EPAPER

Isha Foundation: ఈషా ఫౌండేషన్‌‌లో పోలీసుల సోదాలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Isha Foundation: ఈషా ఫౌండేషన్‌‌లో పోలీసుల సోదాలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

తమిళనాడులోని కోయంబత్తూరులో గల ఈషా ఫౌండేషన్‌లో పోలీసులు బుధవారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ తమిళనాడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ దాఖలు చేశారు. తన ఇద్దరు కూతర్లను ఈషా ఫౌండేషన్‌లో బలవంతంగా బంధించారని, వారిని తిరిగి తనకు అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యక్తులకు బ్రెయిన్ వాష్ చేసి.. వారిని సన్యసులుగా మార్చేస్తోందని ఆరోపించారు. ఈ కేసును విచారించి కోర్టు ఆయన ఇద్దరు కూతుర్ల నుంచి వివరణ తీసుకుంది. అయితే, వారు తమ ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నట్లు వెల్లడించారు.


ఈ సందర్భంగా హైకోర్టు ఈషా ఫౌండేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిల్లు చేసిన సద్గురు, మిగతా అమ్మాయిలను ఎందుకు సన్యాసం తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించింది. అంతేగాక.. ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించాలని, పాత క్రిమినల్ కేసుల రికార్డులను కోర్టుకు అందివ్వాలని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు బుధవారం (అక్టోబర్ 2) నుంచి ఆశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈషా ఫౌండేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Also Read: సద్గురు ఆశ్రమంలో ఏం జరుగుతోంది? పోలీసుల తనిఖీల్లో ఏం తెలిసింది?


స్టే విధించిన సుప్రీం కోర్టు

గురువారం ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు. పోలీసులు వెంటనే సోదాలు నిలిపివేయాలంటూ స్టే విధించింది. ఈషా ఫౌండేషన్, సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై నమోదైన క్రిమినల్ అన్ని కేసుల వివరాల రిపోర్టను తమకు అందివ్వాలని కోరింది. సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ ఫౌండేషన్ తరపున వాదనలు వినిపించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టీస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వెంటనే సోదాలు నిలిపి.. స్టేటస్ రిపోర్టను తమకు ఇవ్వాలని కోరింది. ఈ విచారణకు ప్రోఫెసర్ కూతుర్లలో ఒకరు వర్చువల్‌గా హాజరైంది. ఈషా ఫౌండేషన్ తమను ఎలాంటి ఒత్తిళ్లకు గురిచేయలేదని, తమ ఇష్టపూర్వకంగానే ఇందులో చేరామని వెల్లడించింది.

అసలు ఏం జరిగిందంటే..

రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ పిటిషన్‌లో ఈషా ఫౌండేషన్ తన కూతుళ్లను తమకు దూరం చేసిందని ఆరోపించారు. ‘‘ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ ఆయన కుమార్తెలకు వివాహం చేసి, జీవితంలో స్థిరపడేలా చేశారు. కానీ.. ఇతర మహిళలను మాత్రం సన్యాసినులుగా జీవించాలని ప్రోత్సహిస్తున్నారు. నా ఇద్దరు కుమార్తెలను పదేళ్లుగా తన ఆశ్రమంలో బంధించారు. మాతో సంబంధం లేకుండా చేశారు’’ అని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు.. పోలీసులు తనిఖీలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, సెన్సటివ్ విషయం కావడంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవల్సిందని అభిప్రాయపడింది.

Related News

Nitin Gadkari: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..

Punjab Woman: ముగ్గురు దొంగలకు మూడుచెరువుల నీళ్లు తాపించిన మహిళ.. తట్టుకోలేక చివరకు వాళ్లు… వీడియో

Jan Suraj Party : పార్టీ పేరు ప్రకటించిన పీకే… టార్గెట్ రూ.5 లక్షల కోట్లట!

Black Diwali for China: మనకు ‘దీపావళి’.. చైనాకు కారు చీకట్లు, ఆ నిర్ణయం ఊహించని దెబ్బకొట్టనుందా?

Rahul Gandhi| కొడుకు పెళ్లికి అంబానీ వేల కోట్లు ఖర్చు పెట్టాడు.. అదంతా ప్రజల సొమ్ము : రాహుల్ గాంధీ

SC on Demolitions: ‘దర్గా లేదు, దేవాలయం లేదు ప్రజల భద్రతే ముఖ్యం’.. సుప్రీం కోర్టు కీలక తీర్పు!

Big Stories

×