EPAPER
Kirrak Couples Episode 1

Customers KIll Flipkart Delivery Boy: ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్‌ని హత్య చేసిన కస్టమర్.. ఎందుకు చేశాడంటే?..

Customers KIll Flipkart Delivery Boy: ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్‌ని హత్య చేసిన కస్టమర్.. ఎందుకు చేశాడంటే?..

Customers KIll Flipkart Delivery Boy| ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్స్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ తరుణంలో భారీగా ఆర్డర్లు రావడంతో డెలివరీ బాయ్స్ యమ బిజీగా ఉన్నారు. దీంతో డెలివరీ బాయ్స్ పై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. కొన్ని సార్లు ఆర్డర్లు మిస్ అవుతుండగా.. మరి కొన్ని సార్లు ఆర్డర్ చేసిన కస్టమర్ల కారణంగా ఇబ్బుందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఒక ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ ని ఒక కస్టమర్ హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్‌నవు నగరంలో జరిగింది.


లఖ్ నవు నగరంలోని చిన్‌హాట్ పోలీస్ స్టేషన్ లో వారం రోజుల క్రితం భరత్ కుమార్ అనే వ్యక్తి కనిపించడం లేదని ఫిర్యాదు నమోదు అయింది. ఈ కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులు.. 30 ఏళ్ల భరత్ కుమార్ ఒక ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడని.. మూడు రోజుల క్రితం ఆర్డర్ డెలివరీ కోసం వెళ్లిన భరత్ కుమార్ ఇంటికి తిరిగిరాలేదని తెలుసుకున్నారు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి


భరత్ కుమార్ ఆ రోజు ఎవరెవరికి డెలివరీ చేసేందకు వెళ్లాడో ఆ లిస్ట్ తీసిన పోలీసులు వేగంగా అందరినీ విచారణ చేస్తూ వచ్చారు. చివరకు ఆకాష్ శర్మ అనే కస్టమర్ ఇంటి వద్దకు భరత్ కుమార్.. ఫ్లిప్ కార్ట్ డెలివరి చేయడానికి వెళ్లాడని తెలిసింది. దీంతో ఆకాష్ శర్మని ప్రశ్నించగా.. అతను అనుమాస్పదంగా సమాధానం ఇచ్చాడు. దీంతొ పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తమ స్టైల్ లో గట్టిగా ప్రశ్నించారు.

అప్పుడు ఆకాశ్ శర్మ చెప్పింది విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆ రోజు భరత్ కుమార్ ఫ్లిప్ కార్ట్ ఆర్డర్ డెలివరీ చేసేందకు ఆకాశ్ శర్మ ఇంటికి వెళ్లాడు. అప్పుడు ఆకాశ్ శర్మ్ ఇంట్లో గజానన్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వారిద్దరూ భరత్ కుమార్ ని ఇంటి లోపలికి రమ్మని ఆహ్వానించారు. లోపలికి వెళ్లగానే భరత్ కుమార్ కు వెనుక నుంచి ఒక లాప్ టాప్ చార్జర్ తో గొంతు బిగించారు. దీంతో భరత్ కుమార్ ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ చనిపోయాడు. అలా ఆకాశ్ శర్మ్, అతని స్నేహితుడు గజానన్ ఇద్దరూ కలిసి ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్‌ భరత్ కుమార్ ను హత్య చేశారు.

భరత్ కుమార్ వద్ద ఫ్లిప్ కార్ట్ డెలివరీ బ్యాగులో ఖరీదైన రెండు స్మార్ట్ ఫోన్లు చూశారు. ఒకటి వీవో వి40 ప్రో కాగా మరొకటి గూగుల్ పిక్సెల్ 7 ప్రో. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ఖరీదు దాదాపు రూ.90000. వాటిని కాజేయాలని భరత్ కుమార్ ని హత్య చేశారు. అయితే హత్య చేసిన తరువాత భరత్ కుమార్ బ్యాగులో ఉన్న మిగతా ఆర్డర్ ఐటెమ్స్ కూడా కాజేశారు. ఆ తరువాత భరత్ కుమార్ శవాన్ని అతని ఫ్లిప్ కార్ట్ డెలివరీ బ్యాగులోని పెట్టి బయటికి తీసుకెళ్లారు. ఊరి బయట ఉన్న ఇందిరా నగర్ కాలువలో పడేశారు. పోలీసులు ప్రస్తుతం కాలువ వద్ద వెళ్లి చూడగా.. నీటి ప్రవాహానికి భరత్ కుమార్ శవం కొట్టుకుపోయిందని తెలిసింది. భరత్ కుమార్ శవం కోసం పోలీసులు ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

అయితే ఈ కేసులో ఆకాశ్ శర్మని మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు. భరత్ కుమార్ ని హత్య చేయడంలో ఆకాశ్ శర్మకు సాయం చేసిన మరో నిందితుడు గజానన్ పరారీలో ఉన్నాడు. అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. భరత్ కుమార్ గత 8 ఏళ్లుగా ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Related News

Hyderabad: మరో దారుణం.. విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక వేధింపులు!

Gang Rape: కామంధ స్నేహితుడు.. యువతికి మద్యం తాగించి, ఆపై గ్యాంగ్ రేప్

Hyderabad Police: రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్..36 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

Hyderabad: ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఓ కుటుంబం.. ఒకరి పరిస్థితి డేంజర్, ఏం జరిగింది?

Tripura: త్రిపురలో దారుణం.. కన్నతల్లిని కుమారులే చెట్టుకు కట్టేసి సజీవ దహనం!

Illegal affair: అక్రమ సంబంధం.. భర్తను బాంబుతో లేపేసిన భార్య, మంచంపై నిద్రిస్తుండగా…

Big Stories

×