EPAPER

Swag Movie Review : ‘శ్వాగ్’ మూవీ రివ్యూ… శ్రీ విష్ణు హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?

Swag Movie Review : ‘శ్వాగ్’ మూవీ రివ్యూ… శ్రీ విష్ణు హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?

Swag Movie Review :

‘సామజవరగమన’ ‘ఓం భీం బుష్’ వంటి హిట్ సినిమాలతో ఫామ్లో ఉన్నాడు శ్రీవిష్ణు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని ‘శ్వాగ్’ అనే మూవీ చేశాడు. తనకి ‘రాజ రాజ చోర’ వంటి డీసెంట్ హిట్ ఇచ్చిన హాసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకుడు. రీతూ వర్మ, దక్ష నాగర్కర్ హీరోయిన్లు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ పక్క ‘దేవర’ ‘సత్యం సుందరం’ వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలో ఉన్నప్పటికీ.. వాటి పోటీని తట్టుకుని నిలబడాలి అంటే ‘శ్వాగ్’ మంచి టాక్ తెచ్చుకోవాలి. మరి ఆ రేంజ్ స్టఫ్ ఇందులో ఉందో లేదో తెలుసుకుందాం రండి :


కథ :

శ్వాగనిక వంశానికి చెందిన కథ ఇది. 1550 ల టైంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ల మధ్య ఆడవాళ్ళ ఆధిపత్య తగాదాలు ఉంటాయి. భవభూతి మహారాజు(శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ) ని గుప్పెట్లో పెట్టుకోవాలని ఓ పధకం పన్నుతాడు. అందులో విజయం సాధిస్తాడు. అప్పటి నుండి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. మగవాళ్ళు పెత్తనం చేయాలి,, ఆడవాళ్లు మగవాళ్ళకి సేవలు చేయాలి అనేది అతను నిర్దేశిస్తాడు. అదే క్రమంలో తన రాజ్యంలో ఉన్న ఓ నపుంసకుడిని చంపేసి.. ఇలాంటి వాళ్ళు తన రాజ్యంలో ఉండకూడదు అంటూ తీర్మానిస్తాడు. అయితే తన తర్వాతి సంతతిలో యభూతి(శ్రీవిష్ణు) కి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలలుగా పుడతారు కానీ.. తన స్నేహితుడు(సునీల్) కి మగపిల్లలు లేరని తన ఇద్దరి పిల్లల్లో ఒకరిని దానం చేసేస్తాడు. వీరిలో ఒకరు నపుంసకులుగా పుట్టారని తర్వాత తెలుస్తుంది. మరోపక్క స్నేహితుడు తన కొడుకుని తీసుకుని వేరే ఊరుకి వెళ్ళిపోతాడు. అతని దగ్గర పెరిగిన భవభూతి(శ్రీవిష్ణు) కిరాతకుడు అవుతాడు. మరోపక్క నపుంసకుడు అయినటువంటి విభూతిని.. వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు (యభూతి). ఈ క్రమంలో భవభూతి కొడుకు సింగ(శ్రీవిష్ణు), అనుభూతి(రీతూ వర్మ) ..ల కథేంటి అనేది మిగిలిన కథ.


విశ్లేషణ :

దర్శకుడు హసిత్ గోలి ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ చాలా గందరగోళంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో దాదాపు 40 నిమిషాల వరకు కథేంటో అర్ధం కాదు. ఆ టైంలో వచ్చే కామెడీని కూడా మనం పూర్తిగా ఆస్వాదించలేం. అయితే భవభూతి ఫ్లాష్ ఎపిసోడ్ ఆసక్తిని కలిగిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ గజిబిజిగా అనిపించినా ఓకే అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ జస్ట్ యావరేజ్ అనొచ్చు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను బాగానే డిజైన్ చేశారు. కొన్ని బ్లాక్స్ బాగున్నాయి. కానీ క్లైమాక్స్ మళ్ళీ గందరగోళంగానే ముగుస్తుంది. ‘లింగ వివక్ష అనేది సమాజానికి చీడ’ అన్నట్టు ఓ లైన్ తో ముగించారు. కానీ అర్దాంతరంగానే సినిమా ముగిసిన భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యుజింగ్ గా ఉంటుంది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వించేలా ఉన్నాయి కానీ.. ఓపిగ్గా చూస్తే తప్ప అవి ఎంజాయ్ చేసేలా లేవు. సినిమా మొత్తం అటెన్షన్ తో.. ఇంకో మాటలో చెప్పాలంటే బుర్రపెట్టి చూస్తే తప్ప తొందరగా అర్ధం కాదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది. పాటలు అయితే ఒక్కటి కూడా వినసొంపుగా లేవు.

నటీనటుల విషయానికి వస్తే.. శ్రీవిష్ణు … భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి పాత్రలు చేశాడు. యభూతి పాత్ర ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. భవభూతి పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది. రీతూ వర్మ.. నటనలో కొత్తదనం ఏమీ లేదు. కానీ ఉన్నంతలో ఆమె బాగానే చేసింది. దక్ష కంటే కూడా మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్..ల పాత్రలు బెటర్ గా ఉన్నాయి. సునీల్, రవిబాబు..ల పాత్రలు ఓకే. మిగిలిన వాళ్ళు ఓకె అనిపిస్తారు.

ప్లస్ పాయింట్స్ :

సెకండాఫ్
శ్రీవిష్ణు

మైనస్ పాయింట్స్ :

కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే
పాటలు
ఫస్ట్ హాఫ్

మొత్తంగా.. ఈ ‘శ్వాగ్’ మంచి పాయింట్ తో రూపొందిన కామెడీ మూవీ. ఎంతో అటెన్షన్ తో చూస్తే తప్ప నచ్చే అవకాశాలు లేవు.

Swag Movie Rating రేటింగ్ : 2.25/5

Related News

Roja Movie: ఈ హీరో జీవితంలో ఇంత విషాదమా.. కన్నీరు పెట్టిస్తున్న స్టోరీ..!

Genelia: అర్ధరాత్రి విడాకులు.. నా జీవితంలో ఊహించని పరిణామం..!

HarshaSai: సైబర్ క్రైమ్ లో కంప్లైంట్.. వికృత చేష్టలకు బాధిత యువతి ఎమోషనల్..!

Big Tv Exclusive : RC16 షూటింగ్ కి అంతా సెట్… పూర్తి డీటైల్స్ ఇవే…

Rajinikanth: డిశ్చార్జ్ అయిన రజినీకాంత్.. కానీ..?

Jr. Ntr : ఇక్కడ సినిమాలకు బ్రేక్.. అక్కడ సినిమాలకు గ్రీన్ సిగ్నల్..

Big Stories

×