EPAPER
Kirrak Couples Episode 1

Bengaluru Woman Sleep Internship : కేవలం నిద్రపోతూ రూ.9 లక్షలు సంపాదించిన యువతి!.. ఎలా చేసిందంటే?..

Bengaluru Woman Sleep Internship : కేవలం నిద్రపోతూ రూ.9 లక్షలు సంపాదించిన యువతి!.. ఎలా చేసిందంటే?..

Bengaluru Women Sleep Internship | మీరెప్పుడైనా నిద్రపోయే పోటీల గురించి విన్నారా?.. కేవలం నిద్రపోతూ ఉండడానికి మీకు లక్షల రూపాయలు బహుమతి అందుతుంది. ఇదేదో జోక్ అని మీరనుకుంటున్నారు కదా?!.. కానీ ఇలా నిజంగా జరిగింది. బెంగుళూరు నగరానికి చెందిన ఓ యువతి రూ.9 లక్షలు సంపాదించింది. ఒక కంపెనీ స్లీప్ ఇంటర్న్‌షిప్ మూడో సీజన్ ని నిర్వహించింది. ఈ పోటీల్లో ఆ యువతి స్లీప్ చాంపియన్ గా విజయం సాధించింది.


బెంగుళూరులో నివాసుముంటున్న సఈశ్వరి పాటిల్ వృత్తి రీత్యా ఒక ఆడిటర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. దీంతో ఆమె ప్రతిరోజు తక్కువ సమయం నిద్రపోయేది. పని ఒత్తిడి కారణంగానే రాత్రి వేళ కూడా పనిచేసేంది. పైగా కరోనా సమయంలో ఆమె ఎక్కువ సేపు సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ, సినిమాలు చూస్తూ.. సరైన సమయానికి నిద్రపోయేది కాదు. దీంతో సఈశ్వరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి.

అయితే ఇటీవల వేక్ ఫిట్ (wakefit) అనే మ్యాట్రెస్ కంపెనీ స్లీప్ ఇంటర్న్‌షిప్ అనే పోటీలు నిర్వహించింది. ఈ పోటీల గురించి తెలిసి.. సఈశ్వరి కూడా అందులో పాల్గొంది. వేట్ ఫిట్ కంపెనీ నియమాల ప్రకారం.. తమ మ్యాట్రెస్ పై వాలిపోయి త్వరగా నిద్రలోకి జారుకుని.. ఆరోగ్యకరంగా తగినంత నిద్రపోవాలి. త్వరగా లేసినా.. ఎక్కువ సేపు నిద్రపోయినా ఓడిపోతారు. అంటే కంపెనీ నిర్ణంచిన తగిన సమయం మాత్రమే నిద్రపోవాలి.


Also Read: సోషల్ మీడియా పిచ్చి పీక్స్.. రీల్స్ చేసేందుకు హైవే సైన్‌బోర్డుపై పుల్ అప్స్!

గత మూడు సంవత్సరాలుగా కంపెనీ ఇలాంటి పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఈ సంవత్సరం.. దేశం నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే అందులో 51 మంది మాత్రమే ఎంపికయ్యారు. వారిలో 12 మంది మాత్రమే ఫైనల్ చేరుకున్నారు. చివరికి ఈ పోటీల్లో స్లీప్ చాంపియన్ గా సఈశ్వరి పాటిల్ అవతరించింది.

ఈ పోటీల గురించి ఆమె మాట్లాడుతూ.. ”ఇది చాలా కష్టమైన ప్రక్రియ.. పోటీలో పాల్గొనే ముందే కఠిన దినచర్య పాటించాలి. సరైన సమయానికి నిద్రపోవడం, సరైన సమయానికి నిద్రలేవడం వంటివి ముందే అలవాటు చేసుకోవాలి. అందుకోసం సమయానికి తినాలి, సరైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ సేపు వీడియాలు, సినిమాలు చూడడం.. సోషల్ మీడియా వ్యసనం నుంచి ముందు బయటపడాలి. నాకు నా వృత్తి కారణంగా ఎక్కువ సేపు పనిచేయడం, తక్కువగా నిద్ర పోవడం అలవాటు. నేను ఈ పోటీల్లో పాల్గొనేందుకు.. ముందుగా నా దినచర్యను ప్లాన్ చేసుకొని.. దాన్ని రోజూ ప్రాక్టీస్ చేసాను. దాని వల్ల నా ఆరోగ్యం మెరుగుపడింది. నాకు దీనివల్ల లాభమే జరిగింది. పైగా ఈ ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నాను ” అని నవ్వుతూ చెప్పింది.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి

వేక్‌ఫిట్ మ్యాట్రెస్ కంపెనీ ఆరోగ్యకర నిద్ర కోసం కొత్త మ్యాట్రెస్ తీసుకొచ్చింది. దాని ప్రచారం కోసమే ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యకర నిద్ర కూడా చాలా అవసరం. వేక్‌ఫిట్ కంపెనీ చేసిన సర్వే… ‘ది గ్రేట్ ఇండియన్ స్లీస్ స్కోర్ కార్డ్ 2024’ ప్రకారం.. 50 శాతం భారతీయులు నిద్రలేచిన తరువాత కూడా అలసిపోయినట్లు ఉంటున్నారు. ఎక్కువ పనిగంటలు ఉండడం, తక్కువగా నిద్ర పోవడం, పని ఒత్తిడి, ఆందోళన, సరైన వ్యాయామం లేకపోవడమే దీనికారణాలు. ఈ సమస్య దేశంలో చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య గురించి దాని దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకే కంపెనీ స్లీప్ ఇంటర్న్‌షిప్ పోటీలు నిర్వహించిందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కుణాల్ దబే తెలిపారు.

Related News

Viral News: 8 వేల డ్రోన్లతో కళ్లు చెదిరే లేజర్ షో.. గిన్నీస్ రికార్డులూ బద్దలు, అలా ఎలా చేశారయ్యా బాబు!

Viral News: వీడు మహా కంత్రి.. టికెట్ లేకుండా విమానాల్లో జర్నీ, అదెలా సాధ్యం? సెక్యూరిటీ ఏం చేస్తోంది?

Air Bag Danger: ప్రాణాలు కాపాడాల్సిన ఎయిర్ బ్యాగ్.. చిన్నారి ప్రాణం తీసింది, ఈ తప్పు మీరు చేయొద్దు

Viral Video: ఇదేం వెరైటీ ఐస్ క్రీం రా బాబు.. మరీ పచ్చిమిర్చితో చేసావేంటి !

Highway Sign board pull ups: సోషల్ మీడియా పిచ్చి పీక్స్.. రీల్స్ చేసేందుకు హైవే సైన్‌బోర్డుపై పుల్ అప్స్!

Intercourse In Plane: విమానంలో అందరిముందు శృంగారం.. ప్రేమికులకు శిక్ష విధించిన కోర్టు!

Big Stories

×