EPAPER

Spam Call Death : ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..

Spam Call Death : ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’..  సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..

Spam Call Death | దేశంలో చాలామంది సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి చాలా నష్టపోతున్నారు. కోట్లు పోగొట్టుకొని సైబర్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే సైబర్ క్రిమినల్స్ బారిన పడి ఒక మహిళ చనిపోయింది. ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న ఓ మహిళకు ఇటీవల ఒక స్పామ్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి పోలీస్ అధికారిగా పోజులిస్తూ.. ఆమె కూతురు వ్యభిచారం చేసే ఒక గ్యాంగ్ లో పట్టుబడిందని చెప్పాడు. పైగా ఆమెను విడుదల చేయాలంటే వెంటనే తాను చెప్పిన బ్యాంక్ అకౌంట్ లో రూ.1 లక్ష డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ వార్త విని ఆందోళనతో ఆమెకు గుండె పోటు వచ్చి చనిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఆగ్రా నగరానికి చెందిన 58 ఏళ్ల మాలతి వర్మ అచ్నెరా ప్రాంతంలో ప్రభుత్వం బాలికల జూనియర్ హై స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త రిటైర్డ్ ఉద్యోగి. ఆమెకు ఒక కూతరు ప్రియంక, కొడుకు దిపాన్షు ఉన్నారు. కూతురు కాలేజీలో చదువుకుంటోంది.

Also Read: ‘నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఓ హత్య చేయాలి’.. ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో ఇన్ని ట్విస్టులా..


సెప్టెంబర్ 30, 2024న ఆమె స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెబుతుండగా.. ఆమెకు ఒక వ్యక్తి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తాను ఒక పోలీస్ అధికారినని పరిచయం చేసుకున్నాడు. ఆమె కూతరు ప్రియాంక వ్యభిబారం చేసే ఒక గ్యాంగ్ తో కలిసి పనిచేస్తోందని. ఆమెను అరెస్టు చేశామని చెప్పాడు. ఇదంతా విని టీచర్ మాలతి వర్మ ఆందోళనకు గురైంది. తన కూతురిని ఏమీ చేయవద్దని, ఇదంతా అబద్ధమని ఆ పోలీస్ అధికారిని కోరింది.

అయితే ఆ పోలీస్ అధికారి ఆమె బాధను అర్థం చేసుకుంటున్నానని.. అయితే ఆమె కూతురిని విడుదల చేయాలంటే రూ.లక్ష ఒక బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే.. ఆమె కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని చెప్పాడు. ఇంకా వ్యభిచారం కేసు నమోదు చేయలేదు.. వెంటనే డబ్బులు డిపాజిట్ చేస్తే.. ఆమె కూతరు ప్రియాంక ఇంటికి వస్తుందని నమ్మించాడు.

ఇదంతా విన్న టీచర్ మాలతి తన కొడుకు దిపాన్షుని కాల్ చేసి.. విషయం చెప్పింది. వెంటనే రూ.లక్ష ఏర్పాటు చేయాలని అడిగింది. అయితే దిపాన్షు ఆ సమయంలో ఆఫీసులో ఉన్నాడు. అతనికి అనుమానం వచ్చి పోలీస్ అధికారి కాల్ చేసిన నెంబర్ తనకు తెలపాలని అడిగాడు. ఆ ఫోన్ నెంబర్ మొదట +92 అనే ప్రిఫిక్స్ ఉంది. అంటే ఆ నెంబర్ ఒక స్పామ్ కాల్ అని తెలుసుకొని.. వెంటనే కాలేజీలో ఉన్న తన చెల్లికి ఫోన్ చేశాడు. ఆమె కాలేజీలోనే ఉన్నట్లు ధృవీకరించుకొని.. విషయం తన తల్లికి వివరించాడు.

Also Read: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఒక మోసగాడని.. అదంతా నమ్మవద్దు.. ప్రియాంక క్షేమంగా కాలేజీలో ఉందని తన తల్లికి అభయమిచ్చాడు. అప్పటికీ ఇంటికి చేరిన టీచర్ మాలతికి అరోగ్యం క్షీణించింది. ఆమెకు ఒళ్లంతా చెమటలు పట్టి.. కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె భర్త అది చూసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు టీచర్ మాలతిని పరీక్షించి ఆమెకు గుండె పోటు రావడంత చనిపోయిందని తెలిపారు. కుటుంబసభ్యులు ఆమెకు అక్టోబర్ 1న అంతక్రియలు చేసి.. అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్పామ్ కాల్ ద్వారా తప్పుడు సమాచారం రావడం కారణంగానే ఆమె ఆందోళన చెంది చనిపోయిందని టీచర్ మాలతి భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Related News

Sadhguru Isha Foundation Row: సద్గురు పై కామరాజ్ ఆరోపణలు ఎంతవరకు నిజం ?

PM Internship Scheme: ‘నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త’.. ఉద్యోగశిక్షణతోపాటు ప్రతినెల రూ.5000 ఆర్థికసాయం..

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది కూలీలు మృతి

PM Modi Cabinet Committee: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. భద్రతా వ్యవహారాల భేటీలో ప్రధాని ఏమన్నారు?

Train Derailed: మధ్యప్రదేశ్ రత్లామ్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

Isha Foundation: ఈషా ఫౌండేషన్‌‌లో పోలీసుల సోదాలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Big Stories

×