EPAPER
Kirrak Couples Episode 1

Dussehra: బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా? ‘హాయ్ అమ్మా’ అని టైప్ చేస్తే చాలు.. సమాచారం మీ చెంత

Dussehra: బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా? ‘హాయ్ అమ్మా’ అని టైప్ చేస్తే చాలు.. సమాచారం మీ చెంత

Dussehra2024 App: దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు.. అంతా శుభం జరుగుతుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే ప్రముఖ ఆలయాల బాట పడుతున్నారు భక్తులు. ప్రధానంగా ఏపీలోని విజయవాడలో వెలసిన ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అందుకై ప్రభుత్వం సైతం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది.


కాగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని కోరికలు విన్నవించుకుంటే.. ఇంటికి చేరే లోగా తీరుతాయని భక్తుల విశ్వాసం. సాధారణ రోజుల్లో కూడా దుర్గమ్మ తల్లిని దర్శించుకొనేందుకు భక్తజనసందోహం అధిక సంఖ్యలో ఇక్కడ కనిపిస్తుంది. అదే దసరా శరన్నవరాత్రులకు అయితే ఇక ఇసుక వేసినా రాలనంత భక్తులు.. ఈ ఆలయంలో మనకు కనిపిస్తారు. అందుకే ఈ సారి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ఆధునాతన పరిజ్ఞానంతో పలు సేవలను తీసుకు వచ్చింది. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం, ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. నేటి నుండి 12వ తేదీ వరకు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.

దసరా ఉత్సవాలకు సంబంధించిన సమస్తమైన సమాచారం కావాలంటే భక్తులకు ఇబ్బందులు తప్పవు. అదే సమాచారం తమ మొబైల్ ఫోన్ లో అందుబాటులో ఉంటే ఇంకేముంది సమస్యకు పరిష్కారం దొరికినట్లే కదా. అందుకే ప్రభుత్వం భక్తుల అందుబాటులో ఉంచేందుకు దసరా 2024′ యాప్ ను తీసుకు వచ్చింది. ఈ యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ దర్శనవేళలు, దర్శన టికెట్ల కొనుగోళ్ల కౌంటర్లు, పార్కింగ్ ప్రదేశాలు వంటి వివరాలను పొందుపరిచారు. అంతేకాదు 94418 20717 నంబర్ కు వాట్సాప్ ద్వారా.. హాయ్ అమ్మా అంటూ మెసేజ్ చేస్తే చాలు.. భక్తులకు అవసరమైన సమాచారం ఇట్టే వచ్చేస్తుంది. అలాగే పార్కింగ్ సదుపాయాల వివరాలు కూడా ఈ యాప్ లో పొందుపరచడం విశేషం.


ఇక దసరా ఉత్సవాలు ప్రారంభం కాగా.. భక్తులు ప్రతి రోజూ అమ్మవారిని వేలాదిగా తరలివచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే రోజుకొక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుండగా… సాయంకాలం వేళ భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. బెజవాడ కనక దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చే వారు.. పోలీసులకు, ఆలయ కమిటీ సభ్యులకు సహకరించాలని వారు కోరుతున్నారు. అలాగే వీఐపీ దర్శనాలు ఉన్నప్పటికీ ఆలయం వద్ద సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరి మీరు.. దసరా ఉత్సవాలకు విజయవాడ వెళుతున్నారా.. అయితే ఈ యాప్ ఒక్కటి డౌన్లోడ్ చేయండి.. సమాచారం మొత్తం మీ చేతిలో ఉన్నట్లే.. అలాగే సమస్య ఇంకా జఠిలంగా ఉందా.. వాట్సాప్ లో హాయ్ అమ్మా.. అని టైప్ చేస్తే సరి.

Related News

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ వాయిదా.. మళ్లీ అప్పుడే..

Varahi Declaration: 7 పాయింట్లతో ‘వారాహి డిక్లరేషన్’.. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక చట్టం, కీలక అంశాల ప్రస్తావన

Deputy CM Pawan: ఇదే వారాహి డిక్లరేషన్.. నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదనుకున్నా: పవన్ ప్రకటన

Ex Minister Roja: తెలంగాణలో రచ్చ.. రోజాకు సెగ.. నాడు ఏమయ్యారంటూ నెటిజన్స్ గరంగరం

YS Jagan: ఆ తేడాను నేనే స్వయంగా గమనించా : వైఎస్ జగన్

Durgamma Temple: దుర్గమ్మ తల్లికి రూ.3.5 కోట్ల బంగారు కిరీటం.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Big Stories

×