EPAPER
Kirrak Couples Episode 1

Vettaiyan Trailer: మాట్లాడి ప్రయోజనం లేదు.. డైరెక్ట్ లేపేయడమే.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ వచ్చేశాడు

Vettaiyan Trailer: మాట్లాడి ప్రయోజనం లేదు.. డైరెక్ట్ లేపేయడమే.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ వచ్చేశాడు

Vettaiyan Trailer: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘వేట్టయన్’. సోషల్ డ్రామా సినిమాలను తీయడంలో టీజే జ్ఞానవేల్ స్పెషలిస్ట్. అందుకే ‘వేట్టయన్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అంతే కాకుండా రజినీకాంత్‌ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ క్యాస్టింగ్‌తో ఇప్పటికే ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అంతే కాకుండా ఇటీవల విడుదలయిన టీజర్, పోస్టర్స్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. తాజాగా ‘వేట్టయన్’ ట్రైలర్ విడుదల కాగా ఇందులో రజినీ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి.


పోలీసులపై ఒత్తిడి

ఒక అమ్మాయిని అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన నేరస్తుడిని ఖైదు చేయాలంటూ ప్రజలంతా పోరాడడంతో ‘వేట్టయన్’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ నేరస్తుడిని పట్టుకోవడం కోసం పోలీస్ ఫోర్స్ అంతా రంగంలోకి దిగుతుంది. ఈ కేసులో పోలీసులపై తీవ్రంగా ఒత్తిడి కూడా పడుతుంది. అసలు ఆ అత్యాచారానికి పాల్పడింది ఎవరు అనే విషయం తెలుసుకోవడానికి వారు కష్టపడుతున్నా వారికి ఒక్క క్లూ కూడా దొరకదు. అప్పుడే రితికా సింగ్, రావు రమేశ్ లాంటి పోలీసులు ఈ కేసును పరిష్కరించడానికి రంగంలోకి దిగినా ఎలాంటి లాభం ఉండదు. అందుకే నేరస్తుడిని ఎన్‌కౌంటర్ చేయాలని రావు రమేశ్ నిర్ణయించుకోగా అప్పుడే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎంట్రీ ఇస్తారు రజినీ.


Also Read: నేను ఆ కథ చెప్తే విక్రమ్ కి నచ్చలేదు, ఆ సినిమా హిట్ అయిన తర్వాత విక్రమ్ కాల్ చేసారు

డైరెక్ట్ ఎన్‌కౌంటర్

‘‘వారం రోజులు అక్కర్లేదు. మూడే రోజుల్లో డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు వస్తుంది’’ అని అందరికీ మాటిస్తారు రజినీకాంత్. అప్పుడే తన పైఅధికారిగా అమితాబ్ బచ్చన్, ఒక పేరున్న బిజినెస్‌మ్యాన్‌గా రానా పరిచయం అవుతారు. వారితో పాటు ఒక క్రిమినల్ పాత్రలో ఫాహద్ ఫాజిల్, తను ప్రేమిస్తున్న అమ్మాయి క్యారెక్టర్ దుషార విజయన్ కనిపిస్తారు. ‘‘క్రైమ్ క్యాన్సర్ లాంటిది దానిని పెరగనివ్వకూడదు’’ అని రజినీకాంత్ ఈ కేసు గురించి ఇతర పోలీసులతో చర్చిస్తాడు. కానీ నేరస్తుడి బలం చాలా పెద్దదని వారంతా చెప్తుంటారు. అవన్నీ వినకుండా ‘‘ఊరికే మాట్లాడి ప్రయోజనం లేదు. వాడిని వెంటనే లేపేద్దాం’’ అంటూ తన టీమ్‌ను సిద్ధం చేస్తారు రజినీకాంత్.

ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్

‘‘అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండడం కంటే న్యాయాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు కాదు’’ అనే డైలాగ్‌తో అసలు ‘వేట్టయన్’లో రజినీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పేశారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఇక ఈ ట్రైలర్ చివర్లో రజినీకాంత్ యాక్షన్.. తన ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. ‘వేట్టయన్’ ట్రైలర్‌లో రజినీ మార్క్ డైలాగ్స్, స్టైల్ మాత్రమే కాదు.. యాక్షన్ కూడా హైలెట్‌గా నిలిచింది. ఇక రజినీకాంత్‌ను, అమితాబ్ బచ్చన్‌ను ఒకే స్క్రీన్‌పై చూడడం అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ ప్రేక్షకులకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చేలా ఉంది. అక్టోబర్ 11న ‘వేట్టయన్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

Related News

Karthi: ప్రభాస్ సాంగ్.. ఎంత అద్భుతంగా పాడావ్ కార్తీ అన్నా.. ఫిదా అంతే

Hasith Goli : భలే ప్లాన్ చేసాడు, ఈ ఒక్క సినిమాతో నాలుగు ఫ్రీక్వెల్స్ రాయొచ్చు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అసలు పేరు ఏంటో తెలుసా, ప్రొడ్యూసర్ గా కూడా స్క్రీన్ పై పేరు పడింది

Srinidhi Shetty: కెజిఎఫ్ పాపకు ‘హిట్’.. ఇక నాని బాధ్యతే

Samantha: చిన్నచూపు చూడొద్దు, రాజకీయ గొడవల్లోకి లాగొద్దు.. కొండా సురేఖ వ్యాఖ్యలకు సమంత కౌంటర్

Akkineni Nagarjuna: నిజంగా నాగార్జున.. కోడలి విషయంలో అంత నీచానికి దిగజారాడా.. ?

Tollywood: పదేళ్లుగా ఓటమి చవిచూడని ఏకైక హీరో.. ఎవరంటే..?

Big Stories

×