EPAPER

AP Politics: ఏపీలో మండుతున్న రాజకీయం.. టార్గెట్ భూమన?

AP Politics: ఏపీలో మండుతున్న రాజకీయం.. టార్గెట్ భూమన?

JANASENA vs YCP: ఏపీలో పొలిటికల్ వార్.. పీక్స్ కి చేరిందా.. అవుననే అంటున్నారు విశ్లేషకులు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ కి.. వైసీపీ రిప్లై ఘాటుగా ఉండగా.. ఇక పొలిటికల్ వార్ స్టార్ట్.. అప్పుడే ఏమైంది.. ముందుంది అసలు వార్ అనే మాట వినిపిస్తోంది. పవన్ కామెంట్స్ కి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎదురుదాడికి దిగగా.. జనసేన వర్సెస్ భూమన కామెంట్స్ వర్షం కురుస్తోంది.


వారాహి సభ ద్వారా డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు తెలిపిన పవన్.. ఒకే జాతి, ఒకే భావాన్ని చాటిచెప్పాలని ప్రకటించారు. అలాగే వైసీపీ లక్ష్యంగా పవన్ ఘాటుగానే విమర్శలు గుప్పించారు. దేవుడు తీర్పు 11 ఇచ్చినా.. ఇంకా బుద్ది రాలేదని, హిందూ ధర్మాన్ని అవమానపరిచే ఘటనలు వైసీపీ కాలంలో కోకొల్లలు జరిగాయన్నారు. అంతటితో ఆగక.. వైసీపీ పరిపాలనలో తిరుమల అపవిత్రతకు దారి తీసిందని, అందుకే సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను ముందుకు వచ్చినట్లు ప్రకటించారు .

జగన్ హయాంలో 25 లక్షల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, కల్తీ మద్యం వలన ప్రజలు చనిపోయారని విమర్శించారు. వేల కోట్ల ఇసుక మాఫీయా జరిగిందని, పర్యావరణాన్ని దెబ్బతీసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చేత తిట్లను సైతం వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొందన్నారు. కేవలం పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడానికి 2,600 కోట్ల ప్రజాధనం వృధా చేసిన వ్యక్తి, యువతకు ఉపాధి ఇవ్వకుండా రోడ్డున పడేసిన వ్యక్తి, అమర్ రాజా, లులు గ్రూప్ వంటి పరిశ్రమలు రాష్ట్రం నుండి బయటకు వెళ్లేలా చేసిన వ్యక్తి వైయస్ జగన్ అంటూ.. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.


ఇలా పవన్ ప్రసంగం ముగియగానే.. భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సాధారణంగా మరుసటి రోజు వైసీపీ నుండి స్పందన వస్తుందని అందరూ భావించారు. పవన్ చేసిన విమర్శలు ప్రజల్లోకి వెళ్లకముందే రిప్లై ఇవ్వాలని వైసీపీ భావించినట్లు తెలుస్తోంది. ఇక కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బాప్టిజం తీసుకున్న పవన్‌ సనాతన ధర్మం పాటించాడా? గొడ్డు మాంసాన్ని తింటానని చెప్పిన పవన్‌ సనాతన ధర్మం పాటించిన వారు ఎలా అవుతారు? కొత్తగా పవనానంద స్వాములు వచ్చారు అంటూ రివర్స్ లో పంచులు వేశారు. అంతటితో ఆగక పవన్ నటించిన సినిమాలోని తాకు తాకు.. పాటను పాడి అవహేళన చేశారు.

ఇక అంతే జనసేన రివర్స్ గా ట్వీట్ ల ద్వారా… భూమన మీ నెంబర్ కూడా వస్తుంది వెయిట్.. అలాగే తప్పిపోయిన మీ ఈవో ధర్మారెడ్డి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ సూచించింది. తప్పుడు ఆరోపణలు, పిచ్చి పిచ్చి వాగుడు వాగి 11 స్థానాలకు పడిపోయిన “లెవెన్ మోహన్ రెడ్డి” బ్యాచ్ తో యుద్ధం చేసే రోజులు ముగిశాయని, మా యుద్ధం సెక్యులరిజం ముసుగులో హైందవ ధర్మంపై దాడులకు పాల్పడుతున్న వారిపై, మాది జాతీయ స్థాయి యుద్ధం, మీది గల్లీలో బూతులు తిట్టుకునే చిల్లర పంచాయతీలు. ముందు శుక్రవారం కోర్టుకు వెళ్లి విచారణకు హాజరవ్వమని మీ మ్యాన్ “ఫ్రై డే” కి సూచించండి అంటూ ట్వీట్ చేసింది.

Also Read: Tdp and Ysrcp reaction: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ-వైసీపీ రియాక్షన్

ఇలా పవన్ వారాహి సభతో వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేస్తే.. వైసీపీ సైతం రివర్స్ అటాక్ భారీగానే ప్లాన్ చేసినట్లుగా ఉంది. ఏదిఏమైనా తిరుమల లడ్డుకి వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారం చిన్నగా.. జనసేన వర్సెస్ వైసీపీలా మారిందని, మున్ముందు ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కి చేరడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related News

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

Ys Jagan: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన

Ys Sharmila: వేషం మార్చారు.. భాష మార్చారు.. ఇది మీకు తగునా పవన్.. షర్మిళ సంచలన కామెంట్స్

Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి.. టీటీడీ అలర్ట్..

AP Politics: బాలినేని క్యూకి బూచేపల్లి అడ్డు తగిలేనా? జగన్ మార్క్ పాలిటిక్స్ ప్రకాశంలో ఫలించేనా..

Supreme Court Order: కర్ర పోయి కత్తి వచ్చే? తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ-వైసీపీ రియాక్షన్స్ ఇవే!

Big Stories

×