EPAPER

Devara : ‘సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నాం’… ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన నిర్మాత

Devara : ‘సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నాం’… ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన నిర్మాత

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలాగూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించలేకపోయారు కాబట్టి, అభిమానుల కోసం సక్సెస్ మీట్ ను నిర్వహిస్తారని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్లు దొరకలేదనే వార్త బయటకు రావడం ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరిచింది. కానీ దీని గురించి ఇప్పటిదాకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకపోవడంతో ఇంకా ఈవెంట్ జరుగుతుందేమో అని ఆశతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కానీ తాజాగా నిర్మాత నాగ వంశీ అఫీషియల్ గా సక్సెస్ మీట్ జరగట్లేదని తేల్చి, ఎన్టీఆర్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు.


‘దేవర’ సక్సెస్ మీట్ లేదంటూ ప్రకటన

దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి లాభాల్లోకి వెళ్లిన ‘దేవర’ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ తెలుగులో చేయకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు. ఇక మూవీ రిలీజై, మంచి కలెక్షన్లు కొల్లగొడుతుండడంతో సక్సెస్ మీట్ అయినా భారీ ఎత్తున పెడతారని అందరూ అనుకున్నారు. ‘దేవర’ టీం కూడా సక్సెస్ మీకు నిర్వహించబోతున్నామని చెప్పింది. కానీ ఇప్పుడు అది కూడా లేదు అంటూ నిర్మాత నాగ వంశీ ట్వీట్ చేసి షాక్ ఇచ్చారు. తన ట్వీట్ లో నాగ వంశీ ‘దేవర మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంతటి భారీ విజయం సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో తారక్ అన్న ‘దేవర’ సక్సెస్ మీట్ చేసి ఫ్యాన్స్ తో మాట్లాడాలని అనుకున్నారు. మేం కూడా ట్రై చేసాం. కానీ దసరా, దేవి నవరాత్రుల వేడుకలు ఉండడంతో అవుట్ డోర్ పర్మిషన్స్ రెండు రాష్ట్రాల్లోనూ దొరకలేదు. పరిస్థితులు మా చేతుల్లో లేవు కాబట్టి ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. అందుకే ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి మేము క్షమాపణలు చెబుతున్నాము. అయినా సరే సక్సెస్ మీట్ పెట్టడానికి మేము మా వంతుగా మళ్లీ ప్రయత్నిస్తాము’ అంటూ ట్వీట్ చేశారు నాగవంశీ. దీంతో ప్రస్తుతం నాగవంశీ చేసిన ట్వీట్ వైరల్ అవుతుండగా అభిమానులు మాత్రం ఎలాగైనా సరే సక్సెస్ మీట్ ను పెట్టండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.


ప్రీ రిలీజ్ ఈవెంట్ రసాభాస

‘దేవర’ మూవీ భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందే ప్రమోషన్లలో భాగంగా ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేశారు మేకర్స్. కానీ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి, ఈవెంట్ వేదిక వద్ద తొక్కిసలాట జరగడంతో క్యాన్సిల్ చేశారు. దీంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రసాభాసగా మారింది. వెంటనే ఎన్టీఆర్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడం గురించి స్పందిస్తూ తనకు కూడా ఇలా జరగడం బాధగానే ఉందని, కచ్చితంగా సక్సెస్ మీట్ ను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని మాటిచ్చారు. కానీ ఇప్పుడు అది కూడా జరిగే అవకాశం కల్పించట్లేదు.

Related News

Samantha: నేను నీ మాటను తీసుకున్నాను..థాంక్యూ.. సమంత పోస్ట్ వైరల్

Pawan Kalyan: ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, అభిమానులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, కానీ ఆడియన్స్ ను రప్పించడానికి అదనపు ఖర్చు

Janaka Aithe Ganaka : సినిమా రిలీజ్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లాన్ చేసారు

Balagam/ Janaka aitey Ganaka : “బలగం”లా ఈ సినిమాను నిలబెట్టలా.?

Game Changer Release Date: కొడుకు కోసం తండ్రి కీలక నిర్ణయం, ‘విశ్వంభర’ స్థానంలోకి ‘గేమ్ ఛేంజర్‘?

Mohanraj: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ టాలీవుడ్ విలన్ కన్నుమూత

Big Stories

×