EPAPER

KONDA vs KTR : కేటీఆర్ ఏకాకి అయ్యారా.. సమంత, అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ సపోర్ట్.. బీఆర్ఎస్ నేతలు మాత్రం మౌనం!

KONDA vs KTR : కేటీఆర్ ఏకాకి అయ్యారా.. సమంత, అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ సపోర్ట్.. బీఆర్ఎస్ నేతలు మాత్రం మౌనం!

KTR vs KONDA: అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న నానుడి మాదిరిగానే.. కొన్ని సార్లు మన వెంట అందరూ ఉన్నా.. కష్టాల సమయంలో హాయ్ అనే పలకరింపు కూడా మనకు వినిపించదు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు.. మన కష్టం వారికి కష్టాలు తెస్తుందేమోనన్న భావన కూడా వారిలో ఉండొచ్చు. లేక మన మీద ఈర్ష్య, అసూయ కూడా ఉండొచ్చు. ఏదిఏమైనా ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ ను చూస్తే.. అందరూ ఉన్నా ఈ మాజీ మంత్రికి మద్దతు తెలిపే వారే కరువయ్యారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పుణ్యమా అంటూ.. బీఆర్ఎస్ కు అన్నీ చిక్కులే వస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనికి ప్రధాన కారణం మంత్రి కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ మాటల వైరమే.


తెలంగాణ మంత్రి కొండా సురేఖ లక్ష్యంగా ఇటీవల సోషల్ మీడియా ట్రోలింగ్ ఏ రీతిలో సాగిందో తెలిసిందే. అయితే ఈ ట్రోలింగ్ వెనుక మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నట్లు మంత్రి కొండా ఆరోపణ. చివరికి ట్రోలింగ్ ధాటికి మీడియా సమావేశంలో కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఇదే రీతిలో మంత్రి సీతక్క మీద కూడా ట్రోలింగ్ సాగగా.. సాక్షాత్తు సీఎం రేవంత్ అసెంబ్లీలో బీఆర్ఎస్ పై శివాలెత్తారు.

ఇలా తనపై జరిగిన ట్రోలింగ్ పై తీవ్ర అవేదన చెందిన మంత్రి కొండా మానసిక వ్యథతో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపాయి. హీరో నాగార్జున ఫ్యామిలీ విషయాన్ని మీడియా ముందు మాట్లాడడం.. అలాగే హీరోయిన్ సమంతాను వివాదంలోకి లాగడం, ఈ ఫ్యామిలీ విభేదాలకు, కేటీఆర్ కు సంబంధం ఉందనడం సంచలనంగా మారింది. అలాగే ఎందరో హీరోయిన్లు కెరీర్ ను వదిలి.. త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ సురేఖ ఘాటుగానే విమర్శించారు. అంతటితో ఆగక డ్రగ్స్ అలవాటు కూడా కేటీఆర్ కి ఉందని పొలిటికల్ బాంబ్ విసిరి వేశారనే చెప్పవచ్చు.


మంత్రి చేసిన వ్యాఖ్యలకు విమర్శలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఊపందుకున్నాయి. సోషల్ మీడియా మొత్తం మార్మోగింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఇదే రచ్చ. చివరకు హీరో నాగార్జున తొలుత స్పందించారు. ఆ తరువాత టాలీవుడ్ మొత్తం నాగార్జునకు మద్దతు పలికిందని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మొదలు.. టాప్ హీరోలు, అప్ కమింగ్ హీరోలు, హీరోయిన్స్, ఇలా ఒకరేమిటి అందరూ నాగార్జున ఫ్యామిలీకి అండగా నిలిచి, మినిస్టర్ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ జోక్యంతో మంత్రి సారీ చెప్పారు. ఇక్కడి వరకు ఓకే కానీ అసలు మంత్రి కొండాను రెచ్చగొట్టిన బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా సైలెంట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read: Etela: నేనే బహిరంగ క్షమాపణలు చెప్పి.. ముక్కు నేలకు రాస్తా: ఈటల

నాగార్జున ఫ్యామిలీ గురించి మాట్లాడి సారీ చెప్పిన మంత్రి సురేఖ.. కేటీఆర్ పై మాత్రం తగ్గేదే లేదని పునరుద్ఘాటించారు. ఇక్కడే సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీలో నెంబర్-2 గా గల కేటీఆర్ పై మంత్రి చేసిన విమర్శలకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించక పోవడం విశేషం. అసలు ఫోన్ ట్యాపింగ్ తో హీరోయిన్ లను వేధించారని మంత్రి కామెంట్ చేయగా.. ఈ విషయంపై బీఆర్ఎస్ ముఖ్యనేతలెవరూ నోరు మెదపలేదు.

ఒకవేళ చిన్నగా టాలీవుడ్, మంత్రి మధ్య వార్ జరుగుతోంది మనం సైడ్ అవుదామని అనుకున్నారా.. లేక మనకెందుకు ఈ రచ్చ అని సైలెంట్ అయ్యారా అంటూ ఇప్పుడు విశ్లేషకుల మధ్య చర్చ జోరుగా సాగుతోంది. కేటీఆర్ ఒక మాట అంటే ఊరుకోని బీఆర్ఎస్ కీలక నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారనేది పెద్ద ప్రశ్నగా మిగిలిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్న మంత్రి.. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించి వార్ కు రెడీ అన్నట్లు సంకేతం ఇచ్చారన్న భావన వినిపిస్తోంది.

Related News

Kondakal: కొండకల్ తండాలో ఏం జరుగుతోంది..? ‘స్వేచ్ఛ’ వార్తలతో విషయం వెలుగులోకి..

TG Govt: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ రైతన్నలకు రూ.500 బోనస్.. 48 గంటల్లో డబ్బు జమ

Minister Sridharbabu: వాళ్లతో నష్టపోవడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు: మంత్రి శ్రీధర్ బాబు

Rain Alert: రేపటి నుండి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలలో మాత్రం అంతంత మాత్రమే.. మరికొన్ని జిల్లాలలో..

Harishrao: ఆరునూరైనా అడ్డుకుని తీరుతా.. అవసరమైతే అక్కడికి కూడా వెళ్తా: హరీష్ రావు

Tummala: మోసగాళ్ల మాటలు నమ్మొద్దు.. రైతు భరోసా ఆగదు: మంత్రి తుమ్మల

CM Revanth Reddy: నిఖత్ జరీన్ ప్రయాణం మనకు స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్

Big Stories

×