EPAPER
Kirrak Couples Episode 1

YS Jagan: ఆ తేడాను నేనే స్వయంగా గమనించా : వైఎస్ జగన్

YS Jagan: ఆ తేడాను నేనే స్వయంగా గమనించా : వైఎస్ జగన్

YS Jagan Mohan Reddy Comments on CM Chandrababu:  ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయంటూ ఆయన ఆరోపించారు. ఈ మోసాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. ఈ విషయాన్ని తాను గమనించానన్నారు. గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంతోపాటు పలు అంశాలపై వారితో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా ఫైట్ చేయాలనేదానిపై వారికి వివరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతుందన్నారు. ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేది వైసీపేనంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Also Read: బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా? ‘హాయ్ అమ్మా’ అని టైప్ చేస్తే చాలు.. సమాచారం మీ చెంత

రాజకీయాల్లో విశ్వసనీయత, వ్యక్తిత్వం చాలా ముఖ్యమని పేర్కొంటూ.. వాటిని అలవర్చుకోవాలంటూ వైసీపీ నేతలకు ఆయన సూచించారు. అలా మెదులుతేనే ప్రజల్లో మనపై నమ్మకం కలుగుతుందన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకుంటూ ముందుకువెళ్లాలన్నారు. అంతేగానీ ధైర్యం చెడొద్దన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా వెనుకడుగు వేయొద్దన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ వారికి జగన్ సూచించారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క నేతకు, కార్యకర్తకు అండగా ఉంటాన్నారు. ఎవ్వరికి ఎప్పుడు ఆ ఆపద వచ్చినా తాను అందుబాటులో ఉంటానన్నారు. ఏపీలో రానున్న ఎలక్షన్లలో వైసీపీకే ప్రజలు పట్టం గడుతారన్నారు.


తమ హయాంలో వైసీపీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. ఏ ఒక్క హామీని కూడా విస్మరించలేదన్నారు. నవరత్నాలతోపాటు మరికొన్ని పథకాలను అమలు చేశామన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం విషయంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామన్నారు. ప్రతి ఊరిలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ ను అందించామన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో వైద్య సదుపాయం ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందేలా చూశామన్నారు. కానీ, ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఏపీలో ఎక్కడా కూడా కనిపించడంలేదన్నారు. అంతా మోసం.. అబద్దాలేనన్నారు.

Also Read: దుర్గమ్మ తల్లికి రూ.3.5 కోట్ల బంగారు కిరీటం.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చడంలేదన్నారు. చంద్రబాబు అబద్ధాలు ప్రస్తుతం మోసాలుగా మరోసారి మారాయన్నారు జగన్. చంద్రబాబు హామీలు మోసాలని తెలియడంతో ప్రజల్లో క్రమక్రమంగా ఆగ్రహం పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. వైసీపీ ఆధ్వర్యంలోని గత పాలన, ప్రస్తుత కూటమి పాలన మధ్య ఉన్న తేడాను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం అన్యాయమైన పాలన కొనసాగుతుందన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనంటూ నేతలకు ఆయన భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏమైనా కేసులు పెట్టినా వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరంలేదన్నారు.

Related News

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ వాయిదా.. మళ్లీ అప్పుడే..

Varahi Declaration: 7 పాయింట్లతో ‘వారాహి డిక్లరేషన్’.. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక చట్టం, కీలక అంశాల ప్రస్తావన

Deputy CM Pawan: ఇదే వారాహి డిక్లరేషన్.. నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదనుకున్నా: పవన్ ప్రకటన

Ex Minister Roja: తెలంగాణలో రచ్చ.. రోజాకు సెగ.. నాడు ఏమయ్యారంటూ నెటిజన్స్ గరంగరం

Durgamma Temple: దుర్గమ్మ తల్లికి రూ.3.5 కోట్ల బంగారు కిరీటం.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Dussehra: బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా? ‘హాయ్ అమ్మా’ అని టైప్ చేస్తే చాలు.. సమాచారం మీ చెంత

Big Stories

×