EPAPER
Kirrak Couples Episode 1

CM Revanthreddy Angry: బీఆర్ఎస్‌పై సీఎం ఫైర్.. బావ బావమరుదుల ఆక్రమణలు, ఈటెలకు ఆ వాసన పోలేదంటూ

CM Revanthreddy Angry: బీఆర్ఎస్‌పై సీఎం ఫైర్.. బావ బావమరుదుల ఆక్రమణలు, ఈటెలకు ఆ వాసన పోలేదంటూ

CM Revanthreddy Angry: బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. మూసీ అభివృద్దిని అడ్డుకుంటున్న కారు పార్టీ నేతల బాగోతాలను బయటపెట్టారు. జన్వాడ, అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లు అక్రమ నిర్మాణాలు కాదా అంటూ ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి ఆస్తుల గురించి అందరికీ తెలుసని, ఎంపీ ఈటెల రాజేందర్‌కు పాత పార్టీ వాసన పోలేదన్నారు.


మూసీ ప్రక్షాళనను బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడాన్ని తూర్పారబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ అభివృద్ధి విషయంలో అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని మీరు రావాలని అన్నారు. చెరువు భూములను ఫ్లాట్లు చేసి అమ్ముకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా అంటూ ప్రశ్నించారు. ఆక్రమణలు తొలగిస్తే సంచులు ఎలా వస్తాయని, తీసుకున్నవారికే వాటి గురించి తెలియాలని కేటీఆర్‌కు చురకలు అంటించారు.

సికింద్రాబాద్​ సిక్ విలేజీ ప్రాంతంలోని హాకీ మైదానంలో కుటుంబ గుర్తింపు, డిజిటల్​ కార్డు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, పేదలకు అన్యాయం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు ఏడుస్తున్నారని అన్నారు.


రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయని, అందులో రూ.500 కోట్లు మూసీలో ముంపునకు గురైనవారికి పంచిపెట్టాలన్నారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఆరోజు సూచనలు ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, సబిత కుమారుల ఫామ్‌‌హౌజ్‌లు కూల్చాలా వద్దా? మీరే చెప్పాలంటూ ప్రజలను ప్రశ్నించారు.

ALSO READ: సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి.. భవిష్యత్‌ భరోసా

మూసీ నదిని అడ్డుపెట్టుకుని ఫామ్‌హౌజ్‌లు కాపాడుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి. హైదరాబాద్‌ను ఎలా కాపాడుకోవాలో ఆలోచించకుండానే పనులు చేస్తున్నామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తప్పించుకున్నా ఏదో ఒకరోజు మీ భరతం పడతామన్నారు. మూసీ పేదలకు డబుల్ బెడ్‌రూంలు ఇవ్వాలా? వద్దా? అనేది ప్రతిపక్షాలు చెప్పాలని వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో కిరాయి మనుషులతో బావాబామ్మర్దులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు హడావిడి చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రానికి దోచుకున్న బీఆర్ఎస్ నేతలు, ఫామ్‌హౌజ్‌లు కాపాడుకోవడానికే హైడ్రాకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. మూసీ ఒడ్డున జీవచ్ఛవంలా బతుకుతున్నవారిని ఆదుకుంటుంటే.. అడ్డుపడతారా? అని దుయ్యబట్టారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసినవి అప్పులు, తప్పులేనని విమర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి. కేసీఆర్ చేసిన తప్పులను సరి చేస్తున్నామని, అధికారం కోల్పోవడంతో విచక్షణ కోల్పోయి ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అడ్డగోలు వాగుడు ఆపాలన్న సీఎం.. తాను ఎంపీగా ఉన్నపుడు కంటోన్మెంట్‌ను అభివృద్ధి చేశానని వెల్లడించారు.

మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లు కట్టుకున్న పేదల బాధ తనకు తెలుసన్న సీఎం రేవంత్‌రెడ్డి.. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూస్తుంటే బాధగా ఉందన్నారు. కానీ, హైదరాబాద్ బాగు కోసం ఎవరో ఒకరు నడుం కట్టాల్సిందేనని.. అందుకే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు. పేదలకు ఏం చేయాలో ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు చేస్తే తాము స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Related News

CM Revanth Reddy: నిఖత్ జరీన్ ప్రయాణం మనకు స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్

Dussehra Offer: దసరా కానుకగా బంపర్ ఆఫర్.. మీకు ఈ శుభవార్త తెలిస్తే… వెంటనే అప్లై చేసేస్తారు!

KONDA vs KTR : కేటీఆర్ ఏకాకి అయ్యారా.. సమంత, అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ సపోర్ట్.. బీఆర్ఎస్ నేతలు మాత్రం మౌనం!

Etela: నేనే బహిరంగ క్షమాపణలు చెప్పి.. ముక్కు నేలకు రాస్తా: ఈటల

TG Govt: కన్నీరు రానివ్వము కానీ.. ఆ పార్టీ మాటలు నమ్మొద్దు – మంత్రి తుమ్మల

Konda Surekha: మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ.. ఈసారి ఏమన్నారంటే..?

Jhansy Reddy: కూలిన వేదిక, ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు.. నటి ప్రియాంక మోహన్‌కు తప్పిన ప్రమాదం

Big Stories

×