. కానీ ఇండోనేషియాలో అయితే వివాహం చేసుకున్న టెంపరీ భార్య వంట చేస్తుంది. కస్టమర్ భర్తకు కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తుంది.

ఇండోనేషియాకు చెందిన కహాయా అనే ఒక యువతి ఇలాగే ఈ టెంపరరీ వివాహం వ్యవస్థ బాధితురాలు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను 15 మంది కస్టమర్లతో వివాహం చేసుకున్నానని. అందరూ గల్ఫ్ దేశాలకు చెందిన కస్టమర్లేనని తెలిపింది. సౌదీ అరేబియాకు చెందిన ఒక 50 ఏళ్ల వ్యక్తితో తనకు తొలిసారి వివాహం జరిగిందని చెప్పింది. అతడిని వివాహం చేసుకుంటే ఏజెన్సీకి 850 డాలర్లు (రూ.71412) చెల్లించాడని.. అందులో ఏజెన్సీ వారే సగం తీసుకోగా తన చేతికి మాత్రం సగం కన్నా తక్కువ అందిందని ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం అయిదు రోజులు మాత్రమే ఆ వ్యక్తి తనను వివాహం చేసుకున్నాడని తెలిపింది. ప్రతీ వివాహానికి 300 డాలర్ల నుంచి 500 డాలర్ల వరకు తాను సంపాదిస్తున్నానని వెల్లడించింది. కహాయా తల్లిదండ్రులిద్దరూ వృద్ధాప్యంలో ఉన్నారు. వారిద్దరూ అనారోగ్యం కారణంగా ఏ పనిచేయలేరు. దీంతో తల్లదండ్రుల వైద్య ఖర్చులు, ఇంటి రెంటు, ఇతర ఖర్చులకు తన సంపాదన ఏ మాత్రం సరిపోవడం లేదని చెప్పింది.

కహాయా లాగే నీకా అనే యువతి కూడా ఇలాంటి 20 పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఆమె ఈ జీవితం నరకం అని భావించి.. ఆ పని చేయడం మానేసింది. ప్రస్తుతం ఇండోనేషియాకు చెందిన ఒక ప్రభుత్వ అధికారిని పెళ్లి చేసుకుంది.

ఇరాక్, ఇరాన్ లో ఈ టెంపరరీ వివాహాల సంప్రదాయం మొదలైంది. షియా ముస్లింలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే ఇస్లాం మతం దీనికి వ్యతిరేకం అయితే వ్యభిచారానికి అనుమతి లేదు కనుక ఈ కొత్ పద్ధతిని విలాసాల కోసం దర్వినియోగం చేస్తున్నారు. కొన్ని శతాబ్దాల క్రితం ఇండియాలో ముఖ్యంగా కేరళలో అరబ్బు దేశాల నుంచి వ్యాపారం కోసం వచ్చే పురుషులు ఇక్కడి మలయాళీ యువతులను వివాహం చేసుకునేవారు. ఆ తరువాత వారి బిజినెస్ సీజన్ ముగిశాక విడాకులు, భారీ మొత్తంలో డబ్బు ఇచ్చే వారు.

అయితే ఇండోనేషియాలో ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత లేదు. పైగా ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కు సంఘాలు ఈ వ్యవస్థని తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

Related News

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

Israel-Iran Impact on India: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ కు నష్టాలు.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం

World War II Bomb Japan: ఇప్పుడు పేలిన ప్రపంచ యుద్ధం బాంబు.. జపాన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

Israel Iran War: ‘నెతన్యాహు ఒక హిట్లర్.. యద్ధం ఆపేందుకు ఇండియా సాయం చేయగలదు’.. ఇరాన్ రాయబారి కీలక వ్యాఖ్యలు

Iran Israel Attack: యుద్ధం మొదలైంది.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం

New Zealand: న్యూజిలాండ్‌ను వీడుతున్న ప్రజలు.. అదోగతిలో అందాల దీవి, అసలు ఏమైంది?

Big Stories

×