EPAPER

Kamal Hassan – Shankar : సొంత మూవీనే ముంచేంత గొడవ… అసలేం జరిగిందంటే..?

Kamal Hassan – Shankar : సొంత మూవీనే ముంచేంత గొడవ… అసలేం జరిగిందంటే..?

Kamal Hassan – Shankar.. 1996లో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar)దర్శకత్వంలో స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Hassan)నటించిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో కమలహాసన్ ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే అలా అభిమానుల ఎదురుచూపుకు తెరదించుతూ 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2 విడుదలయ్యింది.


28 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ఫలితం శూన్యం..

ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య 2024 జూలై 12వ తేదీన దాదాపు రూ .300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ .151 కోట్లు మాత్రమే రాబట్టింది. సినీ ఇండస్ట్రీలో భారీ నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాతో భారీ నష్టాలు చవి చూసిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా డిజాస్టర్ కావడానికి కారణం అటు కమల్ హాసన్ , ఇటు డైరెక్టర్ శంకర్ మధ్య ఉన్న విభేదాలే అని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే సొంతం మూవీ నే డిజాస్టర్ చేసుకునే అంత గొడవ ఇద్దరి మధ్య ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా శంకర్.. కమలహాసన్ భారతీయుడు 2 సినిమా పై ఖచ్చితమైన ఫోకస్ చేయలేకపోయారు. దీనికి తోడు తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా కూడా చేస్తున్నారు. అలా రెండు సినిమాలు ఒకే డైరెక్టర్ అనేసరికి ఆయన బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఎలాగైనా సరే సినిమా చేసి విడుదల చేయాలనుకున్నారో ఏమో.. తూ తూ మంత్రంగా సినిమా షూటింగ్ జరిపేసి విడుదల చేశారు. అయితే ఈ సినిమా కాస్త ఘోరంగా డిజాస్టర్ అయ్యింది.


ఇకపై శంకర్ కమల్ కాంబోలో మూవీ లేనట్టేనా.

ఇక ఇప్పుడు రాబోయే ఇండియన్ 3 కూడా ఆకట్టుకునేలా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ తో ఉన్న విభేదాల కారణంగానే డైరెక్టర్ శంకర్ ఇండియన్ 3 ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి, ఓటీటీ కి ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. అయితే లైకా నిర్మాణ సంస్థకు నష్టాలు రాకూడదు కాబట్టి నేరుగా థియేటర్లలో కాకుండా ఓటీటీ ఒప్పందాన్ని చేసుకొని ప్రొడ్యూసర్ సేవ్ అయ్యేలా రైట్స్ ఇచ్చేసారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో సినిమాలు రాకపోవచ్చు అని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ పక్కన పెట్టి మరీ ఫోకస్..

వాస్తవానికి ఇండియన్ 2,3 చిత్రాలపై ఫోకస్ పెట్టడం వల్లే శంకర్ రామ్ చరణ్ మూవీ ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ సినిమాకి శంకర్ అందుబాటులోకి లేకపోవడంతో ఆయనే స్వయంగా వేరే డైరెక్టర్లతో కొంతమేర షూటింగ్ కూడా చేయించారు. ఈ చిత్రానికి హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా కొంత భాగం షూటింగ్ చేశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కూడా.. మరి రాంచరణ్ సినిమాను పక్కనపెట్టి ఇండియన్ 2/3 కోసం సమయం కేటాయించినా ఫలితం మాత్రం శూన్యం అనే అసంతృప్తిలో శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం శంకర్ నిర్ణయాలు కరెక్ట్ గా లేవని, రెండు పడవల మీద ప్రయాణం అటు ఇద్దరి హీరోలకు నష్టాన్ని మిగిల్చేలా ఉందని నెటిజన్స్ కామెంట్లు చేసుకున్నారు. మరోవైపు డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. మరి ఇప్పటికైనా గేమ్ ఛేంజర్ పై ఫుల్ ఫోకస్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి శంకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related News

Pushpa2 : పుష్ప 2 లో బాలీవుడ్ బ్యూటీ.. నీ అవ్వ అస్సలు తగ్గేదేలే..

Prakash Raj: పవన్ ను వదిలేలా లేడే.. మళ్లీ ఎందుకయ్యా కదిలిస్తావ్

Tollywood Heroine : డైరెక్టర్ గా సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Martin: సొంత చిత్రాన్నే విడుదల చేయొద్దంటూ కోర్ట్ మెట్లెక్కిన డైరెక్టర్.. అసలేమైందంటే..?

Akhil Akkineni : ఈ సిగ్గుమాలిన వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిందే.. కొండా సురేఖపై అఖిల్ ఫైర్

Mystery Bangla: ముగ్గురు హీరోల జీవితాన్ని నాశనం చేసిన బంగ్లా.. సినిమా స్టోరీ ని తలపిస్తోందే..?

Chitra Shukla: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్… పెళ్లి ముహూర్తానికే గుడ్ న్యూస్

Big Stories

×