EPAPER
Kirrak Couples Episode 1

Team India: క్రికెట్‌ లోకి కొత్త రూల్‌ తెచ్చిన టీమిండియా..బజ్‌బాల్ కాదు..ఇకపై గమ్‌బాల్ !

Team India: క్రికెట్‌ లోకి కొత్త రూల్‌ తెచ్చిన టీమిండియా..బజ్‌బాల్ కాదు..ఇకపై గమ్‌బాల్ !

Team India: కాన్పూర్ టెస్టులో టీమిండియా దుమ్మురేపి తన ఆటను ప్రదర్శించింది. భయం లేకుండా ఆటను ఆడింది. ఆల్ రౌండ్ షోతో ప్రత్యర్ధులను బెంబేలెత్తించేసింది. వర్షం అంతరాయం కలిగించినప్పటికీ రెండు రోజుల ఆటను తుడిచి పెట్టేసుకుపోయినా రోహిత్ సేన తన పట్టును వదలలేదు. తొలి రోజు 35 ఓవర్ల ఆట, నాలుగో రోజు 85 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన ఐదవ రోజు 53.2 ఓవర్లలోనే మ్యాచును ముగించేసింది. మొత్తంగా కాన్పూర్ లో 173.2 ఓవర్ల ఆటలోనే తన టాలెంట్ ను చూపించింది. అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంది.


వరుసగా రెండో మ్యాచుల్లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. స్వదేశంలో వరుసగా 18వ సిరీస్ ను దక్కించుకుంది. నిజానికి ఓవర్ నైట్ స్కోర్ 2 వికెట్లకు ఐదో రోజు ఆటను బంగ్లాదేశ్ ఆరంభించింది. అయితే ప్రత్యర్థి జట్టుకు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. బంగ్లా బాటర్లను క్రీజులో ఉంచలేకపోయారు. వచ్చిన వారిని వచ్చినట్టుగా పెవిలియన్ పంపించేశారు. భారత బౌలర్ల జోరు ముందు బంగ్లా బ్యాటర్స్ ఎవరు నిలవలేకపోయారు. రహీమ్ 37 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు.

రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 146 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్ బూమ్రా మూడు వికెట్లు తీశాడు. 10 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 15 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చిన అశ్విన్ కూడా ఫామ్ కొనసాగించాడు. మూడు వికెట్లను సొంతం చేసుకున్నాడు. రవీంద్ర జడేజా కూడా అద్భుతం చేశాడు. పది ఓవర్లలోనే 34 పరుగులు తీశాడు. మూడు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్ 8 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. టీమిండియా ముందు బంగ్లాదేశ్ కేవలం 95 పరుగుల టార్గెట్ ను మాత్రమే పెట్టింది. స్వల్ప లక్ష్యచేదనలో ఆరంభం నుంచి భారత జట్టు దూకుడుగా ఆడింది.


Also Read: Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఏడు బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాసేపటికి శుభమన్ గిల్ కూడా పెవిలియన్ చేరాడు. 34 పరుగులకే భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జైస్వాల్, విరాట్ కోహ్లీ చిలరేగి ఆడారు. ముఖ్యంగా జైస్వాల్ వైట్ బాల్ ఫార్మాట్ తరహాలోనే ఆడాడు. 43 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించి జైస్వాల్ అవుట్ అయ్యాడు. యువ ఓపెనర్ 45 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ చాలా కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు.

పంత్ తో కలిసి మ్యాచ్ను ముగించాడు. విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నాలుగు పరుగులతో పంత్ నాటౌట్ గా నిలిచాడు. 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘనవిజయం సాధించింది. కాన్పూర్ టెస్ట్ లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో మెరిసిన జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెంచరీతో పాటు 11 వికెట్లతో నిలకడగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. అయితే.. ఇంగ్లాండ్‌ బజ్‌ బాల్‌ ఆడితే…గంభీర్‌ ఆధ్వర్యంలో గమ్‌ బాల్‌ టెక్నిత్‌ ఆడి గెలిచామని టీమిండియా అంటోంది. గంభీర్‌ సూచన ప్రకారంమే ఆడి.. గెలిచామని పేర్కొన్నారు ప్లేయర్లు.

Related News

WTC 2025: బంగ్లా చిత్తు.. WTC ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

IPL 2025: కోహ్లీకి ఎసరు..RCB లోకి టీమిండియా కెప్టెన్‌ ?

Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

IND vs BAN: కుప్పకూలిన బంగ్లాదేశ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Team India: టీ20 అనుకుని రెచ్చిపోయారు…147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో టీమిండియా ‘ఫాస్టెస్ట్‌’ రికార్డులు

Ind vs Ban Test: ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్న రోహిత్‌.. చెవులు పట్టుకున్న పంత్ !

Big Stories

×