EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad police: డీజే సౌండ్ పెరిగిందో.. బ్యాండ్ బాజానే.. పోలీసులు తాజా హెచ్చరికలు

Hyderabad police: డీజే సౌండ్ పెరిగిందో.. బ్యాండ్ బాజానే.. పోలీసులు తాజా హెచ్చరికలు

Hyderabad police: సిటీల్లో పండుగలు.. ఉత్సవాలంటే ముందుగా గుర్తుకొచ్చేది డీజే. భారీ సౌండ్లతో వీధులు, రోడ్లపై డ్యాన్సులు చేస్తూ నానా హంగామా చేస్తుంటారు. డీజే లేకుంటే జోష్ రాదన్నది యూత్ అభిప్రాయం. ముఖ్యంగా హైదరాబాద్ దీని హంగమా మరీ ఎక్కువ. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పరిస్థితి గమనించి సౌండ్ పొల్యూషన్‌పై ఉక్కుపాదం మోపారు హైదరాబాద్ పోలీసులు.


ఈ నేపథ్యంలో కొన్ని ఆంక్షలు పెట్టారు హైదరాబాద్ పోలీసులు. నాలుగు జోన్లగా విభజించారు. న్యాయస్థానం గైడ్ లైన్స్ ప్రకారం.. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు వరకు రెండు కేటగిరిలుగా విభజించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు వరకు డీజే సిస్టమ్ ను ఉపయోగించరాదని చెబుతోంది.

సైలెన్స్ జోన్ లో అయితే.. ఆసుపత్రులు, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్, న్యాయస్థానాలు పరిధిలో అయితే 100 మీటర్ల‌లోపు డీజే సిస్టమ్ ఉండరాదన్నది కీలక పాయింట్. తాజాగా పోలీసులు జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. పరిశ్రమలున్న ప్రాంతాన్ని ఏ జోన్ గా గుర్తించారు.


కమర్షియల్ షాపులున్న ప్రాంతాన్ని బీ గాను, రెసిడెన్షియల్ ఏరియాను సీ గా, సైలెన్స్ జోన్‌ను డీ గా వర్గీకరించారు. ఏ ప్రాంతంలో అయితే పగలు – 75 డెసిబుల్స్, రాత్రి వేళ -70 డెసిబుల్స్ ఉండాలన్నది నిబంధన పెట్టారు.

ALSO READ: ట్రోలింగ్స్ బ్యాచ్ కి సినిమా చూపించనున్న రేవంత్ సర్కార్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పట్ల గుస్సా

బీ జోన్ అయితే పగలు-65, రాత్రి వేళ 55 గా ఉండాలి. సీ జోన్ అయితే.. పగలు-55, రాత్రి వేళ-45 గా ఉండాలి. డీ జోన్ అయితే పగలు-50, రాత్రివేళ 40 డెసిబుల్స్ మించి ఉండరాదన్నది కీలక నిర్ణయం. హైదరాబాద్‌లో అన్ని మతాల పండుగ వేళ ఫైక్ క్రాకర్స్ నిషేధం విధించింది.

Related News

Mp Raghunandan : అక్కకు జరిగిన అవమానం అది.. వకీలుగా తమ్ముడు కోర్టుకు ఈడుస్తాడు : ఎంపీ రఘునందన్‌

Congress Mla Srinivas reddy : కేటీఆర్ ఇటలీ నీళ్లు తాగొచ్చు కానీ పేదలు మంచినీళ్లు తాగొద్దా : యెన్నం

Demolitions: మూసీ కూల్చివేతలు షురూ!.. కానీ, అక్కడికి బుల్డోజర్లు వెళ్లలేని పరిస్థితి.. మరి వాటిని కూల్చివేయడం ఎలా..?

Minister Sridharbabu: మూసీలో అక్రమ కట్టడాలను గుర్తించాలని కేసీఆర్ ఆదేశించలేదా?: మంత్రి శ్రీధర్ బాబు

GHMC Elections : 2025లో హైదరాబాద్? మేయర్ పీఠం మీద కూర్చునేదెవరు? నగరాన్ని రక్షించేవారికే అందలం

KTR: ఈ పిల్లలకు రాహూల్ ఏమి చెప్తారు ? రాహూల్ కి ట్వీట్ ట్యాగ్ చేసిన కేటీఆర్

Mynampally: పెట్రోల్ బంకులను కూడా హైడ్రా కూల్చివేయాలి: మైనంపల్లి

Big Stories

×