EPAPER

Court Acquits POCSO Accused| 8 ఏళ్ల పాపపై అత్యాచారం చేసిన 64 ఏళ్ల వృద్ధుడు.. పాప తల్లి తప్పు కారణంగా కేసు కొట్టివేత..

Court Acquits POCSO Accused| 8 ఏళ్ల పాపపై అత్యాచారం చేసిన 64 ఏళ్ల వృద్ధుడు.. పాప తల్లి తప్పు కారణంగా కేసు కొట్టివేత..

Court Acquits POCSO Accused| 8 ఏళ్ల పాప పార్కులో ఆడుకుంటుండగా.. ఓ 64 ఏళ్ల వృద్ధుడు ఆమెపై అత్యాచారం చేశాడని పాప తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేసి జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. సెషన్స్ కోర్టు ఆ వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది. అయితే ఆ వృద్ధుడు సెషన్స్ కోర్టు తీర్పుని హైకోర్టులో సవాల్ చేశాడు. కేసు తిరిగి విచారణ చేసిన హై కోర్టు పాప తల్లి చేసిన తప్పుని గుర్తుపట్టింది. అత్యాచారం జరిగినట్లు తగిన ఆధారాలు లేవని ఆ వృద్ధుడిని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మార్చి 2019లో మహారాష్ట్రలోని అమరావని జిల్లా అచల్‌పూర్ నగరానికి చెందిన 64 ఏళ్ల విజయ్ జంజ్వాల్ అనే వ్యక్తి ఒకరోజు తన ఇంటికి సమీపంలోని పార్క్ వద్ద కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే ఓ 8 ఏళ్ల పాప ఆడుకుంటూ ఉంది. కాసేపటి తరువాత అక్కడికి పాప తల్లి వచ్చింది. తన కూతరి పక్కన కూర్చొని ఉన్న విజయ్ జంజ్వాల్ ను అనుమాస్పదంగా చూసింది. ఆ తరువాత పాపను అక్కడి నుంచి తీసుకెళ్లింది. ఇంటి కెళ్లిన తరువాత ఆ పాప తనకు కడుపులో నొప్పిగా ఉందని, పార్క్ లో ఆ వృద్ధుడు తనను ఎత్తుకున్నాడని చెప్పింది. దీంతో పాప తల్లికి అనుమానం వచ్చింది.

Also Read:  ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్‌ని హత్య చేసిన కస్టమర్.. ఎందుకు చేశాడంటే?..


పాపపై ఆ వృద్ధుడు అత్యాచారం చేసి ఉంటాడని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేసి ఆ ప్రాంతంలో నివసించే విజయ్ జంజ్వాల్ ను అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేసింది. ఆ తరువాత అమరావతి జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. సెషన్స్ కోర్టులో పాప తనను ఆ వృద్ధుడు పట్టుకున్నాడని, తన ప్రైవేట్ పార్ట్స్ ను తాకాడని చెప్పింది. దీంతో కోర్టు విజయ్ జంజ్వాల్ దోషిగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది.

అయితే అయిదేళ్ల తరువాత 2024లో విజయ్ జంజ్వాల్ సెషన్స్ కోర్టు తీర్పుని హైకోర్టులో సవాల్ చేశారు. ఘటన జరిగినప్పుడు తన వయసు 60 ఏళ్లు పైబడింది కాబట్టి తనకు పోటెన్సీ టెస్టు చేయలేదని.. ఇలాంటి కేసుల్లో పోటెన్సీ టెస్టు చేయడం అవసరమని వాదించాడు. తాను ఏ తప్పు చేయలేదని.. బాధితురాలు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలాన్ని మరోసారి విచారణ చేయాలని కోర్టుని కోరాడు. దీంతో బాంబే హై కోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఈ కేసులో విచారణ చేప్పటి.. పాప, పాప తల్లికి కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

ఇటీవలే కేసు విచారణ జరిగింది. కోర్టులో పాప తల్లిని లాయర్ ప్రశ్నించగా.. ఆమె పార్క్ లోకి వెళ్లినప్పుడు విజయ్ జంజ్వాల్ కూర్చొని ఉండగా.. పక్కనే పాప ఆడుకుంటూ ఉందని చెప్పింది. ఈ విషయాన్ని న్యాయమూర్తి జస్టిస్ గోవింద సనప్ సీరియస్ గా తీసుకున్నారు. ఒకవేళ నిందితుడు పాపపై అత్యాచారం చేసిఉంటే పాప హాయిగా ఆడుకుంటూ ఎలా ఉంటుందని ఆమెను ప్రశ్నించారు.

”మైనర్ పై ముఖ్యంగా పదేళ్ల కంటే చిన్నపిల్లలపై అత్యాచారం జరిగితే వారు మానసికంగా భయపడిపోయి ఉంటారని.. ఘటన జరిగిన వెంటనే హాయిగా ఆడుకుంటూ ఎలా ఉండగలరని?” ప్రశ్నిస్తూ.. అసలు అత్యాచారం జరిగినట్లు ఆధారాలు చూపలేదని అన్నారు. అయితే పోక్సో కేసులో బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకోగలదు కాబట్టి.. ముందుగా పాపను మరోసారి విచారణ చేయాలని పిలిపించారు. అయితే అక్కడ అసలు విషయం బయటపడింది.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి

ఇప్పుడు పాపకు 13 ఏళ్లు. దీంతో ఆమె న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పింది. ఆమెకు ఆ రోజు కడుపునొప్పి రావడానికి ఏమిటి కారణం అని పాపను న్యాయమూర్తి అడిగారు. తనకు రెండు రోజుల క్రితం వడదెబ్బ కారణంగా అనారోగ్యం చేసిందని.. అందుకే కడుపునొప్పి వచ్చిందని తెలిపింది. ఆ తరువాత నిందితుడు విజయ్ జంజ్వాల్ తనతో ఏం చేశాడో చెప్పమని అడిగారు. అప్పుడు ఆ పాప.. ”ఆ రోజు ఆ తాత నాతో పార్కులో ఆడుకున్నాడు. నన్ను ఎత్తుకున్నాడు.” అని చెప్పింది.

మరి అయిదేళ్ల క్రితం కోర్టులో ఏం చెప్పావని ప్రశ్నిస్తే.. తన తల్లి తనను ఏం చెప్పమన్నదో అదే చెప్పానని తెలిపింది. ఇదంతా విన్న తరువాత జస్టిస్ గోవింద సనప్ తీర్పు వెలువరించారు. బాధితురాలు తన తల్లి ఏం చెప్పమన్నదో అదే కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. ఈ కేసులో అత్యాచారం జరిగినట్లు తగిన ఆధారాలు లేవు, నిందితుడి నేరం రుజువు చేసే ఆధారాలు లేవు. అందుకే అనుమాస్పద కేసుగా పరిగణించి కొట్టివేస్తున్నట్లు తెలిపారు.

Related News

Nima Hospital Murder: ‘నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఓ హత్య చేయాలి’.. ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో ఇన్ని ట్విస్టులా..

Teenagers shoot Doctor: ఆస్పత్రిలో డాక్టర్‌ను హత్య చేసిన ఇద్దరు టీనేజర్లు.. చికిత్స కోసం వెళ్లి తుపాకీతో కాల్పులు

Viral News: ఉద్యోగం పోయిందని.. డ్రైవర్ ను పొడిచిన యువకుడు.. అలా చెప్పడమే తప్పైంది!

Student Attacks Teacher: నిద్రపోతున్న టీచర్ గొంతుపై రంపంతో దాడి చేసిన విద్యార్థి.. అందరిముందు ఆ టీచర్ ఏం చేశాడంటే..

Gujarat Girl Death: బ్లీడింగ్ వస్తున్నా ఆపకుండా ‘కలయిక’.. ప్రియుడి ఒడిలోనే ప్రాణాలు విడిచిన యువతి

Flipkart Delivery Boy Murder: ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్‌ని హత్య చేసిన కస్టమర్.. ఎందుకు చేశాడంటే?..

Big Stories

×