EPAPER

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

Kalasha Naidu Wins Asia Icon Award: సేవ చేయాలనే గుణం అదరికీ ఉండదు. అన్నార్థులను, అభాగ్యులకు అండగా నిలబడాలనే ఆలోచన రావాలంటే పెద్ద మనసు ఉండాలి. కోట్ల రూపాయలు ఉన్నా, పిల్లికి బిచ్చం పెట్టని వాళ్లు ఎంతో మంది ఉంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి చాలా ప్రత్యేకం. ఈ పాప పుట్టుకతోనే సేవా గుణాన్ని వెంటబెట్టుకుని వచ్చింది. కేవలం 11 ఏండ్ల వయసులో సమాజ సేవ విభాగంలో ప్రతిష్టాత్మ ఆసియా ఐకాన్ అవార్డును అందుకుని అందరినీ ఔరా అనిపించింది. ఈ అవార్డు అందుకున్న అతిపిన్న అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు, నూతన్ నాయుడు ముద్దుల కూతురు కలశ నాయుడు.


‘కలశ షౌండేషన్’ పేరుతో సేవా కార్యక్రమాలు

ప్రస్తుతం ‘కలశ షౌండేషన్’ పేరుతో ఈ చిన్నారి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2013 ఆగష్టు 13న జన్మించింది. చిన్నప్పటి నుంచే ఈ అమ్మాయి తోటి పిల్లలకు తన దగ్గర ఉన్న చాక్లెట్లు, బలపాలు, పలకలు, బొమ్మలను ఇచ్చేది. తల్లిదండ్రులతో పిక్ నిక్ కు వెళ్లినప్పుడు పేదల పిల్లలను చూసి బాధపడేది. వారికి చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ ఇప్పించేది. అమ్మాయి దాన గుణాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమె పేరుతో ఫౌండేషన్ ను స్థాపించారు. ‘కలశ ఫౌండేషన్’ ద్వారా ఈ చిన్నా ఎన్నో సమాజిక కార్యక్రమాలను చేపడుతున్నది. పేదలకు అన్నసాయంతో పాటు అనాథ పిల్లలకు విద్యాదానం అందిస్తోంది. ఆమె నేతృత్వంలోని కలశ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంది. తాజాగా ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక ఆసియా ఐకాన్ అవార్డులను అందుకుంది.  శ్రీలంకలో జరిగిన ఆసియా ఐకాన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కొలంబో గవర్నర్ సెంథిల్ చేతుల మీదుగా కలశా ఈ అవార్డును తీసుకుంది. సామాజిక సేవా రంగం విభాగంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందించారు.


ఆసియా ఐకాన్ అవార్డులను గట్టి పోటీ

ఆసియా ఖండంలో వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించే వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు ప్రతి ఏటా ఆసియా ఐకాన్ అవార్డులను అందిస్తారు. ఈ అవార్డుల కోసం ఆసియా ఖండం నలుమూలల నుంచి వేలాదిగా ఎంట్రీలు వస్తాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యాపారం, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, సామాజిక సేవ విభాగాల్లో ఈ అవార్డును అందిస్తారు. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కలశ అందుకుంది.

సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ అందుకున్న కలశ

ఇప్పటికే కలశ సామాజిక సేవా కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. పలు దేశాలు ఆమెకు ఎన్నో అవార్డులను అందించాయి. కొద్ది నెలల క్రితమే ఐక్యరాజ్య సమితి గ్లోబల్ పీస్ కౌన్సిల్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. అతి చిన్న వయసులో ఈ డాక్టరేట్ ను అందుకున్న చిన్నారిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే, ఆమె సేవలను గుర్తించిన లండన్ పార్లమెంట్ సభకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Related News

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

Ys Jagan: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన

Ys Sharmila: వేషం మార్చారు.. భాష మార్చారు.. ఇది మీకు తగునా పవన్.. షర్మిళ సంచలన కామెంట్స్

Big Stories

×