EPAPER

Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

 


Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేని పరిస్థితి ఉంటుంది. ఆ జట్టు ఎప్పుడు ఓడుతుందో, ఎప్పుడు గెలుస్తుందో అసలు చెప్పలేము. ఆ జట్టు వివాదాలకు పాకిస్తాన్ జట్టు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందని చర్చ జరుగుతోంది.. కెప్టెన్సీ విషయంలోనూ ఎప్పుడు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ అనౌన్స్ చేశాడు. కెప్టెన్ గా కాకుండా ప్లేయర్ గానే కొనసాగుతానని చెప్పాడు. బ్యాటింగ్ మీద ఫోకస్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా ఉండటం ఒక గొప్ప గౌరవం. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని. కెప్టెన్సీ అంటేనే ఓ ప్రత్యేకమైన అనుభూతి, కానీ వర్క్ లోడ్ చాలా ఎక్కువ అవుతుందని చెప్పుకొచ్చాడు.

ఆటగాడిగా అత్యుత్తమంగా ఆడడం పైనే దృష్టి పెడతానని చెప్పాడు. ఫ్యామిలీతో సమయాన్ని గడపాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. పాకిస్తాన్ జట్టుకు ఆటగాడిగా ఎప్పుడు తన మద్దతును ఇస్తానని, తన వంతుగా సహకారాన్ని అందిస్తానని చెప్పుకొచ్చాడు. నిజానికి పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా బాబర్ వీడ్కోలు చెప్పడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ సారధ్య బాధ్యతలను వదులుకున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. ప్లేయర్ గా, బ్యాటర్ గా బాబర్ విఫలమయ్యాడు. ఆ తర్వాత తనంతట తానుగా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆట మీదే పూర్తి ఫోకస్ చేశాడు. కానీ టీ20 వరల్డ్ కప్ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాబర్ అజామ్ పై తన పూర్తి నమ్మకాన్ని చూపించింది.


 

Also Read: Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

కెప్టెన్ గా, బ్యాటర్ గా బెటర్ అనిపించింది. పొట్టి ఫార్మాట్లో పాకిస్తాన్ జట్టును నడిపించే బాధ్యతను బాబర్ అజామ్ కు అప్పగించింది. కానీ పాకిస్తాన్ జట్టు ఆటను మానలేదు. అమెరికా వంటి చిన్న జట్టు చేతిలోనూ ఓటమిపాలైంది. కనీసం తొలి దశను కూడా దాటలేకపోయింది. దీంతో బాబర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్ జట్టులో ప్లేయర్ల మధ్య తన బాడీ కూడా బాగా లేదని చర్చలు కూడా జరిగాయి. జట్టు గ్రూపులుగా విడిపోయిందన్న డిబేట్లు కూడా నడిచాయి. బాబర్ ను వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పించడం ఖాయమనే చర్చలు జోరుగా సాగాయి. అయితే స్టార్ ఆటగాడు తనంతట తానుగా జట్టు పగ్గాలని వదిలేసుకున్నాడు.

కెప్టెన్సీని వదిలేయాలని ఎవరు ఒత్తిడి చేయలేదని అనేక రకాలుగా కథనాలు వస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ తర్వాత బాబర్ స్థానంలో షాహిన్ ఆఫ్రిది కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు. అయితే న్యూజిలాండ్ తో సిరీస్ కు పరిమితమయ్యాడు. ఆ వెంటనే బాబర్ తన పగ్గాలు అందుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైట్ బాల్ ఫార్మాట్లో బాబర్ వారసుడిగా రిజ్వాన్ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. రిజ్వాన్ గత కొంతకాలం నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. పాకిస్తాన్ జట్టుకు ఆయుధంగా నిలబడుతున్నాడు. కొత్త కెప్టెన్ ఎంపికపై పీసీబీ ఇంకా ప్రకటన చేయలేదు.

Related News

Azharuddin: HCAలో భారీ అక్రమాలు..అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు !

Shardul Thakur: 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్..నువ్వు రియల్‌ హీరో శార్దూల్‌!

Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

Team India: క్రికెట్‌ లోకి కొత్త రూల్‌ తెచ్చిన టీమిండియా..బజ్‌బాల్ కాదు..ఇకపై గమ్‌బాల్ !

WTC 2025: బంగ్లా చిత్తు.. WTC ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

IPL 2025: కోహ్లీకి ఎసరు..RCB లోకి టీమిండియా కెప్టెన్‌ ?

Big Stories

×