EPAPER
Kirrak Couples Episode 1

Israel-Iran Impact on India: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ కు నష్టాలు.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం

Israel-Iran Impact on India: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ కు నష్టాలు.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం

Israel-Iran Impact on India| మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధంతో ప్రపంచమంతా అలర్ట్ అయింది. లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించి దాడులు చేస్తోంది. దీనికి సమాధానంగా ఇరాన్ రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ పై దాదాపు 200 క్షిపణులతో దాడులు చేసింది. అయినా ఇజ్రాయెల్ దూకుడుగానే ప్రవర్తిస్తోంది.


లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక దళాలు హిజ్బుల్లా మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ని కట్టడి చేయడానికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని నిలిపివేసేందుకు ఇరాన్ ఆలోచిస్తోంది. ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న రెడ్ సీ (ఎర్ర సముద్రం) మార్గం నుంచి ప్రపంచంలోని 12 శాతం అంతర్జాతీయ బిజినెస్ జరుగుతంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ షిప్ కంటెయినర్లలో 20 శాతం ఈ మార్గంలోనే ప్రయాణిస్తాయి. ముఖ్యగా భారతదేశం వాణిజ్య నౌకలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటాయి.

ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ దేశపు హౌతీ విద్రోహులకు హిజ్బుల్లాతో మంచి సంబంధాలున్నాయి. ఈ మార్గంలో రాకపోకలు చేసే వాణిజ్య నౌకలపై గత సంవత్సర కాలంలో గాజాలో ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ.. హౌతీ విద్రోహులు దాడులు చేశారు. ఈ కారణంగా కొంత కాలం క్రితం షిప్పింగ్ కంటెయినర్ నౌకలు ఆ సముద్ర మార్గంలో కాకుండా ఆఫ్రికా చూట్టూ తిరిగి వెళ్లాల్సివచ్చింది. ఆ తరువాత కతర్, అమెరికా, బ్రిటన్ దేశాలు కలుగజేసుకొని ఇజ్రాయెల్ కొంతవరకు నిలువరించాయి. దీంతో హౌతీ విద్రోహులు వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఆపేశారు.


Also Read: ఇప్పుడు పేలిన ప్రపంచ యుద్ధం బాంబు.. జపాన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

రెడ్ సీ మార్గంలోనే భారతదేశం పెట్రోల్, ముడి చమురు దిగుమతులు, దేశీయ ఎగుమతులు చేసుకుంటూ ఉంటుంది. క్రిసిల్ రేటింగ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఎర్ర సముద్రం మీదుగా ఈజిప్టు పక్కనే ఉన్న సుయెజ్ కెనాల్ మార్గాన భారతదేశం యూరోప్, ఉత్తర అమెరికా, ఉత్తర అఫ్రికా, కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాలతో వ్యాపారం జరుపుతోంది. రిపోర్ట్ లో 2023 డేటా ప్రకారం.. ఇండియా ఎగుమతులలో 50 శాతం అంటే రూ.18 లక్షల కోట్ల విలువ గల ఉత్పత్తులు, 30 శాతం (రూ.17 లక్షల విలువ) దిగుమతులు ఈ రెడ్ సీ మార్గం ద్వారానే జరుగుతున్నాయి. భారతదేశం సముద్ర మార్గాన గత సంవత్సరం చేసుకున్న ఎగుమతులు, దిగుమతులు మొత్తం విలువ రూ.94 లక్షల కోట్లు. రెడ్ సీ మార్గంలోనే అరబ్ దేశాలు (సౌదీ అరేబియా, కతార్, యుఎఇ, కువైట్), ఇండియా మధ్య వ్యాపారం జరగుతోంది. అరబ్ దేశాలతో ఇండియాకు మంచి సంబంధాలు ఉండడంతో ప్రస్తుతానికి బిజినెస్ సజావుగా సాగుతోంది.

2023 నవంబర్ లో హౌతీ విద్రోహులు రెడ్ సీ మార్గంలో షిప్పింగ్ కంటెయినర్ నౌకలపై దాడులు చేయడంతో ఇండియా, చైనా దేశాల నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లవలిసి వచ్చింది. దీంతో ప్రయాణ సమయం 15 నుంచి 20 రోజులు ఎక్కువ అయ్యేది. ఈ కారణంగా రవాణా ఖర్చు, ఇన్‌సూరెన్స్ ఖర్చు పెరిగిపోయింది. హౌతీ విద్రోహులు దాడుల కారణంగా ఒక్క ఇండియానే కాదు సుయెజ్ కెనాల్ ఆదాయం కూడా దెబ్బతింది. రెడ్ సీ మార్గంలో ప్రయాణించే షిప్పింగ్ కంటెయినర్ నౌకల ద్వారా సుయెజ్ కెనాల్ నిర్వహణ చేసే ఈజిప్టు దేశానికి ప్రధాన ఆదాయం వస్తుంది. హౌతీ విద్రోహులు దాడులు చేయడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకల సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా సూయెజ్ కెనాల్ ఆదాయం కూడా 50 శాతం తగ్గిపోయింది.

Also Read:  బేరుట్‌లో కూలిపోయిన ఇళ్లు.. బాంబుల భయంతో రోడ్లపై నిద్రిస్తున్న వేలాది ప్రజలు..

గాజాలో పరిస్థితులు మెరుగుపడకముందే ఇజ్రాయెల్ లెబనాన్ లో హిజ్బుల్లాపై దాడి చేసింది. హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను హత్య చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్ పై 200 క్షిపణలు ప్రయోగించింది. అయినా ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. ఈ తరుణంలో మరోసారి హౌతీ విద్రోహులు రెడ్ సీ మార్గంలో అలజడి సృష్టించే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచదేశాల వాణిజ్యంపై కొడితే ఆ ఒత్తిడి ఇజ్రాయెల్ పై పడుతుందని ఇరాన్ భావిస్తోంది. ఇదే జరిగితే ఇండియాకు భారీ నష్టాలు తప్పవని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Related News

World War II Bomb Japan: ఇప్పుడు పేలిన ప్రపంచ యుద్ధం బాంబు.. జపాన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

Israel Iran War: ‘నెతన్యాహు ఒక హిట్లర్.. యద్ధం ఆపేందుకు ఇండియా సాయం చేయగలదు’.. ఇరాన్ రాయబారి కీలక వ్యాఖ్యలు

Iran Israel Attack: యుద్ధం మొదలైంది.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం

New Zealand: న్యూజిలాండ్‌ను వీడుతున్న ప్రజలు.. అదోగతిలో అందాల దీవి, అసలు ఏమైంది?

Turkish Influencer suicide: తనను తానే పెళ్లి చేసుకున్న తుర్కిష్ ఇన్ఫ్లు యెన్సర్ ఆత్మహత్య

Israel Bomb Hezbollah: దారుణమైన చావు.. హిజ్బుల్లా చీఫ్ హత్యకు 900 కేజీ అమెరికా బాంబు ఉపయోగించిన ఇజ్రాయెల్..

Big Stories

×