EPAPER
Kirrak Couples Episode 1

Pawan Kalyan: సనాతన ధర్మం.. హీరో అవుదామనుకున్నాడు.. చివరకు జీరోగా మిగిలాడు

Pawan Kalyan: సనాతన ధర్మం.. హీరో అవుదామనుకున్నాడు.. చివరకు జీరోగా మిగిలాడు

Pawan Kalyan: ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందో అనాలా.. ?  లేక ఎరక్కుపోయి వచ్చారు.. ఇరుక్కుపోయారు అనాలా.. ? ప్రస్తుతం  పవన్ కళ్యాణ్ గురించి  సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ఇంతకంటే  దారుణంగా  ఉన్నాయి. అసలు ఏం చేద్దామనుకున్నాడు..  దేని గురించి పాకులాడాడు. చివరకు ఏం మిగిలింది..? ఇదేనా ఒక ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్.. ప్రజలకు చేసిన మంచి అని జనాలు ఏకిపారేస్తున్నారు. అసలేం జరిగింది.. ? ఎందుకు పవన్ ను ఇంతగా ట్రోల్ చేస్తున్నారు.. ? అనేది  తెలియాలంటే మొదటి నుంచి మాట్లాడుకుందాం రండి.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని స్థాపించి ప్రజల కోసం నిలబడాలని పోరాటం చేసిన మనిషి. మొదట ఎవరి సహాయం లేకుండా  ఒక్కడే తన శాయశక్తులా కష్టపడి ఎన్నికల్లో నిలబడ్డాడు. కానీ, అప్పుడు ప్రజలు ఆయనను నమ్మలేదు. దాదాపు పదేళ్ల తరువాత పవన్ కూటమితో ముందు  అడుగు వేశాడు. ఇక పవన్ కు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామనుకున్నవాళ్ళు  కొంతమంది ఉండగా.. జగన్ ప్రభుత్వంపై విసుగుచెందినవారు కొంతమంది.. కూటమికి ఓట్లు వేసి  గెలిపించారు. అలా ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎన్నిక అయ్యారు.

ఇక ఇక్కడవరకు  అంతా బాగానే ఉంది. ఈ మధ్య రెండు తెలుగురాష్ట్రాలను వరదలు ముంచెత్తినప్పుడు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమవంతు సాయంగా  విరాళాలు  అందజేసి ప్రజలను ఆ వరద ముంపు నుంచి బయటపడేశారు. ఇది కూడా బాగానే ఉంది.


ఇక ఈ  సమయంలోనే  ఈ తిరుపతి లడ్డూ వివాదం బయటపడింది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు నాయుడు మీడియా ముందు ఆరోపించడంతో ఈ వివాదం మొదలయ్యింది. ఇదంతా వైసీపీ హయాంలోనే  జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక చిలువలు పలువులుగా మొదలైన సమస్య  పెద్ద వివాదంగా మారింది. విశ్వాసానికి ప్రతీకగా మారిన ప్రసాదంలో కల్తీ నెయ్యి.. అది కూడా జంతువుల కొవ్వును కలిపి తయారుచేయడం  ఏంటి అని హిందువులు నెత్తి నోరు కొట్టుకున్నారు. భక్తులు గగ్గోలు పెట్టారు. ఈ తప్పు ఎవరు చేసినా  ఖచ్చితంగా  శిక్షను అనుభవించాలని డిమాండ్ చేశారు.

ఇక ఒకపక్క వైసీపీ.. ఇంకోపక్క కూటమి తప్పు మీదంటే మీది అంటూ మాటల యుద్ధం మొదలుపెట్టారు.  అప్పుడే పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారు. సనాతన ధర్మం అంటూ ఫైర్ అయ్యారు. దీంతో మొదట్లో  చాలామంది పవన్ ను తప్పుగా అనుకున్నా.. ఇంకొంతమంది ఆయన చెప్పినదాంట్లో తప్పేమి ఉందని సపోర్ట్ గా నిలబడ్డారు. అసలు ఎక్కడా తగ్గేది లేదని.. పవన్, స్వామివారికి జరిగిన అన్యాయానికి తాను బాధ్యత  వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. స్వామివారి ఆలయానికి వెళ్లి మెట్లు కడిగారు. ఎప్పుడైతే పవన్ నోటి నుంచి సనాతన ధర్మం అనే పదం వచ్చిందో.. అప్పటినుంచి కొంతమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఇంతకు ముందెప్పుడు పవన్ ఇలా పూజలు, దీక్షలు చేయడం చూసింది లేదు. ఎన్నికల ముందు నుంచే ఆయన పూజలు అని ఆలయాలు తిరగడం చూస్తున్నామని, ఇంట్లో ఆయన భార్య అన్నా లెజినోవో క్రిస్టియన్ .. ఆమెతో పాటు చర్చ్ కు వెళ్లినట్లు పవన్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. వారి పిల్లల పేర్లు కూడా బైబిల్ కు సంబంధించిన పేర్లే ఉంటాయి.  అలాంటి  పవన్.. ఇప్పుడు సనాతన దర్మం గురించి మాట్లాడమేంటి.. ? అని ఫైర్ అయిన వారు లేకపోలేదు. అయినా వీటినేమి పట్టించుకోకుండా పవన్ ఇంకా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. శ్లోకాలతో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

ఇక  అక్కడితో ఆగకుండా.. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా ఫైర్ అయ్యారు.  ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీ సరదాగా లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అన్న మాటకు కూడా పవన్ సీరియస్ అయ్యారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని,  అలాంటివారిని ప్రజలు క్షమించరని తెలిపారు. దీంతో కార్తీ సైతం చేయని తప్పుకు పవన్ కు సారీ చెప్పాడు.  దీనివలన  ప్రజల్లో ఎక్కువ మార్కులు కొట్టేసింది కార్తీ మాత్రమే.  పవన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, అంత చేయాల్సిన అవసరం లేదని విమర్శించడం మొదలుపెట్టారు. ఇలా ప్రతిసారి పవన్.. సనాతన ధర్మం పేరు చెప్పి.. ఏదో చేయాలనుకున్నారు.. చివరకు ఏది చేయలేకపోయారు అన్నది మాత్రం వాస్తవం.

అసలు పవన్.. దీన్నీ హైలైట్ చేయడం వెనుక కారణం ఏంటి.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పెట్టుకొని ఈ వివాదాన్నే ఎక్కువ సీరియస్ గా ఎందుకు తీసుకున్నారు. అసలు నిజాలు ఏంటి.. ?  ఆధారాలు ఏం ఉన్నాయని తెలుసుకోకుండా  హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసాదం గురించి ఎలా మాట్లాడతారు. ఇదే ప్రశ్నను సుప్రీం కోర్టు కూడా సంధించింది. సిట్ విచారణ చేపట్టామని చెప్పారు. కానీ, సిట్ విచారించేలోపే దేవుడిని రాజకీయాల్లోకి లాగారు. ఎంతోమంది భక్తులు.. ఇకనుంచి ఆ ప్రసాదాన్ని మనస్ఫూర్తిగా తినగలరా.. ?  ఇదంతా ఎవరి తప్పు.

పవన్ అటెన్షన్ కోసమే ఇంత  రచ్చ చేశారా.. ?  ఇప్పుడు సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి వీటికి సమాధానాలను చెప్పండి అని ప్రజలు  ప్రశ్నిస్తున్నారు. ఆ సనాతన ధర్మం  ఇప్పుడు ఏమైంది.. ?  హిందువుల మనో భావాలను దెబ్బ తీసినందుకు  సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్  క్షమాపణ చెప్పి తీరాలి అని అంటున్నారు. సనాతన ధర్మం అని చెప్పి హీరో అవుదామనుకున్నాడు.. చివరకు జీరోగా మిగిలాడు అని ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు.   మరి  పవన్ కళ్యాణ్ .. ఒక  హిందువుగా కాదు కాదు.. ఒక బాధ్యతగల పదవిలో ఉన్న నాయకుడిగా క్షమాపణ  చెప్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Devara 2: మూవీలో ఈ హింట్‌ను గమనించారా.? సీక్వెల్ మొత్తం బ్లడ్ బాత్ పక్కా..

Srinu Vaitla: వెంకీట్రైన్ ఎపిసోడ్.. స్క్రిప్ట్ లో లేదు.. వాళ్లకే థాంక్స్ చెప్పాలి

Thalapathy69: విజయ్ చివరి సినిమా.. బాలయ్య హిట్ సినిమాకు రీమేక్ అని మీకు తెలుసా.. ?

Rajinikanth: తలైవా.. ఇక సినిమాలకు దూరమైతే మంచిదేమో..

Tollywood: సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్ అంటున్న యాటిట్యూడ్ స్టార్.. నిజమేనా..?

Prabhash: ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది.. దీంతో ప్రభాస్ రేంజ్ మరో లెవెల్..!

Devaki Nandana Vasudeva: ‘దేవకీ నందన వాసుదేవ’ విడుదలకు భారీ ప్లాన్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Big Stories

×