EPAPER

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Oura Ring 4 : ఫిట్‌నెస్‌ ట్రాకర్స్​ రోజు వారీ జీవితంలో భాగమైపోయాయన్న సంగతి తెలిసిందే. అయితే.గత కొంత కాలంగా ఫిట్​నెస్​​ ట్రాకర్స్​ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ వాచ్‌ల వంటి వాటికి ఇప్పుడు స్మార్ట్‌ రింగులు కూడా తోడైపోయాయి. డిస్‌ప్లే లేదన్న కొరతే గానీ స్మార్ట్‌ వాచ్​లు చేయగల అన్ని పనులనూ ఈ స్మార్ట్‌ రింగులు చేసి పెడుతున్నాయి. ఆరోగ్య వివరాలను తెలపడంతో పాటు ఇతర సమాచారాన్ని ఫోన్‌లో చూపిస్తాయి. చేతి సైగలతోనే ఇంటి పరికరాలను నియంత్రించడం, కాంటాక్స్‌లెస్‌గా డబ్బులు చెల్లించడం వంటివి చేయొచ్చు. అందుకే రోజు రోజుకీ స్మార్ట్‌ రింగులు గిరాకీ కూడా పెరుగుతోంది. అందుకు తగ్గట్టే ఆయా కంపెనీలు వాటిని కూడా సరికొత్త ఫీచర్లతో రూపొందిస్తూ మార్కెట్​లోకి వదులుతున్నాయి.


తాజాగా ఔరా కంపెనీ కొత్త స్మార్ట్​ రింగ్​ను విడుదల చేసింది. ఔరా రింగ్ 4ను గ్లోబల్ మార్కెట్​లోకి లాంఛ్ చేసింది. ఇది స్లీక్ టైటానియం మెటల్ బిల్డ్‌తో వచ్చింది. ఆరు రంగులలో ఇది లభిస్తుంది. ఎక్కువ మంది యూజర్స్​కు చేరువవ్వడం కోసం 12 వివిధ సైజ్​లతో దీన్ని అందుబాటులో ఉంచారు. హెల్త్, యాక్టివిటీ ట్రాకింగ్​కు సంబంధించి మరిన్ని ఫీచర్స్​ను జోడించి విడుదల చేశారు. ఇది ఔరా యాప్‌తో అనుసంధానంగా ఉంటూ, బ్లూటూత్ లో ఎనర్జీ (LE) కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

ధర, లభ్యత వివరాలు – ఔరా రింగ్ 4 ధర $349 (దాదాపు రూ. 29,300) నుంచి ప్రారంభం కానుంది. 4 నుంచి 15 మధ్య 12 రకాల సైజులలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ రింగ్ బ్లాక్, బ్రష్డ్ సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్, స్టెల్త్ రంగులలో లభిస్తుంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ రింగ్ US, UKతో పాటు కొన్ని సెలక్టెడ్​ యూరోపియన్ దేశాలలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. అక్టోబర్ 15 నుంచి షిప్పింగ్ ప్రారంభం అవుతుంది.


ఔరా రింగ్ 4 స్పెసిఫికేషన్ల వివరాలు – ఔరా రింగ్ 4 లైట్​ వెయిట్​, నాన్ – అలెర్జెనిక్ ఆల్ – టైటానియం మెటల్ బిల్డ్‌తో రూపొందిచబడింది. 100 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్​తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ ఔరా స్మార్ట్ సెన్సింగ్ టెక్నాలజీతో పాటు అధునాతన అల్గారిథమ్‌ను కలిగి ఉంది. ఇది మరింత కచ్చితమైన ఆరోగ్యం, వర్క్ ఔట్​ వివరాలను అందిస్తుంది.

ఇంకా ఈ డివైస్​లో చాలా సెన్సార్​లు ఉన్నాయి. అందులో రెడ్, ఇన్‌ఫ్రారెడ్ LED సెన్సార్​లు కూడా ఉన్నాయి. ఇవి వినియోగదారులు నిద్రపోతున్నప్పుడు రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షిస్తాయి. ఇక గ్రీన్, ఇన్‌ఫ్రారెడ్ LEDలు హృదయ స్పందన రేటు, వేరియబిలిటీ, నిద్రలో శ్వాసక్రియ రేటును కొలుస్తాయి

ALSO READ : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

ఇక ఈ స్మార్ట్ రింగులో ఉండే యాక్సిలరోమీటర్ రోజంతా వినియోగదారుల కదలికలు, కార్యకలాపాలను ట్రాక్ చేస్తుంటుంది. అలానే ఇందులో అమర్చిన డిజిటల్ సెన్సార్​లు శరీర ఉష్ణోగ్రతలో తేడాలను రికార్డు చేస్తుంటాయి.

అప్డేట్ చేయబడిన ఈ Oura యాప్ ఇప్పుడు మరింత వివరాణత్మకంగా స్ట్రేస్​, యాక్టివిటీస్​, రిప్రొడక్టివ్ హెల్త్ సహా ఇతర ఫీచర్లను
మెరుగ్గా అందిస్తుంది. ఈ ప్రయోగాత్మక ఫీచర్లను వినియోగదారులు ప్రయత్నించడానికి వీలుగా ఔరా ల్యాబ్స్ యాప్​లను iOS, అండ్రాయిడ్ డివైస్​లలో అందుబాటులో ఉంది.

ఫైనల్​గా ఈ ఔరా రింగ్ 4 సింగిల్ ఛార్జ్​లో గరిష్టంగా ఎనిమిది రోజుల వరకు పవర్​తో బ్యాటరీ సామర్థ్యం పని చేస్తుంది. దీని పవర్ స్థాయి ఆధారంగా ఛార్జ్ చేయడానికి 20 నుంచి 80 నిమిషాల సమయం పడుతుంది. ఛార్జర్, USB టైప్-C కేబుల్‌తో ఇది వస్తుంది. ఇంకా ఈ స్మార్ట్ రింగ్ బ్లూటూత్​ ఎనర్జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. రింగ్ బరువు 3.3 గ్రా నుంచి 5.2 గ్రాముల మధ్య ఉంటుంది.

Related News

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Whats app Videocall update : వాట్సాప్ లో ఇకపై మరింత గోప్యత.. ఆ అప్డేట్ తెచ్చేసిన మెటా

Apple Festival Sale 2024 : అదిరిపోయే డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ తో ఆపిల్ సేల్ ప్రారంభం.. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

Recharge Offers : 3 నెలలు ఫ్రీ ఇంటర్నెట్, 18 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌.. ఈ ఏడాదిలోనే బెస్ట్ ప్లాన్ ఇదే!

Best Gaming phones : అక్టోబర్​లో బెస్ట్​ కెమెరా, గేమింగ్​ స్మార్ట్ ఫోన్స్ ఇవే – ఊహించని రేంజ్​లో అతి తక్కువ ధరకే!

Big Stories

×