EPAPER
Kirrak Couples Episode 1

Sanatahana Dharma : సనాతన ధర్మంపై ఈ డిప్యుటీ సీఎమ్‌లు తలోదారి, హీరోలే గానీ.. ఆ విషయంలో మాత్రం…

Sanatahana Dharma : సనాతన ధర్మంపై ఈ డిప్యుటీ సీఎమ్‌లు తలోదారి, హీరోలే గానీ.. ఆ విషయంలో మాత్రం…

వారిద్దరూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లే. కానీ పార్టీలు, రాష్ట్రాలే వేరు. అంతే కాదు వాళ్ల పనితీరు, పాలనా పద్ధతులు కూడా వేరే. కానీ అల్టిమేట్ గా ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడమే వాళ్లిద్దరి లక్ష్యం.
ఈ ఇరువురు సినిమా నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. ఇద్దరూ సినిమా హీరోలుగా పనిచేసి కోట్లాది అభిమానులను సంపాదించుకున్న వారే.


వీరిద్దరిలో ప్రధాన తేడా ఏంటంటే, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, పరిరక్షించుకుందాం అని ఒక నాయకుడు అంటుంటే, మరో నేత మాత్రం సనాతన ధర్మంలో అనేక లోపాలున్నాయి. వాటిని తొలగించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. వాళ్లే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మరో నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.

భారతదేశ సంస్కృతి, సంప్రదాయం, హిందూయిజం, మత విలువలు, ఆథ్యాత్మికత, సనాతన ధర్మం అంటే పవన్ కల్యాణ్ చాలా విలువ ఇస్తారు. పూర్వీకులు మనకు ఇచ్చిన ఆస్తి అవేనని, వాటిని తప్పకుండా రక్షించుకోవాలని అంటుంటారు.


ఇదే సమయంలో దేశంలో మతం పేరిట చాలా వివక్ష కొనసాగుతోందని, ప్రధానంగా హిందూవుల్లో ఇది అధికంగా ఉందని, సనాతన ధర్మంలోని అధిపత్య ధోరణ, లోపాల వల్లే ఇలా జరుగుతోందని స్టాలిన్ వాదిస్తున్నారు.

పవన్ కల్యాణ్ :

సనాతన ధర్మం బతకడమెలాగో నేర్పిస్తుంది. దానికి అన్యాయం జరిగితే తాము సహించబోం. కోట్లాది మంది హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతిననివ్వం. అన్ని మతాలతో కలిసి ఉండే వ్యక్తిని నేను. సర్వమత సమ్మెళనంలాగా భారతీయులు అంతా కలిసి మెలిసి జీవించాలన్న సూత్రానికి జై కొడతానని పవన్ అంటుంటారు.

ఎవరి మతం వాళ్లకు ముఖ్యమే…

కేంద్రంలో హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరముందని తాజాగా అభిప్రాయం సైతం ఆయన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలు, ధార్మిక మండళ్లు హిందువులే నిర్వహించాలి. ఎవరి మతాన్ని వాళ్లు నిష్ఠగా ఆచరించాలి. సోదరభావంతో మెలగాలి అన్నదే నా ఉద్దేశం అని ఇదివరకే ఎన్నోసార్లు చెప్పారు ఈ జనసేనాని.

తాజాగా లడ్డూ వివాదంలో హిందూ ధర్మం అబాసుపాలవుతుందని గళమెత్తిన స్టార్ పొలిటికల్ లీడర్ పవన్ కల్యాణ్ అని అభిమానులు, జనసేన శ్రేణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న తిరుమలకు వెళ్తానంటూ చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలయ ప్రవేశం చేయలేక వెనుదిరిగిపోవడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్ నేడు తిరుమల స్వామి వారి దర్శనానికి బయలుదేరడం విశేషం. హిందూ ధర్మ పరిరక్షణలో తాము వెనకడుగు వేసేదే లేదని ఈ చర్య ద్వారా ఆయన ప్రభుత్వ లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పదల్చుకున్నారని తెలుస్తోంది.

ఉదయనిధి స్టాలిన్ :

ఓవైపు తమిళనాడులో హిందూ మతం మీద సంచలన కామెంట్లు చేస్తుంటారు. మరోవైపు హిందీ భాషను, ఉత్తరాధి ఆదిపత్యాన్ని, పరభాషను ఇట్టే తిరస్కరించేస్తారనే పేరుంది. ఇక సనాతన ధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం డీఎంకే డీఎన్ఏలోనే ఉంది. మంత్రిగా ఓ సదస్సుకు హాజరైన ఉదయనిధి స్టాలిన్, అక్కడ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దేశాన్నే కుదిపాయి.

అదో రోగం…

సనాతనధర్మం ఓ రోగం లాంటిది. సామాజిక న్యాయం, సమానత్వానికి ఇది వ్యతిరేకంగా ఉంటుందని స్టాలిన్ అన్నాడు. అయితే మనం కొన్నింటిని కేవలం వ్యతిరేకించి ఊరుకుంటే లాభం లేదు. వాటిని నిర్మూలించగలగాలి అని ఆయన అంటారు.

also read : చర్చిలపై ప్రభుత్వ పెత్తనం లేదు.. ఆలయాలపై ఎందుకు? చంద్రబాబు, పవన్‌లపై కె.ఎ.పాల్ షాకింగ్ కామెంట్స్

ద్రవిడనాట పోరాడుతూనే ఉంటాం…

మేం పేరియార్, అన్నా, కలైంగార్ వారసులం, సమాజంలో సమానత్వం, న్యాయాన్ని స్థాపించే వరకు పోరాడుతూనే ఉంటాం. ద్రావిడనాట ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం అని ఎవరూ ఊహించని రీతిలో మాటలు అనేశారు. డీఎంకే ప్రభుత్వం వచ్చిన కొత్తలో కేవలం మంత్రిగా కొనసాగిన ఉదయనిధి స్టాలిన్, తాజాగా తమిళనాడు మంత్రి వర్గ విస్తరణలో ఆ రాష్ట్ర సీఎం, తండ్రి ఎంకే స్టాలిన్ ప్రమోషన్ సైతం ఇచ్చారు. ఏకంగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఇస్తూ తన తర్వాత తన కుమారుడే డీఎంకే పార్టీకి, ప్రభుత్వానికి వారసుడు అని చెప్పకనే చెప్పేశారు.

తాత కరుణానిధి, తండ్రి ఎంకే స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్. ఈ ముగ్గురి ఆలోచనా విధానం, పార్టీని నడిపే తీరు, వాళ్ల ఆశయాలు, లక్ష్యాలు ఒక్కటిగానే కనిపిస్తుంటాయి.
చిన్న వయసులోనే దక్షిణాది రాష్ట్రాలకు ఉపముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న ఈ సినిమా హీరోలు పవన్ కల్యాణ్, ఉదయనిధి స్టాలిన్ లు పరస్పర భిన్న పద్ధతుల్లో తమ ప్రయాణం కొనసాగిస్తుండటం గమనార్హం.

Related News

Home Minister: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Pawan Klayan: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన

YS Jagan Mohan Reddy: తిరుమల భక్తులపై జగన్ ప్రభుత్వం కుట్ర?

Ysrcp Seats : చట్టసభల్లో వైసీపీ బలమెంత… ఇప్పటికీ జగన్‌దే పైచేయా?

Chandrababu: చేయరాని నేరాలు చేశారు.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు : చంద్రబాబు

Prakash Raj: పెట్టిన పంగనామాలు చాలు ఇక… పాలనపై దృష్టి పెట్టండి: ప్రకాష్ రాజ్

Big Stories

×