EPAPER
Kirrak Couples Episode 1

Home Minister: వడ్డీ వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. ఇక నుంచి మీరు…

Home Minister: వడ్డీ వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. ఇక నుంచి మీరు…

AP Home Minister Anitha Serious Warning: ఏపీ హోంమంత్రి అనిత తాజాగా పలు హెచ్చరికలు జారీ చేశారు. వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఎట్టి పరిస్థితుల్లో వారిని సహించేదిలేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆమె పేర్కొన్నారు. ఏలూరు కాల్ మనీ ఘటనపై బుధవారం హోంమంత్రి స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వడ్డీ వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. కిస్తీలకు ముందే వడ్డీ కోత, సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మనీ వ్యవహారంపై ఆమె తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఇదేంటి..? ఇలా అమాయకులను ఇబ్బందులకు గురి చేయడమేంటి..? మరీ ఇంతలా దోచుకోవడం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లతో అమాయకులను వేధిస్తే క్రిమినల్ కేసులు పెడుతామంటూ హోమంత్రి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఇటువంటివి ఎక్కడా కూడా జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామంటూ ఆమె పేర్కొన్నారు.


Also Read: బావ కళ్లల్లో ఆనందం కోసం.. పురందేశ్వరిపై రోజా గరంగరం!

రోజూవారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పీల్చిపిప్పి చేసేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమన్నారు. వసూళ్ల పేరుతో అమాయకులను బలిచేసేవారిపై ఉక్కుపాదం మోపుతామంటూ హోంమంత్రి అన్నారు. వడ్డీ వ్యాపారాలను సీరియస్ గా తీసుకున్నామని, ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుందని స్పష్టం చేశారు. అది ఎవరైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఆమె చెప్పారు. ఈ వడ్డీ వ్యాపారుల కారణంగా చాలామంది అమాయకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వడ్డీ వ్యాపారులు నిత్యం వారిని వేధిస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు.. అమాయకులను కోర్టుల చుట్టూ తిప్పడం, పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వేధిస్తున్నారంటూ ఆమె సీరియస్ అయ్యారు.


Also Read: దీక్షలో వైఎస్ షర్మిల.. ప్లీజ్ రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్..

ఏలూరులో ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కూడా అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిసి ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు హోంమంత్రి చెప్పారు. అతను చేస్తున్న కాల్ మనీ దందాకు చాలామంది ప్రజలు బలయ్యారని తనకు తెలిసిందన్నారు. అప్పు ఇచ్చి దానికి ఇష్టంవచ్చినట్లు వడ్డీలు కట్టించుకున్నారని, సమయానికి బాధితులు డబ్బులు కట్టకపోతే వారిని అసభ్యపదజాలంతో తిట్టేవారని వారు వాపోయినట్లు హోంమంత్రి అన్నారు. దీంతో వారు భయపడి డబ్బులు చెల్లించినా ఇంకా బకాయి ఉందంటూ వారిని నిత్యం వేధించేవారని తెలిసినట్లు ఆమె చెప్పారు. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే అప్పు ఇచ్చిన సమయంలో తీసుకున్న ప్రామిసరీ నోట్లతో కోర్టుల చుట్టూ తిప్పున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఆమె అన్నారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను తెప్పించుకున్నట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ముందు ఏపీలో వడ్డీల పేరుతో వేధిస్తే ఎవరినీ కూడా వదిలేదంటూ హోంమంత్రి హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related News

Pawan Kalyan Varahi Sabha : రేపటి వారాహి సభలో పవన్ ఏం చెప్పనున్నారు ? అందరిలోనూ ఒకటే ఉత్కంఠ

Trivikram Srinivas: టీటీడీ బోర్టులోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్?

Cm Chandrababu: ఏపీ ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఆ పన్ను నుంచి పూర్తిగా ఉపశమనం

CM Chandrababu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్.. 2017 నాటికి ప్రతి ఇంటికి మంచి నీళ్లు: సీఎం చంద్రబాబు

RK Roja: బావ కళ్లల్లో ఆనందం కోసం.. పురందేశ్వరిపై రోజా గరంగరం!

YS Sharmila: దీక్షలో వైఎస్ షర్మిల.. ప్లీజ్ రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్..

Big Stories

×