EPAPER
Kirrak Couples Episode 1

Nerella Sharada: మహిళా కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు, ఆపై ఆగ్రహం..

Nerella Sharada: మహిళా కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు, ఆపై ఆగ్రహం..

Nerella Sharada: రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద. గడిచిన కొన్నేళ్లుగా మహిళా కళాశాల విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. వారానికి ఒకటీ రెండు మహిళా కాలేజీలను సందర్శిస్తున్నారామె.


లేటెస్ట్‌గా మాదాపూర్‌లోని శ్రీచైతన్య మహిళా కాలేజీని ఆకస్మిక తనిఖీ చేశారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. నేరుగా కాలేజీకి వెళ్లారు ఛైర్మన్. విద్యార్థుల తరగతుల గదికి వెళ్లారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థుల వసతిని పరిశీలించారు.

కాలేజీ హాస్టల్, మెస్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ పరిశుభ్రత లేకపోవడంతో ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో సౌకర్యాలు సరిగా లేవని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని యాజమాన్యం పై నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఏమైనా సమస్యలున్నా, యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమని సంప్రదించవచ్చని విద్యార్థులకు మహిళా కమిషన్ ఛైర్మన్ భరోసా ఇచ్చారు. గతవారం నిర్మల్ జిల్లా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారామె. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. రిజిస్టర్లలను తనిఖీలు చేసి ఎంతమంది విద్యార్థులున్నారని ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు ఛైర్మన్ నేరెళ్ల శారద.

 

Related News

KTR: పేదల బ్రతుకులను కూల్చేస్తున్నారు.. రాహుల్ స్పందించాలి.. కేటీఆర్ ట్వీట్..

Mynampally: పెట్రోల్ బంకులను కూడా హైడ్రా కూల్చివేయాలి: మైనంపల్లి

Minister Komatireddy: అమెరికాలో చదువుకున్నావ్ నీకు కామన్ సెన్స్ ఉందా… కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

Singireddy Niranjan Reddy: చెరువును మింగేసిన నిరంజన్ రెడ్డి.. నీళ్లు కనబడలేదా మహాశయా!

Hyderabad KBR Park: 6 జంక్షన్లు.. రూ. 826 కోట్లు.. కేబీఆర్ పార్క్.. ఆపరేషన్ ఫ్లైఓవర్

KTR: అంబర్‌పేటలో కేటీఆర్‌కు ఊహించని షాక్.. డిప్రేషన్‌లోకి కేసీఆర్?

Hyderabad police: డీజే సౌండ్ పెరిగిందో.. బ్యాండ్ బాజానే.. పోలీసులు తాజా హెచ్చరికలు

Big Stories

×