EPAPER
Kirrak Couples Episode 1

Vegetable Buying Guide: ‘ఇంత బతుకు బతికి చివరికి ఈ పని చేయాలా!’.. వైరల్ అవుతున్నరిటైర్డ్ అధికారి ఫన్నీ పోస్ట్

Vegetable Buying Guide: ‘ఇంత బతుకు బతికి చివరికి ఈ పని చేయాలా!’.. వైరల్ అవుతున్నరిటైర్డ్ అధికారి ఫన్నీ పోస్ట్

Vegetable Buying Guide| సోషల్ మీడియా కారణంగా ప్రపంచలోని నలుమూలల జరిగే వింతలు విశేషాలు అందరికీ తెలిసిపోతున్నాయి. కొందరు నెటిజెన్స్ అయితే తమ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే వింత పరిస్థితులను సైతం అందరితో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారి సోషల్ మీడియాలో ఓ వింత పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో తన భార్య తనకు ఆదేశాలు జారీ చేసిందని చెప్పాడు. మార్కెట్ కు వెళ్లి ఎలాంటి కూరగాయలు తీసుకురావాలి.. ఎన్ని కొనుగోలు చేయాలి? ఎన్ని ఫ్రీగా తీసుకురావాలి? అనే విషయాలు అందులో వివరంగా ఉన్నాయని చూపిస్తూ.. ఒక లిస్ట్ షేర్ చేశాడు. పైగా రిటైర్మెంట్ తరువాత తన జీవితం ఇలా ఉందని హాస్యాపదంగా రాశాడు.


ఆ పోస్ట్ చదివిన నెటిజెన్లు.. కొందరు సరదాగా నవ్వుకుంటుంటే.. మరికొందరు ఆ ప్రభుత్వ అధికారి భార్య నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మోహన్ పరగయెన్ అనే ఒక రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి ఇటీవల సోషట్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఎక్క్స్ పై ఒక ఫన్నీ ఫొటో షేర్ చేశాడు. ఆ ఫోటో ఒక కూరగాయల్ లిస్ట్ ది. తన భార్య తనకు మార్కెట్ వెళ్లి మంచి కూరగాయలు తీసుకురమ్మని లిస్ట్ రాసిచ్చిందని కింద పోస్ట్ లో రాశాడు. ఆ లిస్ట్ ఆయన భార్య హ్యాండ్ రైటింగ్ లో రాసి ఉంది.

Also Read: కేవలం నిద్రపోతూ రూ.9 లక్షలు సంపాదించిన యువతి!.. ఎలా చేసిందంటే?..


అందులో చాలా క్లియర్ గా ఏ కూరగాయలు ఎలాంటివి తీసుకురావాలి. వాటిని ఎలా పరీక్షించాలి. అని చాలా స్పష్టంగా రాసి ఉంది. పైగా కూరగాయలు ఎక్కడి నుంచి కొనాలా? అతని వద్ద కొన్ని ఫ్రీ గా కూడా తీసుకురావాలని రాసిఉంది. ఉదాహరణకు టమోటాలు కొన్ని ఎర్రవి, కొన్ని పసుపు పచ్చవి మిక్స్ చేసి 1.5 కిలో తీసుకోవాలి. అవి గట్టిగా ఉండాలి. మెత్తగా ఉంటే వద్దు. అందులో ఎలాంటి రంద్రాలు ఉండకూడదు. ఉల్లిపాయలు చిన్నగా గుండ్రంగా ఉండేవి 1.5 కిలో తీసుకోవాలి. పచ్చి మిర్చి డార్క్ గ్రీన్ కలర్ లో ఉండాలి, పొడుగుగా ఉండాలి.. కొన్ని చాలు.. అన్ని కొనేశాక పచ్చి మిర్చి కొన్ని ఫ్రీగా వేయమని అడగాలి. బెండకాయ.. తోక విరిచి చూసి విరిగితేనే తీసుకోవాలి.. మరి మెత్తగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడు. పాలకూర- చిన్ని ఆకులు ఉండాలి, రంద్రాలు ఉంటే అస్సలు వద్దు. తాజాగా ఉంటేనే తీసుకోవాలి. ఇలా ప్రతీ ఐటెమ్ ని స్పష్టంగా వివరిస్తూ మేడమ్ గారు రాశారు. పైగా హార్డ్ వేర్ షాపు బయట నిలబడి ఉన్న కూరగాయల బండి వద్దకు మాత్రమే వెళ్లి కొనుగోలు చేయాలి.

ఈ పోస్టు చూసి నెటిజెన్ల రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ అయితే.. ”ఆమె కూరగాయల డిటైలింగ్ అద్భుతంగా ఉంది. కూరగాయల ఎలా కొనాలో పర్‌ఫెక్ట్ గా రాసింది. అందరూ కాపీ చేసుకోండి భవిష్యత్తుల్లో ఉపయోగపడుతుంది. కానీ భర్తలకు మాత్రం ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆమె చాలా స్ట్రాక్ట్ గా అనిపిస్తోంది. ఏమైనా తప్పుదొర్లితే అంతే సంగతులు” అని కామెంట్ పెట్టాడు.

మరొకి యూజర్ కామెంట్ చేస్తూ.. ”కూరగాయలు కొనడం తెలియని వాళ్లకు, మార్కెట్ కు ఫస్ట్ టైమ్ వెళ్లే వాళ్లకు టెక్స్ట్ బుక్ లా అనిపిస్తోంది.” అని రాశాడు.

ఇంకొక యూజర్ రాస్తూ.. ”ఆ హ్యాండ్ రైటింగ్ ఏంటి? ఆ లిస్టులో డ్రాయింగ్స్ కూడా ఎంత అర్థవంతంగా ఉన్నాయో..! ఏదో మత పుస్తకంలో ధార్మిక శ్లోకాలు రాసినట్లు ఉంది. తప్పుడు కూరగాయలు పొరపాటున తీసుకొస్తే.. పాపం చుట్టుకుంటుందేమో” అని ఫన్నీ కామెంట్ పెట్టాడు.

Related News

Bus Train Crash Just Miss: బస్సును ఢీ కొట్టబోయిన రెండు రైళ్లు జస్ట్ మిస్.. అంతా గేట్ మెన్ నిర్వాకం..

Bengaluru Woman Sleep Internship : కేవలం నిద్రపోతూ రూ.9 లక్షలు సంపాదించిన యువతి!.. ఎలా చేసిందంటే?..

Viral News: 8 వేల డ్రోన్లతో కళ్లు చెదిరే లేజర్ షో.. గిన్నీస్ రికార్డులూ బద్దలు, అలా ఎలా చేశారయ్యా బాబు!

Viral News: వీడు మహా కంత్రి.. టికెట్ లేకుండా విమానాల్లో జర్నీ, అదెలా సాధ్యం? సెక్యూరిటీ ఏం చేస్తోంది?

Air Bag Danger: ప్రాణాలు కాపాడాల్సిన ఎయిర్ బ్యాగ్.. చిన్నారి ప్రాణం తీసింది, ఈ తప్పు మీరు చేయొద్దు

Viral Video: ఇదేం వెరైటీ ఐస్ క్రీం రా బాబు.. మరీ పచ్చిమిర్చితో చేసావేంటి !

Big Stories

×