EPAPER
Kirrak Couples Episode 1

Pawan Kalyan: సనాతన ధర్మం వల్ల సమంత – నాగ చైతన్య ఇష్యూ కనిపించలేదా… ?

Pawan Kalyan: సనాతన ధర్మం వల్ల సమంత – నాగ చైతన్య ఇష్యూ కనిపించలేదా… ?

Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వివాదాస్పదంగా మారాయి కొండ సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలు. హైడ్రాలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోని ఎన్ కన్వెన్షన్ కూల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మినిస్టర్ కొండా సురేఖ స్పందిస్తూ ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే తన దగ్గరికి సమంతాను పంపమని నాగర్జున ను కేటీఆర్ కోరినట్లు ఆమె వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులంతా కూడా వీటిని ఖండిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇక దీనిపై కొండా సురేఖ కూడా స్పందిస్తూ సమంతకు తన క్షమాపణలు తెలిపారు.


మామూలుగా ఏదైనా ఒక విషయం జరిగితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది స్పందించడం అనేది కామన్ గా జరుగుతుంది. ఇంకొంతమంది ఏమీ పట్టనట్టు ఉంటారు.ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను గురించి చాలామంది రెస్పాండ్ అయ్యారు. కేవలం అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా అక్కినేని అభిమాన సంఘాలు. జూనియర్ ఎన్టీఆర్, నాని, అల్లు అర్జున్ ఇలా చాలామంది రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు. అందరి ఎదురుచూపులు కూడా పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుందని ఉన్నాయి.

సమంత ఇష్యూ ని సనాతన ధర్మం డామినేట్ చేసిందా.?


ఇక కొంతమంది పవన్ ను విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లడ్డు గురించి ఇష్యూ జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజులు పాటు దీక్షను చేపట్టారు. అయితే లడ్డు విషయంలో ఒక సినిమా ఈవెంట్ లో  కార్తీ మాట్లాడిన విషయాన్ని కూడా పట్టించుకున్న పవన్ కళ్యాణ్ ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కూడా ఎందుకు పట్టించుకోలేదు అనేది కొందరి వాదన. వాస్తవానికి కార్తీ విషయంలో తప్పు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఓపెన్ గా కామెంట్స్ వైరల్ అవుతున్న కూడా పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకపోవడంతో సమంత ఇష్యూ ని సనాతన ధర్మం డామినేట్ చేసిందని కొంతమంది విమర్శించడం మొదలుపెట్టారు.

ఇక పవన్ కళ్యాణ్ దీక్షలో ఉండడంతో కాలినడకన నిన్ననే తిరుపతి కూడా బయలుదేరారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి అస్వస్థత ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక సెలైన్ కూడా ఎక్కుతున్నట్లు తెలుస్తుంది. డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడు. దీంతోపాటు నేడు వారాహి సభ జరగనుంది. ఇక్కడ ఒక వైపు సెలైన్లు ఎక్కుతున్న కూడా సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు. సమంత విషయంపై స్పందించట్లేదు. ఒక నటిగా సమంతపై ఎంత గౌరవం ఉందో అత్తారింటికి దారేది సినిమా ఈవెంట్ లో కూడా మాట్లాడుతూ వచ్చారు పవన్ కళ్యాణ్. అటువంటిది అలాంటి నటిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనేది చాలామందికి అర్థం కావట్లేదు.

Related News

Kasthuri Shankar: సురేఖ వివాదంలోకి త్రిషను లాగిన బుల్లితెర నటి.. కొత్తేమి కాదంటూ..?

Filim Chanber : కొండా సురేఖ వ్యాఖ్యల పై ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం..దీనిపైనే చర్చ.

Rakul Preet Singh: ఏ వ్యక్తితో నాకు సంబంధం లేదు.. నా పేరు వాడితే బాగోదు.. రకుల్ ఫైర్

Devara: దేవర సక్సెస్ పార్టీ.. ఎవరు ఇస్తున్నారు.. ఎవరెవరు వస్తున్నారు అంటే.. ?

Devara : ‘సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నాం’… ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన నిర్మాత

Nagarjuna: కొండా సురేఖపై పరువునష్టం దావా.. ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో!

Vettaiyan : ‘వేట్టయన్’పై బ్యాన్ డిమాండ్.. వివాదంపై కోర్టు ఏం తేల్చిందంటే?

Big Stories

×