EPAPER
Kirrak Couples Episode 1

Rama Namam: రామనామం 29రోజులపాటు జపిస్తే ఆ పనికి తిరుగుండదు

Rama Namam: రామనామం 29రోజులపాటు జపిస్తే ఆ పనికి తిరుగుండదు

Rama Namam:అసాద్యమనుకున్న కార్యాలను కూడా సాధించి పెట్టేది తంత్ర ప్రయోగం. ఈ తంత్ర ప్రయోగాన్ని శుభ తిధి ఉన్నఆదివారం నాడు మొదలుపెట్టి, వరుసగా 29 రోజులపాటు, అంటే తరువాత వచ్చే 5వ ఆదివారం వరకు చేయాలి. ఈ తంత్ర ప్రయోగం ఒక్క సారికి మత్రమే, ఒక్క కోరికను, ఒక్క కార్యాన్ని సాదించడానికి మాత్రమే పనిచేస్తుంది. ఆదివారం పూట తెల్లవార జామున లేచి స్నానం చేసి, పూజ చేసే చోట కూర్చుని, ఒక గుప్పిట వడ్ల గింజలను తీసుకుని రామయ్యా రామ చంద్రా యా, జానకి ప్రాణ వల్లభాయా, అపద్దుదరాకాయా స్వాహః అన్న మంత్రాన్ని జపిస్తూ మీరు సాదించాలనుకుంటున్న కార్యాన్ని, నేరవేరాలనుకుంటున్న కోరికను మీ మనస్సులో తలుచుకుంటూ, గుప్పిట వడ్లనూ వలచి, బియ్యం జాగ్రత్తగా ఒక డబ్బాలో వేయండి.. ఇలా ప్రతిరోజు శనివారం వరకు చేయాలి.


మొదటి ఆదివారం నుండి మొదటి శనివారం వరకు వలచిన బియ్యాన్ని, రెండో ఆదివారం నాడు తెల్లవారి, మొత్తం బియ్యాన్ని దంచి పొడి చేసుకుని, చలిమిడి చేసి, శ్రీ సీతారాముల పట్టాభిషేకం చిత్ర పటం ముందు నివేదన చేయాలి. రకరకాల పుష్పాలను స్వామికి సమర్పించి, ధూపం వేసి, దీపం వెలిగించి విశేష పూజ చేయాలి. ఇదే విధంగా రెండో ఆదివారం నుంచి తర్వాత రెండవ శనివారం వరకు వలచిన బియ్యంతో మూడవ ఆదివారం నాడు విశేష పూజ చేయండి. ఇదే పద్దతిలో నాలుగో ఆదివారం నాడు, ఐదో ఆదివారం రోజు విశేష పూజ చేసారంటే ఈ తంత్ర ప్రయోగం పూర్తయినట్లే. మొత్తం 29 రోజుల పాటు ఈ పూజ చేయాలి.

ఇంత సమయం పాటు మంత్రం చెప్పాలి, మంత్రం ఇన్ని సార్లు చెప్పాలన్న నియమం ఏదీ లేదు. కానీ ఒక గుప్పెట వడ్ల గింజలను వలిచి బియ్యం తీసేంత వరకు మంత్ర జపం చేస్తే చాలు. మీరు ఒకే కోరిక కోరుకుని, భక్తి శ్రద్దలతో చేశారంటే, అసాధ్యమని సుసాధ్యం అవుతుంది. అనుకున్న పని తప్పక నెరవేరతాయని శాస్త్రం చెబుతోంది.


Related News

Vishnu Rekha In Hand: విష్ణువు రేఖ చేతిలో ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయాలే సాధిస్తారు

Tirgrahi yog 2024 October: త్రిగ్రాహి యోగంలో ఈ 3 రాశుల వారు డబ్బు పొందబోతున్నారు

Lucky Zodiac Sign : 4 రాజయోగాల అరుదైన కలయికతో ఈ 3 రాశుల వారు ధనవంతులు కాబోతున్నారు

October Lucky Zodiac: శని-రాహువు కలయికతో 5 రాశులకు అడుగడుగునా ప్రమాదాలే

October Month Lucky Rashifal: అక్టోబర్ లక్ష్మీ నారాయణ రాజయోగంతో వీరి జాతకం మారబోతుంది

Masik Shivratri 2024 September: మాస శివరాత్రి ఎప్పుడు ? తేదీ, పూజ శుభ సమయం ఇవే

Shani Dev: జాతకంలో శని గ్రహం శుభం లేదా అశుభం అయితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి

Big Stories

×