EPAPER
Kirrak Couples Episode 1

Samantha : హలో వెబ్‌సైట్లూ… ఇకనైనా ఆపండి… సమంత ఆట వస్తువు కాదు.

Samantha : హలో వెబ్‌సైట్లూ… ఇకనైనా ఆపండి… సమంత ఆట వస్తువు కాదు.

Samantha :


వందలాది వెబ్ సైట్లు.. పాపం ఒక అమ్మాయి.. ఏ చిన్న టాపిక్ వచ్చిన ఆమె వైపే వేలు చూపుతూ నిందించారు. క్యారెక్టర్ ని బ్యాడ్ చేశారు. ఆనారోగ్యం అంటూ నెలల పాటు బెడ్ పైనా ఉన్నా… వదల్లేదు. సినిమాలకు దూరమైన ఆమె మీకు టాప్ స్టోరీ. ఇక చాలు వదిల్లేయండి. ఆమె బతుకు ఆమెను బతకనివ్వండి….

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. చాలామంది హీరోయిన్ గా తమ ప్రతిభను చూపిద్దామని వచ్చి వెను తిరిగినవాళ్ళు ఉన్నారు. కొంతమంది మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కూడా ముందు ముందు వాళ్ళకి సరైన హిట్స్ లేకుండా కనుమరుగైపోయారు.


ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమాతోనే చాలామంది యువ హృదయాలను కొల్లగొట్టింది. అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన సినిమాలు ఎంచుకుంటూ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసింది సమంత. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో కూడా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కేవలం రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో విరాళాలు కూడా అందించింది సమంత.

సమంత టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా సమంత తన ప్రతిభను నిరూపించుకుంది. నాగచైతన్యతో కొంత కాలం పాటు ప్రేమలో ఉన్న సమంత తనను పెళ్లి చేసుకుంది. కానీ వారికున్న వ్యక్తిగత కారణాల వలన ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలవకుండా ఇద్దరు పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకున్నారు. అప్పుడు చాలా వెబ్సైట్లు సమంత గురించి కథనాలు రాస్తూ వచ్చాయి. అలానే చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా సమంత గురించి దారుణంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. వాటిపై సమంత యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ కూడా చేసారు.

ఇక రీసెంట్ టైమ్స్ లో ఏ విషయంలోకైనా సమంతాను లాగి పోక్ చేయటం అనేది చాలా వెబ్సైట్స్ కి అలవాటుగా మారిపోయింది. తన పని తాను చేసుకున్న కూడా గుచ్చి గుచ్చి ఆమెను వేధించటం జరుగుతుంది. విడాకులు ఇష్యూ తర్వాత తన హెల్త్ గురించి కూడా కొన్ని వెబ్సైట్లు దారుణంగా రాసాయి. కొన్ని సందర్భాల్లో స్టేజ్ పై కూడా సమంత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక నాగచైతన్య రెండవ వివాహానికి సిద్ధమవుతున్నప్పుడు కూడా అనవసరంగా సమంత గురించి చాలామంది మాట్లాడారు.

ఇక ప్రస్తుతం పొలిటికల్ ఇష్యూస్ లో కూడా సమంతను కార్నర్ చేయడం కొంతమంది మొదలుపెట్టారు. ఇదే చనువుగా తీసుకొని ఇంకా కొంతమంది సమంత పై వార్తలు ప్రచురిస్తూ పబ్బం గడుపుతున్నారు. ఏదేమైనా ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. లైఫ్ “లోలో” ఉన్నప్పుడు మన వంతుగా మోరల్ సపోర్ట్ ఇచ్చి తనపై అభిమానాన్ని చూపిస్తే, మనల్ని ఇంకొంచెం కాలం పాటు ఆవిడ అలరిస్తారు. ఆమె పేరుతో మనం బిజినెస్ ఆపి, భరోసా ఇద్దాం.

Related News

Devara: కలెక్షన్లు తగ్గడం వెనుక వారి హస్తము ఉందా.. అసలు నిజం ఏంటంటే..?

Kasthuri Shankar: సురేఖ వివాదంలోకి త్రిషను లాగిన బుల్లితెర నటి.. కొత్తేమి కాదంటూ..?

Filim Chanber : కొండా సురేఖ వ్యాఖ్యల పై ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం..దీనిపైనే చర్చ.

Rakul Preet Singh: ఏ వ్యక్తితో నాకు సంబంధం లేదు.. నా పేరు వాడితే బాగోదు.. రకుల్ ఫైర్

Devara: దేవర సక్సెస్ పార్టీ.. ఎవరు ఇస్తున్నారు.. ఎవరెవరు వస్తున్నారు అంటే.. ?

Devara : ‘సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నాం’… ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన నిర్మాత

Nagarjuna: కొండా సురేఖపై పరువునష్టం దావా.. ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో!

Big Stories

×