EPAPER

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

How To File TDR In IRCTC: ఈ రోజుల్లో చాలా మంది రైలు ప్రయాణం చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అత్యాధునిక వసతులు, అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు అంబాటులోకి వస్తున్న నేపథ్యంలో సౌకర్యవంతంగా జర్నీ చేస్తున్నారు. కొన్నిసార్లు టిక్కెట్ ఉన్నా అనివార్య కారణాలతో రైలు మిస్సవుతుంటారు. ఈ నేపథ్యంలో టికెట్ వేస్ట్ అయ్యిందని చాలా మంది భావిస్తారు. కానీ, కొన్ని వెసులుబాట్లు ఉన్నాయంటున్నారు రైల్వే అధికారులు.


మిస్సైన ట్రైన్ టికెట్ తో మరో రైల్లో వెళ్లొచ్చా?

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణీకుడు సాధారణ కోచ్ టిక్కెట్‌ను కలిగి ఉంటే.. అతడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అదే కేటగిరీకి చెందిన ఇతర రైలులో ప్రయాణించవచ్చు. అయితే, ఇతర కేటగిరీ రైళ్లలో ప్రయాణించకూడదు. ఎందుకంటే, ప్యాసింజర్, మెయిల్-ఎక్స్‌ ప్రెస్, సూపర్‌ ఫాస్ట్, రాజధాని ఎక్స్‌ ప్రెస్, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్ల కేటగిరీలు, టిక్కెట్ ధరలు భిన్నంగా ఉంటాయి. ఇలాంటి రైళ్లలో, సాధారణ టిక్కెట్లతో ప్రయాణం చేసే అవకాశం లేదు. ఒకవేళ వెళ్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


రిజర్వేషన్‌ టిక్కెట్ ఉండి రైలు మిస్ అయితే?  

ఒక ప్రయాణికుడు రిజర్వేషన్‌ తో కూడిన టిక్కెట్‌ ను కలిగి ఉండి రైలు మిస్ అయితే, అతడు వేరే రైల్లో ప్రయాణించే అవకాశం లేదు. మరో రైలులో ప్రయాణిస్తుండగా పట్టుబడితే,  టికెట్ లేని వ్యక్తిగా TTE పరిగణించి ఫైన్ వేస్తారు.  జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. సో, రిజర్వేషన్ టిక్కెట్‌ ఉండి రైలు మిస్ అయితే, రీఫండ్ కోసం అప్లై చేసుకోవాలి. మరొక రైలులో ప్రయాణించేందుకు తగిన టిక్కెట్ ను కొనుగోలు చేయాలి.

TDR ఆఫ్‌ లైన్, ఆన్‌ లైన్‌ లో ఎల్ ఫైల్ చేసుకోవాలి?

ప్రయాణించాల్సిన రైలు మిస్ అయ్యినప్పుడు  కౌంటర్ నుండి బుక్ చేసిన రిజర్వేషన్ టిక్కెట్‌ ను మిస్సింగ్ కు సరైన కారణం చెప్తూ TDR ఫామ్‌ ను ఫిల్ చేసి కౌంటర్‌ లో సమర్పించాలి. అదే, ఇ-టికెట్ బుక్ చేసుకుంటే IRCTC సైట్ లేదంటే యాప్‌ లో లాగిన్ అయి TDRని ఫైల్ చేయాలి. ఇందుకోసం లాగిన్ అయిన తర్వాత రైలు ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫైల్ TDR ఎంపికపై క్లిక్ చేయాలి. టికెట్ వివరాలను ఎంటర్ చేసి, రైలు మిస్సింగ్ కు సరైన కారణాన్ని ఎంపిక చేసి సబ్ మిట్ చేయాలి. వెంటనే TDR ఫైల్ చేయబడుతుంది.  రీఫండ్ డబ్బులు గరిష్టంగా 60 రోజులలోపు మీ అకౌంట్ లోకి లేదంటే వాలెట్ లోకి వస్తాయి.

రిజర్వేషన్ టిక్కెట్ క్యాన్సిల్, రీఫండ్‌ నిబంధనలు  

రైల్వే నిబంధనల ప్రకారం  తత్కాల్ టికెట్ రద్దుపై ఎలాంటి రీఫండ్ ఉండదు. అదే సమయంలో, నిర్ధారిత టిక్కెట్‌ ను 48 గంటలలోపు లేదంటే రైలు బయలుదేరే సమయానికి 12 గంటల ముందు రద్దు చేసినట్లయితే,  పూర్తి మొత్తంలో 25 శాతం తగ్గించి ఇస్తారు. బయలుదేరే సమయానికి 12 నుండి 4 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే 50 శాతం అమౌంట్ తగ్గిస్తారు. రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వెయిటింగ్ లిస్ట్, RAC టిక్కెట్లను రద్దు చేసినట్లయితే పూర్తి మొత్తం రీఫండ్ లభిస్తుంది. ఈ సౌకర్యాలన్నీ రైలు బయలుదేరే ముందు అందుబాటులో ఉంటాయి. రైలు బయలుదేరిన తర్వాత కేవలం TDR మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Read Also: ఇంజిన్ ఒక రాష్ట్రంలో.. బోగీలు మరో రాష్ట్రంలో.. భారత్ లో పేరులేని రైల్వే స్టేషన్ గురించి మీరెప్పుడైనా విన్నారా?

Related News

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

×