EPAPER
Kirrak Couples Episode 1

Motorola ThinkPhone 25 : కిర్రాక్ ఫీచర్స్ తో అదిరిపోయే మెుబైల్ ను లాంఛ్ చేసిన మోటోరోలా

Motorola ThinkPhone 25 : కిర్రాక్ ఫీచర్స్ తో అదిరిపోయే మెుబైల్ ను లాంఛ్ చేసిన మోటోరోలా

Motorola ThinkPhone 25 : ప్రముఖ టెక్ బ్రాండ్ మోటోరోలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అదిరిపోయే ఫీచర్స్ తో పాటు అందుబాటు ధరలోనే మొబైల్స్ లో అప్డేటెడ్ వెర్షన్స్ ను తీసుకొస్తుంది. తాజాగా కిర్రాక్ ఫీచర్స్ తో థింక్‌ఫోన్ 25 (Thinkphone 25) పేరుతో లేటెస్ట్ వెర్షన్ ను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్స్ చూసిన వారెవరైనా  ఔరా అనాల్సిందే.


మొబైల్ బ్రాండ్ మోటోరోలా థింక్ ఫోన్ 25 పేరుతో స్పెషల్ ఎడిషన్ ను ప్రవేశపెట్టింది. హైక్వాలిటీ కెెమెరా, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, డాల్బీ ఆడియో సపోర్ట్, స్పెషల్ సెన్సార్స్ వంటి బెస్ట్ ఫీచర్స్ తో ఫోన్ ను లాంఛ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ను యురోపియన్ వెబ్ సైట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంచిన మోటోరోలా… భారత్ మార్కెట్ లో ధరను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

ప్రోసెసర్ – మీడియా టెక్ డైమెన్షిటీ 7300 చిప్ తో ఈ ఫోన్ లాంఛ్ అయింది. ఇందులో 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్‌ స్పెషల్ ఎట్రాక్షన్. ThinkPhone 25 120Hz రిఫ్రెష్ రేట్‌, 6.36 అంగుళాల FULL HD+ LTPO AMOLED డిస్‌ప్లే (1,220×2,670 పిక్సెల్‌) ను కలిగి ఉంది.


డిజైన్ – Lenovo థింక్‌ప్యాడ్ డిజైన్ శైలితో ఈ ఫోన్ ను రూపొందించారు. ఇది ఫోన్ కు హై క్వాలిటీ ప్రొటెక్షన్ ను అందిస్తుంది.

ప్రోసెసర్- థింక్‌ఫోన్ 25 మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్. 8GB LPDDR4X RAM, 256GB uMCP స్టోరేజ్ సదుపాయం కలదు. ఇక Android 14వెర్షన్ తో అందుబాటులోకి వచ్చింది. ఇక థింక్‌షీల్డ్‌తో పాటూ 2029 వరకు ఐదేళ్ల పాటు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించే విధంగా ఈ ఫోన్ లాంఛ్ అయింది.

ALSO READ :  సేల్లో అదిరిపోయే బంపర్ ఆఫర్.. రూ.10,999కే ఒప్పో 5G స్మార్ట్ ఫోన్

కెమెరా – థింక్‌ఫోన్ 25లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ స్పెషల్ ఎట్రాక్షన్. క్వాడ్ PDAFతో 50 మెగాపిక్సెల్ Sony LYT-700C ప్రైమరీ షూటర్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ తో 10-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి.

బ్యాటరీ కెపాసిటీ – 4310mAh బ్యాటరీ సపోర్ట్, 68W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇక ఒక్కసారి ఛార్జ్ చేస్తే హై యూసేజ్ లో సైతం 34 గంటలు పనిచేసేలా ఈ ఫోన్ బ్యాటరీని రూపొందించారు.

కనెక్షన్స్ – థింక్‌ఫోన్ 25 లో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC, GPS, AGPS, LTEPP, SUPL, గ్లోనాస్, గెలీలియా, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ కనెక్షన్స్ అన్నీ ఫోన్ కు సపోర్ట్ ఇస్తాయి.

ఆడియో – డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో ఫోన్ ను లాంఛ్ చేశారు. ఇవి ఫీల్ గుడ్ ఆడియో అనుభూతిని కలిగిస్తాయి.

సెన్సార్ – ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, SAR సెన్సార్ ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇక ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ ఫోన్ ను ప్రొటెక్ట్ చేస్తుంది.

 

Related News

Recharge Offers : 3 నెలలు ఫ్రీ ఇంటర్నెట్, 18 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌.. ఈ ఏడాదిలోనే బెస్ట్ ప్లాన్ ఇదే!

Best Gaming phones : అక్టోబర్​లో బెస్ట్​ కెమెరా, గేమింగ్​ స్మార్ట్ ఫోన్స్ ఇవే – ఊహించని రేంజ్​లో అతి తక్కువ ధరకే!

iPhone : ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే అప్డేట్.. దిగివస్తున్న ఆపిల్ ధరలు 

Flipkart Sale 2024 : సేల్లో అదిరిపోయే బంపర్ ఆఫర్.. రూ.10,999కే ఒప్పో 5G స్మార్ట్ ఫోన్

China Spacesuit: తేలికపాటి స్పేస్ సూట్ తయారు చేసిన చైనా.. ఎలాన్ మస్క్ ఎలా రియాక్ట్ అయ్యాడంటే?..

Shukrayaan 1: శుక్రయాన్ 1 ప్రయోగానికి ఇస్రో రెడీ.. కసరత్తు చేస్తున్న శాస్త్రవేత్తలు

Big Stories

×