EPAPER
Kirrak Couples Episode 1

Fake FIR Incident: కర్నూల్‌లో జై భీం మూవీ సీన్ రిపీట్.. మరీ ఇంత దారుణమా..?

Fake FIR Incident: కర్నూల్‌లో జై భీం మూవీ సీన్ రిపీట్.. మరీ ఇంత దారుణమా..?

 Jai Bheem Movie Scene Repeat in kurnool: చట్టం.. ఎవడి చుట్టం కాదు.. మడిచి జేబులో పెట్టుకోవడానికి.. చట్టం.. ఎవరి సొత్తు కాదు.. ఆడించినట్టు ఆడటానికి.. ఇప్పుడు మీరు చూసిన జై భీమ్‌ మూవీ సీన్‌ చెప్పేవి ఇవే మాటలు.. ఇప్పుడీ మాటలు కేవలం రీల్‌పై మాత్రమే కాదు. రియల్‌గా కూడా జరుగుతాయని ప్రూవ్ చేసే ఘటన ఇది. ఒక్కసారి కాస్త వెనక్కి వెళదాం. సెప్టెంబర్ 12.. కర్నూలు త్రీటౌన్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత వారి అడ్రస్ మాయమైంది. ఇంటికి రాలేదు.. కోర్టుకు వెళ్లలేదు.. అలాగని జైలుకూ వెళ్లలేదు..


ఒకరోజు గడిచింది.. రెండు రోజులు గడిచాయి. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి.. కానీ వారి ఆచూకీ లేదు.. తన భర్త, తన తమ్ముడు ఎక్కడా అంటూ తన ఇద్దరు పిల్లలతో పోలీస్ స్టేషన్‌ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది ఆమె.. 14 రోజులు గడిచింది.. ఆయన ఫలితం లేదు. ఇది ఆ బాధితురాలి ఆవేదన. చివరకు అయ్యా మీరే నా భర్తను, తమ్ముడి గురించి ఆరా తీయాలంటూ లాయర్లను ఆశ్రయించింది. దీంతో వారు రంగంలోకి దిగడంతో పోలీసులకు వెంటనే చట్టాలు గుర్తొచ్చాయి.

జై భీమ్ మూవీ సీన్ రీపిట్ అయినట్టు అనిపించడం లేదా..? 14 రోజులు అంటే చిన్న విషయం కాదు. కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించినా 14 రోజుల్లో ముగుస్తుంది. అలాంటిది.. ఎలాంటి FIR లేకుండా అదుపులోకి తీసుకోవడం మొదటి తప్పు. ఆ తర్వాతైన FIR ఫైల్ చేసి అరెస్ట్‌ చూపించకపోవడం రెండో తప్పు. ఇవన్నీ ఏం చేయకుండా 14 రోజులుగా పోలీస్‌ స్టేషన్‌లో వారిని ఉంచడం మూడో తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయారు ఖాకీలు. అడిగేవారు లేరనుకున్నారో.. అడిగినా ఎదురించే దమ్ము లేదనుకున్నారో. కారణం ఏదైనా చట్టాన్ని మీరారు.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.


Also Read: తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తు బ్రేక్ వెనుక.. అసలేం జరిగింది?

వారు ఏం చేశారన్నది పక్కన పెట్టండి.. ఎందుకంటే నేరం ఎంతటిదైనా ఇలా చేయడానికి పోలీసులకు హక్కు లేదు.. నిందితులు ఎవరైనా.. ఎంతటి నేరం చేసినా జడ్జ్ ముందు 24 గంటల్లోగా హాజరు పరచాలి. కానీ ఇక్కడ అసలు ఆ రూల్ ఉన్నట్టు కూడా తెలీనట్టు వ్యవహరించారు పోలీసులు. అందుకే ప్రతి ఒక్కరు చట్టంపై కనీస అవగాహన ఏర్పరుచుకోవాలి. లేదంటే అమాయకులను చేసి ఇలానే పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తారంటున్నారు న్యాయవాదులు.

ఏం చేస్తున్నారో తెలియదు.. ఎందుకు చేస్తున్నారో తెలియదు. తీసుకొచ్చారు.. లోపల ఉంచారు. 14 రోజులుగా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. అంతుకు మించి తనకేం తెలియదంటున్నాడు బాధితుడు. పోలీసులు మంచి కోసం చేశారా? చెడు కోసం చేశారా? అనేది కాదు ఇక్కడ ప్రశ్న.. వారి కారణం ఏదైనా కావచ్చు. చట్టాన్ని మీరి ప్రవర్తిస్తే పరిస్థితులు ఇలా ఉంటాయనేదే మేం చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు కోర్టు కురిపించే ప్రశ్నల వర్షానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి పోలీసులది. ఎందుకిలా చేశారు? ఎవరు చేయమంటే చేశారు? అతను చేసిన నేరం ఏంటి? దానికి శిక్ష వేయకపోవడానికి మీరేవరు? డబ్బులు ఎందుకు అడిగారు? ఆ మూడు లక్షల సంగతేంటి? ఓ వైపు కోర్టు తీసుకునే చర్యలు. మరోవైపు డిపార్ట్‌మెంటర్ ఎంక్వైరీలు. ఇలా ఇప్పుడు ప్రతి విషయాన్ని ఖాకీలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Related News

CM Chandrababu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ పన్ను ఉండదు!

RK Roja: బావ కళ్లల్లో ఆనందం కోసం.. పురందేశ్వరిపై రోజా గరంగరం!

YS Sharmila: దీక్షలో వైఎస్ షర్మిల.. ప్లీజ్ రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్..

Pawan’s daughter declaration: వైసీపీకి ఛాన్స్ ఇవ్వలేదు.. తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ డిక్లరేషన్

SIT probe temporarily stopped: తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తు బ్రేక్ వెనుక.. అసలేం జరిగింది?

Waiting For Help: సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

Big Stories

×