EPAPER
Kirrak Couples Episode 1

Google Maps : గూగుల్‌ మ్యాప్స్‌లో సరికొత్త టైమ్ ట్రావెల్​​ ఫీచర్‌ – ఇకపై గతంలోకి వెళ్లొచ్చు!

Google Maps : గూగుల్‌ మ్యాప్స్‌లో సరికొత్త టైమ్ ట్రావెల్​​ ఫీచర్‌ – ఇకపై గతంలోకి వెళ్లొచ్చు!

Google Maps :  తెలియని ప్రదేశాలకు మనం ప్రయాణించాలన్నా, లేదంటే త్వరగా గమ్య స్థానానికి చేరడానికి షార్ట్‌ కట్​లో రూట్స్‌లో వెళ్లాలన్నా టక్కున మన మెదడుకి ముందుగా గుర్తుకొచ్చేది గూగుల్‌ మ్యాప్స్‌. అందుకే ప్రతి ఒక్కరూ దీనినే ఎక్కువగా వినియోగిస్తుంటారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గూగుల్ మ్యాప్స్​ యాప్‌ ఎప్పటికప్పుడు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా, ఈ యాప్​ వినియోగం సులభతరంగా ఉండేలా తన సేవల్ని మరింత విస్తరిస్తూ పోతోంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అందుకే గూగుల్ మ్యాప్స్‌కు ఇంతటి ఆదరణ లభిస్తోంది.


ఇప్పటికే ఈ ఏడాది గూగుల్ మ్యాప్స్​లో రియల్‌ టైమ్‌ లొకేషన్‌ షేరింగ్‌, ఫ్యూయెల్​ సేవింగ్, లాక్‌ స్క్రీన్‌పైనే లొకేషన్‌ వంటి పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్‌.. తాజాగా మరికొన్ని కొత్త అప్డేట్స్​ను యూజర్లకు అందించింది. గూగుల్ మ్యాప్స్​తో పాటు స్ట్రీట్ వ్యూ, గూగుల్ ఎర్త్​లో మేజర్ అప్డేట్స్​ను తీసుకొచ్చింది.

ఈ మేజర్స్ అప్డేట్స్​​ సాయంతో కాలంలో వెనక్కి వెళ్లొచ్చు. అవును నిజం. ప్రస్తుతం ఓ ప్రదేశాన్ని ఎంచుకుని, అది 80 ఏళ్ల క్రితం వరకు ఎలా ఉంటుందో ఈ ఫీచర్ ద్వారా స్పష్టంగా చూసేలా వెసులుబాటును కల్పించింది గూగుల్. 1930 నుంచి ఇప్పటి వరకు బెర్లిన్, లండన్, పారిస్ వంటి నగరాల ప్రత్యేక ప్రదేశాలను ఇందులో చూడొచ్చు.


హిస్టారికల్ ఇమేజ్ – గూగుల్ ఎర్త్​ లేదా గూగుల్ మ్యాప్స్​లో హిస్టారికల్ ఇమేజరీ అనే ఫీచర్​ను జోడించారు. దీన్ని టైమ్ మెషీన్ ఫీచర్​ అని కూడా అనొచ్చు. ఈ ఫీచర్ వెబ్​తో పాటు మొబైల్​నూ ఉంటుంది. దీని సాయంతో యూజర్స్​ టైమ్ ట్రావెల్ చేయొచ్చు అన్న మాట. అంటే గతంలో మనం ఎంచుకున్న ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

ALSO READ : సోనీ నుంచి 85 అంగుళాల బ్రేవియా టెలివిజన్

దాదాపు 80 సంవత్సరాల క్రితం వరకు సదరు ప్రాంతాలు ఎలా ఉంటాయో ఇది మనకు చూపిస్తుంది. ఆ ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాయో చూపిస్తుంది. మొదట్లో ఇది గూగుల్ ఎర్త్​ ప్రో పెయిడ్ వెర్షన్​లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు వెబ్​, మొబైల్​ ప్లాట్​ఫామ్స్​లో ఉంది. సాటిలైట్​ ఇమేజ్​ ద్వారా వీటిని చూడొచ్చు. దశాబ్దాలుగా వివిధ ప్రాంతాలు, నగరాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలు, ఇతర ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఎలా అభివృద్ధి చెందాయో, రూపాంతరం చెందాయో చూపిస్తుంది.

స్ట్రీట్ వ్యూ ఫీచర్ ఎక్స్​ప్యాన్షన్​ – స్ట్రీట్ వ్యూ ఇమేజరీని ప్రస్తుతం ఎక్స్​ప్యాన్షన్​ చేసి తీసుకొచ్చింది గూగుల్​. భవిష్యత్తులో స్ట్రీట్ వ్యూ కవరేజీని మరింత విస్తరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుని దీన్ని అప్డేట్ చేస్తోంది. దాదాపు 80 దేశాలను ఇది కవర్ చేస్తుంది. అక్కడి ప్రాంతాలను తొలిసారి తీసిన ఫొటోలను డీటెయిల్డ్​గా చూపిస్తుంది.

ఏఐ ఆధారిత టూల్​తో మరింత స్పష్టంగా – మూడో ఫీచర్​గా ఇమేజ్​ నాణ్యతను పెంచేలా ఏఐ ఆధారిత టూల్​ను తీసుకొచ్చింది. ఈ ఏఐ-ఆధారిత సాంకేతికత ద్వారా గూగుల్ ఎర్త్, మ్యాప్స్​లోని చిత్రాల క్వాలిటీని మరింత మెరుగుపరిచి చూపిస్తుంది. క్లౌడ్ స్కోర్​​ అనే ఏఐ మోడల్​ టూల్​ను ఉపయోగించి, ఫొటోస్​లోని మేఘాలు, పొగమంచు వంటి వాటిని తీసివేయగలదు. ఫొటోస్​ను గతంలో కన్నా మరింత షార్ప్​గా, స్పష్టంగా చూపిస్తుంది.

అదే సమయంలో ప్రకృతికి సంబంధించిన ఫొటోలను ఉన్నది ఉన్నట్టుగా అందంగా చూపిస్తుంది. అర్బన్ ఎన్విరాన్​మెంట్స్​, నేచురల్ ల్యాండ్​స్కేప్స్​, రిమోట్​ లొకేషన్స్​ను బాగా చూపిస్తుంది. మొత్తంగా ఈ అప్డేట్స్​ను ఉపయోగించుకోవాలనుకునే వారు గూగుల్‌ మ్యాప్స్‌ లేదా గూగుల్‌ ఎర్త్‌లోకి వెళ్లి చూడాలనంటుకున్న ప్రాంతం లేదా ప్రదేశాన్ని సెర్చ్‌ చేయాలి.

Related News

Samsung Galaxy Z Fold 6 : పెద్ద డిస్​ప్లేతో ఇండియాలోకి సామ్ సాంగ్ స్పెషల్ ఎడిషన్ – ప్రీ ఆర్డర్​, స్పెసిఫికేషన్స్​ లీక్​

Flipkart Big Billion Days Sale : అదిరే ఆఫర్.. రూ.37,000 ల్యాప్టాప్ కేవలం రూ.10,000కే!

Amazon Great Indian Festival Sale 2024 : తగ్గేదేలే… తెగ కొనేస్తున్నారుగా.. ఆ ప్రొడక్ట్స్​కు ఫుల్ డిమాండ్​!

October 2024 Best Smart Phones : అక్టోబర్లో రానున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే.. ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ

Sony Bravia 9 : సోనీ నుంచి 85 అంగుళాల బ్రేవియా టెలివిజన్

iphone demand in india : ఐఫోన్లకు భారీగా పెరిగిన గిరాకీ – డైమండ్స్​ను అధిగమించిన స్మార్ట్‌ ఫోన్ల విలువ!

Big Stories

×