EPAPER
Kirrak Couples Episode 1

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?

ముంబయి నటీమణి కాదంబరి జెత్వాని కేసు కీలక మలుపు తీసుకోనుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నాయి.


ఈ కేసులో నలుగురు పోలీసులతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు, మరో న్యాయవాది మొత్తం ఐదుగురు వ్యక్తులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం, వాదనలు పూర్తి చేసినట్లు సమాచారం.

ఈ మేరకు తీర్పును రిజర్వు చేస్తూ అక్టోబర్ 4న వెలువరిస్తామని కోర్టు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు గత 15 రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఏపీ ఉన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. వాస్తవానికి ఈరోజు వరకు సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.


Also read : దసరాకు సూపర్ కానుక ప్రకటించిన ప్రభుత్వం.. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు

సీనియర్ ఐపీఎస్ అధికారి పాత్ర ఉన్న నేపథ్యంలోనే ఈ కేసును ఏపీసీఐడీకి అప్పగించేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధింపులకు గురి చేశారని ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నిపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించి దిగువస్థాయిలో ఇన్‌స్పెక్టర్లు, ఆ కింద స్థాయి అధికారులు అప్రూవర్‌లుగా మారడంతో ముగ్గురు ఐపీఎస్‌లకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.

కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఐపీఎస్‌లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, అందుకు చాలా ప్రోసీజర్లను అనుసరించాలని యూపీఎస్సీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాతే ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులపై చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది.  ఈ వ్యవహారంపై కాదంబరి జెత్వాని ఫిర్యాదుతో కదిలిన పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ కారణంగానే సీఐడీ విచారణకు ప్రభుత్వం నేడో రేపో ఉత్తర్వులు విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Related News

Waiting For Help: సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?

AP Govt: దసరాకు సూపర్ కానుక ప్రకటించిన ప్రభుత్వం.. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు

Home Minister: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Pawan Klayan: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన

Big Stories

×