EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad Police: రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్..36 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

Hyderabad Police: రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్..36 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

Hyderabad Police busts cyber crime racket: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు రాజస్థాన్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో వివిధ రూపాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝులిపించారు. ఈ మేరకు నేరాలకు పాల్పడిన 36 మంది సైబర్ నేరగాళ్లను రాజస్థాన్ గడ్డపై తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల నుంచి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.


ఈ మేరకు వారి దగ్గర భారీగా లభ్యమైన బ్యాంక్ చెక్ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీడియాకు వివరించనున్నట్లు సమాచారం.

సైబర్ క్రైమ్ 7టీమ్స్ గా పిలవబడే ఈ ఆపరేషన్ పెట్టుబడి మోసం, ట్రేడింగ్ మోసం, ఫెడెక్స్ కొరియర్ మోసంతోపాటు కేవీసీ మోసం వంటి దాదాపు 20 రకాల కొత్త కేసులపై విచారిస్తుంది. ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటుంది. తాజాగా, రూ.12కోట్లకుపైగా సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.


Also Read: ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఓ కుటుంబం.. ఒకరి పరిస్థితి డేంజర్, ఏం జరిగింది?

మొత్తం రూ.12 కోట్లలో ఇప్పటివరకు అధికారులు రూ.1.5 కోట్లను రికవరీ చేయడంతోపాటు రూ.2.8కోట్ల ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఈ క్రమంలోనే నిందితుల నుంచి రూ.38లక్షలు నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాంకు పుస్తకాలు, బ్యాంకు కార్డులు, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వ్యక్తులు దేశవ్యాప్తంగా 983 సైబర్ క్రైమ్ కేసుల్లో ప్రమేయం ఉన్నారని తదుపరి విచారణలో తేలింది, ఒక్క తెలంగాణలోనే 131 కేసులు నమోదయ్యాయి.

విచారణలో అరెస్టు అయిన వ్యక్తులు దేశ వ్యాప్తంగా 983 సైబర్ క్రైమ్ కేసుల్లో ప్రమోయం ఉందని తేలింది. తెలంగాణలో ఏకంగా 131 కేసులు నమోదయ్యాయి. ఇటీవల రాజస్థాన్ లోని పింప్రీ చించ్ వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్ రూ.కోటికి పైగా మోసం పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులో జైపూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మయాంక్ అశోక్ కుమార్ గోయల్ తన మిత్రులతో కలిసి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే వీరంతా తాము ఎస్బీఐ, సీబీఐ ఉద్యోగులమని మోసానికి తెర లేపినట్లు విచారణలో తేలింది.

అదే విధంగా, ఇటీవల 60 ఏళ్ల వృద్ధుడికి వాట్సాప్ వీడియో కాల్ చేసి మనీలాండరింగ్ పేరుతో అశోక్ బృందం బెదిరింపులకు గురి చేశారు. ఈ క్రమంలోనే అతని నుంచి బ్యాంకు వివరాలు సేకరించి ఆ తర్వాత బ్యాంకు నుంచి ఏకంగా రూ.కోటి 8 లక్షలు డ్రా చేసుకున్నారు. అనంతరం ఈ నగదును గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలకు తరలించారు. అశోక్ గోయల్ అరెస్ట్ తో పాటు ఈ స్కాంలో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానం కలిగితే వెంటనే అధికారులకు తెలియజేయాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

Related News

Hyderabad: ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఓ కుటుంబం.. ఒకరి పరిస్థితి డేంజర్, ఏం జరిగింది?

Tripura: త్రిపురలో దారుణం.. కన్నతల్లిని కుమారులే చెట్టుకు కట్టేసి సజీవ దహనం!

Illegal affair: అక్రమ సంబంధం.. భర్తను బాంబుతో లేపేసిన భార్య, మంచంపై నిద్రిస్తుండగా…

Extramarital Affair Murder: భార్యను పరాయి పురుషుడి కౌగిట్లో చూసిన భర్త.. విషప్రయోగంతో మృతి!

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

VMHR School principal: విక్టోరియా స్కూల్ ప్రిన్సిపల్ ఆగడాలు.. డబ్బు, విద్యార్థులతో కూడా

Big Stories

×