EPAPER
Kirrak Couples Episode 1

GHMC Elections : 2025లో హైదరాబాద్? మేయర్ పీఠం మీద కూర్చునేదెవరు? నగరాన్ని రక్షించేవారికే అందలం

GHMC Elections : 2025లో హైదరాబాద్? మేయర్ పీఠం మీద కూర్చునేదెవరు? నగరాన్ని రక్షించేవారికే అందలం

గ్రేటర్ పరిధిలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్నికల ప్రచారంలో మాత్రం మూసీ అంశం ఉండాల్సిందే. మూసీ నిర్వాసితులు అని, లేదా మూసీ సుందరీకరణ చేస్తామంటూ ఎన్నికల ప్రచారం సాగుతుంది. లేదా నాలాలాపై నివాసం ఉంటున్న బాధితులకు ప్రభుత్వమే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తుందని రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి.


అయితే గత రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికారంలో ఉండటంతో వారి పని మరింత సులువైంది. ఇప్పుడు కాలం మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో షెడ్యూల్ ప్రకారం 2025 ఏప్రిల్ లో జరగనున్న గ్రేటర్ ఎన్నికలపై ఈసారి హైడ్రా ఎఫెక్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

చెరువులు, కుంటలు, నాలాలు సిటీలో ఇబ్బడిముబ్బడిగా కబ్జాకు గురయ్యాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కారు, ఓవైపు హైడ్రాను ఏర్పాటు చేసి అక్రమార్కులపై కొరడా ఝులిపిస్తోంది. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలను తిరిగి ప్రభుత్వ అకౌంట్లోకి జమచేస్తోంది. మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ బోర్డుకు పని అప్పగించేసింది. దీంతో గ్రేటర్ ప్రజల్లో ప్రభుత్వానికి మైలేజీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


కాంగ్రెస్ నేతలదే ఫస్ట్ కూల్చివేత…

పేదోళ్ల జోలికి కాకుండా మొదట పెద్దోళ్ల ప్రాపర్టీ కూల్చి ప్రజల్లో భరోసా కల్పిస్తోంది ప్రభుత్వం, హైడ్రా. ఇందుకు ఉదాహరణగా కేంద్ర మాజీ మంత్రి పల్లరాజు, సినీ నటుడు అక్కినేని నాగార్జున లాంటి బడాబాబుల బిల్డింగులు హైడ్రా దెబ్బకు నేలమట్టమయ్యాయి. దీంతో హైడ్రాను గ్రేటర్ వాసులు బలంగా విశ్వసిస్తున్నట్లు అర్థమవుతోంది.

నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు…

ఇక వేలాది సంఖ్యలో ఉన్న మూసీ నివాసితులు, నాలాలపై నివాసం ఉంటున్న పేద మధ్య తరగతి ప్రజలను అక్కడి నుంచి తరలిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్లకు సర్కారు తరుఫున డబుల్ బెడ్ రూములను అలాట్ చేస్తోంది.

ఇలాంటి చర్యలతోనే మూసీ నదీ చుట్టూ ఉన్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి, మరోవైపు హైడ్రా ద్వారా ప్రభుత్వ ఆస్తులను, చెరువులను పరిరక్షించుకోవచ్చు అని ముందుకెళ్తోంది రేవంత్ రెడ్డి సర్కారు.

రెండు సార్లు బీఆర్ఎస్ హవా

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించి దాదాపు పదేళ్లు గడిచిపోయింది. ఇప్పటికే రెండు సార్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో తొలిసారి సొంతంగా సర్కారు ఏర్పాటు చేసిన అప్పటి టీఆర్ఎస్ పార్టీ 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. దీంతో హైదరాబాద్ పీఠంపై కూర్చుంది.

ఇక రెండోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న కేసీఆర్ పార్టీ మరోసారి 2020లో బల్దియాపై గులాబీ జెండా ఎగరేసింది. అది ఇది గతం మాట. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాదు కదా.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి అధికారం కోసం హోరాహోరీగా తలపడ్డ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సునామీ థాటికి కుప్పకూలింది. కేవలం 39 స్థానాలతో సరిపెట్టుకుంది. అదీ గ్రేటర్ వాసులు ఓట్లు వేస్తేనే. ఈ లెక్కన తెలంగాణ పల్లె ప్రజల్లో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు అర్థమవుతోంది. భాగ్యనగరంలో మాత్రమే ఆ పార్టీకి చెప్పుకోదగ్గ సీట్లు వచ్చాయి. మరో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పరిధిలో ఖాతా తెరవలేకపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు సాగింది.

Also read : పెట్రోల్ బంకులను కూడా హైడ్రా కూల్చివేయాలి: మైనంపల్లి

వచ్చేసారి పీఠం ఎవరిదో..

2025లో భాగ్యనగరంలో కొత్త మేయర్ రానున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కు జరిగే మూడో ఎన్నికలు ఇవే కావడం విశేషం. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున ఓటర్లు అధికార పార్టీ వైపే మొగ్గుచూపనున్నారు. ఈ సంగతి గత ఎన్నికల్లోనే స్పష్టం అవుతూ వస్తోంది.

2014లో రాష్ట్రం ఏర్పడే నాటికే కాంగ్రెస్, ఎంఐఎం పొత్తులో భాగంగా ఈ కూటమిదే మేయర్ పీఠంగా సాగింది. తర్వాత తెలంగాణలో తొలి హైదరాబాద్ మేయర్ గా బొంతు రామ్మోహన్ పదవీ స్వీకరించారు. అనంతరం గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రస్తుతం మేయర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండటం గమనార్హం.

Also read : పేదల బ్రతుకులను కూల్చేస్తున్నారు.. రాహుల్ స్పందించాలి.. కేటీఆర్ ట్వీట్..

రాష్ట్రం ఏర్పాడ్డాక ముచ్చటగా జరగనున్న మూడోసారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉండటం, హైడ్రాతో చెరువుల రక్షణ లాంటి అంశాలు హస్తం పార్టీకి పేరు తెస్తోందట. సిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినా క్రమంగా బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో హస్తం బలపడుతోంది.

ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలోని అధికార బీజేపీలు చెప్పుకోదగ్గ సీట్ల కోసం గట్టిగానే ఫైట్ చేయనున్నారని పొలిటికల్ టాక్. మరోవైపు టీజేఎస్ కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టనుంది. ఇక బీజేపీకి తెలుగుదేశం సహకరిస్తుందా లేక సొంతంగా పోటీ చేస్తుందా అనేది తేలాల్సి ఉంది.

Related News

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

Funds Released: తెలుగు రాష్ట్రాలకు వరద నిధులు విడుదల చేసిన కేంద్రం… తెలంగాణకు అన్యాయం?

Rain: హైదరాబాద్‌లో వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ దారుల గుండా వెళ్తే మీకు చుక్కలే!

Telangana Cabinet: దసరా లోపే క్యాబినెట్ విస్తరణ… వీళ్లకు మంత్రులుగా ఛాన్స్!

Mp Raghunandan : అక్కకు జరిగిన అవమానం అది.. వకీలుగా తమ్ముడు కోర్టుకు ఈడుస్తాడు : ఎంపీ రఘునందన్‌

Congress Mla Srinivas reddy : కేటీఆర్ ఇటలీ నీళ్లు తాగొచ్చు కానీ పేదలు మంచినీళ్లు తాగొద్దా : యెన్నం

Demolitions: మూసీ కూల్చివేతలు షురూ!.. కానీ, అక్కడికి బుల్డోజర్లు వెళ్లలేని పరిస్థితి.. మరి వాటిని కూల్చివేయడం ఎలా..?

Big Stories

×