EPAPER

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Washing meshine Usage : వాషింగ్​ మెషీన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దుస్తులు ఉతకడానికి వాటిని ఉపయోగిస్తామన్న సంగతి తెలిసిందే. ఇది మాకు తెలీదా ఏంటని అంటారేమో? అయితే ఈ వాషింగ్ మెషీన్​లో కేవలం దుస్తులు మాత్రమే కాదు… వీటితో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా శుభ్రం చేయొచ్చు. అవును మీరు చదివింది నిజం! అవి ఏంటని ఆలోచిస్తున్నారా? ఇంతకీ అవేంటి? వాటిని మెషీన్‌లో వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!


ఏవేమి ఉతకొచ్చు అంటే –

కిచెన్‌లో వినియోగించే స్పాంజ్‌లు, వేడి గిన్నెలు కిందకు దింపడానికి వినియోగించే సిలికాన్‌ మిట్స్‌, అవెన్‌ మిట్స్‌, సిలికాన్‌ గ్లౌజులును మెషీన్​లో వేయొచ్చు. ఇంకా సిలికాన్‌ ట్రివెట్స్‌ (వేడి గిన్నెల అడుగున వేసే మ్యాట్‌) ను కూడా మెషీన్​ లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. అయితే వీటి కోసం మరీ వేడి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీళ్లను ఉపయోగించుకోవాలి.


చిన్న పిల్లలు ఆడుకునే సాఫ్ట్‌ టాయ్స్​ను వాషింగ్ మెషీన్​లో వేసి ఉతకొచ్చు. అలానే క్లాత్‌ లేదా ఫర్‌ మెటీరియల్‌తో తయారు చేసిన బొమ్మలను కూడా మెష్‌ బ్యాగ్‌లో వేసి ‘క్విక్‌ వాష్‌ ఆప్షన్‌ నొక్కితే చాలు. అవి కొత్త వాటిలా మెరిసిపోతాయి.

ఇంకా బెల్ట్​లు ఉతకాలనుకున్నప్పుడు కూడా మెష్‌ బ్యాగ్‌లో వేసి వాషింగ్‌ మెషీన్‌లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడు బెల్ట్​లకు ఉంటే మెటల్‌ హార్డ్‌వేర్‌ పాడవదు.

త్వరగా జిడ్డు పట్టే రబ్బర్‌ బ్యాండ్స్‌, హెడ్‌ బ్యాండ్స్‌, హెయిర్‌ టైస్‌ వంటి హెయిర్‌ యాక్సెసరీస్​ను కూడా మెష్‌ బ్యాగ్‌లో వేసి వాషర్‌లో శుభ్రం చేసేయొచ్చు. చర్మంపై ఉన్న మురికి, మృతకణాలు లూఫా స్పాంజ్‌లలో చేరుతాయి. కాబట్టి వీటిని కూడా మెషీన్​లో వేసి శుభ్రం చేయొచ్చని నిపుణులు అంటున్నారు. మెష్ బ్యాగ్​లో వేసి శుభ్రం చేయాలి.

ALSO READ : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

ఉతికేటప్పుడు ఇవి పాటించండి –

వాషింగ్ మెషిన్లో ఉతికేటప్పుడు చల్లటి లేదా గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేయాలి. క్విక్‌ వాష్‌ ఆప్షన్​తో అయితే ఉతకడానికి లేదా క్లీన్​ చేయడానికి వేసిన వస్తువుల నాణ్యత దెబ్బతినదు.

కాస్త గట్టిగా ఉండే వస్తువులు, సున్నితంగా ఉండే వస్తువుల్ని జిప్‌ లాక్‌ ఉన్న మెష్‌ బ్యాగ్‌లో మాత్రమే వేసి మెషీన్​లో వేయాలి. అప్పుడే వాషర్​ డ్యామేజ్‌ అవ్వదు.

దేనికైనా గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌ లేదా లిక్విడ్ ఉపయోగించాలి. మరీ సున్నితమైన వస్తువులకు క్యాస్టైల్‌ సోప్‌ లిక్విడ్‌ను వాడాలి.

దుర్వాసన వచ్చే వస్తువులకు వాష్‌ సైకిల్‌లో అరకప్పు వైట్‌ వెనిగర్‌ వేయాలి. అప్పుడు మంచి వాసన రావటమే  కాకుండా మురికి మెుత్తం తొలిగిపోతుంది.

ఉతికిన వాటిని వెంటనే ఎండలో ఆరబెట్టాలి. అప్పుడే వాటిలో ఉండే బ్యాక్టీరియా, ఇతర క్రిములు పూర్తిగా తొలగిపోతాయి.

ఇక చివరిగా వాషర్‌లో ఏది వేసినా ముందు వాటి లేబుల్‌ను పరిశీలించాలి. అలానే వాషర్‌లో వేసే ఆయా వస్తువులను క్లీన్ చేసే ఫీచర్లు మెషీన్​లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. అప్పుడే మెషీన్​లో వేసిన వస్తువులు, వాషర్‌ పాడవకుండా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నిక వస్తుంది.

Related News

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKAL Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

IRCTC Special Discounts: రైళ్లలో ఈ ప్రయాణీకులకు ఏకంగా 75 శాతానికి పైగా టికెట్ ధర తగ్గింపు, ఎందుకో తెలుసా?

IRCTC Tatkal Ticket Bookings: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఇలా చేస్తే ఈజీగా టికెట్ కన్ఫామ్ కావడం ఖాయం!

Best Schemes for Girl Child: ఇంత పెట్టుబడి పెడితే లక్షల్లో లాభం – ఆడ బిడ్డకు భవిష్యత్‌కు భరోసా ఈ ప్రభుత్వ పథకాలు

Big Stories

×