EPAPER
Kirrak Couples Episode 1

Pomegranate: 7 రోజులు దానిమ్మ తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

Pomegranate: 7 రోజులు దానిమ్మ తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

Pomegranate: దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. దానిమ్మలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దానిమ్మ తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి వేగం గణనీయంగా పెరుగుతుంది. దానిమ్మ చర్మానికి కూడా మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు క్రమం తప్పకుండా దానిమ్మపండును తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


దానిమ్మలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. మీరు ప్రతిరోజు 7 రోజుల పాటు దానిమ్మపండును తీసుకుంటే శరీరంలో తప్పకుండా మార్పును చూస్తారు. మరి దానిమ్మ తినడం వల్ల కలిగే 5 గొప్ప ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ తినడం వల్ల 5 ప్రయోజనాలు..


గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అంతే కాకుండా తరుచుగా దానిమ్మ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి రోజు దానిమ్మ తినడం చాలా మంచిది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది.

క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది:
దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ , బ్రెస్ట్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని దానిమ్మ తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. తరుచుగా దానిమ్మ తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు కూడా చాలా మేలు కలుగుతుంది.

Also Read: యాలకుల నీటితో ఈ సమస్యలన్నీ దూరం

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరాన్ని తయారుచేస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దానిమ్మపండును క్రమం తప్పకుండా తినాలి.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:
జీర్ణ సమస్యలతో బాధపడేవారికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది. దానిమ్మలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేసి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

చర్మానికి మేలు చేస్తుంది:
దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా దానిమ్మపండును తినడం వల్ల ముఖంలో మెరుపు పెరిగి చర్మం మెరుస్తుంది. అంతే కాకుండా చర్మం అందంగా కనిపిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Headache: తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana For Skin: అరటి పండుతో గ్లోయింగ్ స్కిన్

Curry Leaves: కరివేపాకు గురించిన 5 ఆశ్చర్యకర విషయాలు

Skin Care: చెక్కరతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది

Pedicure: పండగ సమయంలో పార్లర్‌కి వెళ్లకుండానే మెరిసే పాదాలు మీ సొంతం !

Cardamom Water: యాలకుల నీటితో ఈ సమస్యలన్నీ దూరం

Big Stories

×