EPAPER
Kirrak Couples Episode 1

OTT movie: ఆ ఇంట్లోకి వెళ్తే ఏమవుతుంది? ఈ మూవీ చూస్తున్నంత సేపు.. టెన్షన్‌తో చెమటలు పట్టేస్తాయ్

OTT movie: ఆ ఇంట్లోకి వెళ్తే ఏమవుతుంది? ఈ మూవీ చూస్తున్నంత సేపు.. టెన్షన్‌తో చెమటలు పట్టేస్తాయ్

 Welcome Home Crime Thriller: ‘వెల్ కం హోమ్’. వాస్తవ ఘటన ఆధారంగా హిందీలో తెరకెక్కిన ఈ సినిమా 2020లో విడుదలైంది. ఈ మూవీ చూస్తే మనసు చలించిపోవడం ఖాయం. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను పుష్కర్ మహాబల్ తెరకెక్కించారు. కాశ్మీర్ ఇరానీ, స్వర్థ తీగలే, బోలోరాం దాస్, టీనా భాటియా ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఈ సినిమాను నిర్మించారు.


‘వెల్ కమ్ హోమ్’ సినిమా కథ..

సినిమా ఓపెన్ కాగానే ఓ ఎక్ట్రీషియన్ కరెంటు పని మీద గ్రామ శివారులోని విద్యుత్ సంస్థంభాలను పరిశీలిస్తుంటాడు. అతడిని దాహం కావడంతో దగ్గరే ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఊరి శివారులో ఉన్న ఏకైక ఇల్లు ఇదే. ఆయన బయటి నుంచి చాలా సేపు డోర్ కొడతాడు. ఎవరూ బయటకు రారు. ఎందుకో ఈ ఇల్లు కాస్త తేడాగా అనిపిస్తుంది. కాసేపటి ఎవరో ఆ  ఇంట్లో నుంచి డోర్ ఓపెన్ చేయడానికి వస్తారు.


జనాభా లెక్కల కోసం ఆ ఇంటికి వెళ్లిన లేడీ టీచర్లు

సీన్ కట్ చేస్తే.. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ అనుజ ఓ స్కూల్ టీచర్. రీసెంట్ తనకు సొంతూరు నుంచి పక్క ఊరికి ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఆమెకు కాబోయే భర్తకు అనుజ జాబ్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె తండ్రి కూడా జాబ్ వదిలేసి పెళ్లి చేసుకోవాలంటాడు. మరుసటి రోజు తనుజ కొత్త స్కూల్ కు వెళ్తుంది. అదే స్కూల్లో స్నేహ అనే సైన్స్ టీచర్ పరిచయం అవుతుంది.

వీరిద్దరికి అధికారులు జనాభా లెక్కల డ్యూటీ వేస్తారు. వాళ్లకు కేటాయించిన ఊళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. చివరగా ఓ ఇల్లు మిగులుతుంది. ఆ ఇంటి కోసం వెతుకుతారు. లిస్టులో పేరు ఉన్నా అక్కడికి వెళ్లి చూస్తే ఇల్లు కనిపించదు. చివరకు ఊరి శివారులో ఓ పెద్ద ఇల్లు కనిపిస్తుంది. చాలా సేపు డోర్ కొడితే ప్రేరణ అనే అమ్మాయి డోర్ ఓపెన్ చేస్తుంది. ఆమె ప్రెగ్నెంట్. మెంటల్ కండీషన్ కూడా సరిగా ఉండదు.

అనుజ ఆమె నుంచి కుటుంబ వివరాలను అడుగుతుంది. చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? అని అడుగుతుంది. పిల్లలు ఎవరూ లేరని, పుట్టగానే కాసేపు ఏడ్చి చనిపోతారని చెప్తుంది. అనుజ, స్నేహ షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి ఓ ముసలావిడ వస్తుంది. అప్పడికే వాళ్లకు కావాల్సిన వివరాలు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు.

బయట వాళ్లకు భోళా అనే వ్యక్తి కనిపిస్తాడు. ఆ ఇంట్లో పని వాడైన భోళా చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉంటాడు. స్నేహ వైపు చూసి ఒకరకంగా నవ్వుతాడు. స్నేహ, అనుజ కలిసి స్కూల్ కు వెళ్తారు. అప్పటికే స్నేహ బ్రదర్ తన సిస్టర్ ఇంటికి రావడం లేట్ అయ్యిందని స్కూల్ కు వస్తాడు. ఏం చెప్పకుండా వెళ్లినందుకు ఆమెను తిడతాడు.

కావాలని వెళ్లి కష్టాల్లో పడ్డ టీచర్లు

సీన్ కట్ చేస్తే.. మళ్లీ ఎలక్ట్రీషియన్ కనిపిస్తాడు. ఇంట్లో నుంచి ఎవరో అమ్మాయి అరుపులు వింటాడు. కాసేపటికి డోర్ ఓపెన్ అవుతుంది. తనకు నీళ్లు కావాలని అడుగుతాడు. మళ్లీ తనుజ సీన్ మొదలవుతుంది. ఆ ఇంట్లోని ప్రేరణ ఏదో సమస్యలో ఉన్నట్లు తనుజ భావిస్తుంది. మళ్లీ ఓసారి ఆ ఇంటికి వెళ్తామని చెప్తుంది. నెమ్మదిగా ఇద్దరూ ఆ ఇంటికి వెళ్తారు.

ఇంట్లోకి వెళ్లి ఓ ముసలావిడతో మాట్లాడుతారు. ఆమె వాళ్లపై చిరాకు పడుతుంది. భోళా వారిపై చూస్తూ పిచ్చివాడిలా నవ్వుతాడు. కాసేపటికి అక్కడికి ఘన్ శ్యామ్ అనే వ్యక్తి వస్తాడు. ఆయన ప్రేరణ భర్త. అనుజ అడిగే ప్రశ్నలకు ఆయన కేవలం సైగల ద్వారా సమాధానం చెప్తాడు. నిజానికి ఆయన ఐదేళ్లు మౌనవ్రతంలో ఉన్నాడు.

కాసేపటికి అనుజ, స్నేహ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ, ఆ ఇంట్లో ఏదో జరుగుతుందని అనుజ భావిస్తుంది. అప్పుడే వర్షం మొదలవుతుంది. వాళ్లు అక్కడే చిక్కుకుపోతారు. చాలాసేపు ఆ ఇంట్లోనే వెయిట్ చేస్తారు. చీకటి పడుతుంది. చేసేదేం లేక ఆ రాత్రి అక్కడే ఉంటారు. అర్థరాత్రి సమయంలో అనుజకు ఏదో శబ్దం వినిపిస్తుంది. విండో నుంచి బయటకు చూస్తుంది. భయంతో తన ఫ్రెండ్ స్నేహను లేపుతుంది.

తాను ఓ డెడ్ బాడీని చూశానని, ఇక్కడి నుంచి బయటపడాలని చెప్తుంది. దాంతో వాళ్లిద్దరు నెమ్మదిగా బయటపడతారు. కానీ, స్నేహ అనుజను నువ్వు నిజంగానే డెడ్ బాడీని చూశావా? అని అడుగుతుంది. నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు  మళ్లీ వెళ్లి చూస్తే అక్కడ కట్ చేసిన వేలు కనిపిస్తుంది. కాసేపటికి ఓ వ్యక్తి అనుజ కాలు పట్టుకుని లాగుతాడు.

ఆయన ఎవరో కాదు.. సినిమా ప్రారంభంలో చూపించిన ఎలక్ట్రీషియన్.  వాళ్లు భయంతో అక్కడి నుంచి బయటకు వస్తారు. అదే సమయంలో అక్కడి చెట్ల నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. ఎలాగైనా ఈ నైట్ ఇక్కడే పడుకుని పొద్దున్నే వెళ్లిపోవాలి అనుకుంటారు. కానీ, రాత్రి వాళ్లు బయటకు వచ్చిన విషయాన్ని ఓల్డ్ లేడీ ఘన్ శ్యామ్ కు చెప్తుంది.

దీంతో వెళ్లిపోతున్న వాళ్లిద్దరిని ఘన్ శ్యామ్, భోళా పట్టుకుంటారు. వాళ్లిద్దరిని ఆ ఇంట్లో బంధిస్తారు. ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకునే అవకాశం ఉండదు. భోళా స్నేహాతో ఇంటిమేట్ అయ్యేందుకు ఘన్ శ్యామ్ పర్మీషన్ అడుగుతాడు. కానీ, ఒప్పుకోడు. అటు దీనికి కారణం నువ్వే అంటూ అనుజతో గొడవపడుతుంది.

స్నేహ అన్నయ్యను దారుణంగా చంపేసిన ఘన్ శ్యామ్

సీన్ కట్ చేస్తే.. అనుజకు కాబోయే భర్త.. అనుజ ఇంటికి వస్తాడు. కానీ, అక్కడ అనుజ కనిపించదు. అప్పుడే అక్కడికి వచ్చిన స్నేహ బ్రదర్.. తన సిస్టర్ కనిపించకపోవడానికి కారణం అనుజ అని చెప్తాడు.  ఇద్దరూ గొడవ పడతాడు. అటు అనుజను బంధించిన గదిలో టాబ్లెట్లు, బ్లడ్ శాంపిల్స్ ఉండటాన్ని చూస్తుంది. ఘన్ శ్యామ్ ప్రేరణకు ఇక్కడే డెలివరీ చేస్తున్నాడని, పుట్టిన పిల్లల్ని కూడా ఇక్కడే చంపేస్తున్నాడని తెలుసుకుంటుంది.

అనుజ ఎలాగైనా ఘన్ శ్యామ్, భోళాను చంపేయాలని స్నేహతో చెప్తుంది. ఓ రాడ్డు తీసుకుని వాళ్లిద్దరు లోపలికి రాగానే కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఘన్ శ్యామ్ తప్పించుకుని వాళ్లిద్దరిని కొరడాతో దారుణంగా కొడతాడు. తర్వాత ప్రేరణకు ఇష్టం లేకుండానే ఘన్ శ్యామ్ ఇంటిమేట్ అవుతాడు. ప్రేరణ ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉంటుంది. నెమ్మదిగా తనుజ తన చేతికి ఉన్న కట్లను విప్పుకుని, స్నేహ కట్లను కూడా విప్పుతుంది.

ఇద్దరూ ఆ గదికి ఉన్న డ్రైనేజీ పైపు నుంచి బయటకు వస్తారు. ఘన్ శ్యామ్, భోళాకు కనిపించకుండా తనుజ దాచుకుంటుంది. అటు రేకుల షెడ్డులో ఉన్న ఎలక్ట్రీషియన్ ను కాపాడేందుకు స్నేహ పరిగెడుతుంది. అప్పుడే స్నేహ బ్రదర్ ఆమెను వెతుక్కుంటూ ఈ ఇంటి వరకు వస్తాడు. తన సిస్టర్ గురించి భోళా, ఘన్ శ్యామ్ తో ఆరా తీస్తాడు. తమకేం తెలియదు అంటారు. కానీ, అక్కడ స్నేహ లాకెట్ పడి ఉండటం గమనిస్తాడు. తన చెల్లెలు ఎక్కడుందో చెప్పాలని ఘన్ శ్యామ్ ను కొడతాడు.

అప్పుడు భోళా బండరాయిని తీసుకుని స్నేహ బ్రదర్ తలమీద కొడతాడు. ఘన్ శ్యామ్ పెద్ద రాయిని అతడి తల మీద వేసి చంపేస్తాడు. అది చూసి స్నేహ షాక్ అవుతుంది. అదే సమయంలో వాళ్లు పారిపోతున్నారని తెలుసుకుని భోళా స్నేహను పట్టుకుంటాడు. అటు రేకుల షెడ్ లోకి వెళ్లిన తనుజను పట్టుకునేందుకు ఘన్ శ్యామ్ వెళ్తాడు. ఆమెను కాపాడేందుకు ఎలక్ట్రీషియన్ ట్రై చేస్తాడు. ఘన్ శ్యామ్ అతడిని కూడా చంపేస్తాడు.

తనుజ పారిపోవాలని ప్రయత్నించినా దొరికిపోతుంది. ఆ తర్వాత ఇద్దరినీ వేర్వేరు రూములలో బంధిస్తాడు. స్నేహతో ఇంటిమేట్ అయ్యేందుకు భోళాకు పర్మీషన్ ఇస్తాడు. స్నేహ అరుపులను వింటున్న అనుజ ఏం చేయలేకపోతుంది. భోళా స్నేహను దారుణంగా అనుభవిస్తాడు.

కన్నకూతురు పైనే ఘన్ శ్యామ్ అత్యాచారం

ఆ తర్వాత అనుజ తనను లాక్ చేసిన రూమ్ విండో నుంచి బయటకు దూకుతుంది. ఘన్ శ్యామ్, భోళా మైండ్ డైవర్ట్ చేసేందుకు పశువుల షెడ్డును తగలబెడుతుంది. భోళా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తాడు. అటు ఈ మంటలకు కారణం భోళా అని భావించి ఘన్ శ్యామ్ అతడిని కొడతాడు.

ప్రేరణ స్నేహ దగ్గరికి వచ్చి, ఆమెకు కొన్ని నీళ్లు ఇచ్చి తాగమంటుంది. ఎలాగైనా తాను బయటపడేందుకు సాయం చేయమని అడుగుతుంది. తన వల్లకాదని చెప్తుంది. ఆ విషయం తన తండ్రి ఘన్ శ్యామ్ కు తెలిస్తే చంపేస్తాడని చెప్తుంది. ఘన్ శ్యామ్ తన తండ్రి అని చెప్పడంతో స్నేహ షాక్ అవుతుంది.

అతడు చెప్పినట్లు విననందుకే తన తల్లిని కూడా చంపేశాడని చెప్తుంది. అటు అనుజను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న భోళాను ఆమె చంపేస్తుంది. కాసేపటికి స్నేహ తప్పించుకోవడానికి ప్రేరణ డోర్ ఓపెన్ చేస్తుంది. స్నేహ బయటపడుతుంది. అనుజ, స్నేహ బయట కలుస్తారు. వెంటనే ఇక్కడి నుంచి పారిపోదామని అనుజ అంటుంది. కానీ, జరిగినదానికి ప్రతీకారం తీర్చుకోవాలని స్నేహ చెప్తుంది.

ప్రేరణ ఘన్ శ్యామ్ కూతురు అని,ఆమె పైనే తను అత్యాచారం చేస్తున్నాడని చెప్తుంది. అతడిని చంపి ప్రేరణను కాపాడాలని భావిస్తారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి తనుజ అతడిపై దాడి చేసి చంపేస్తారు. అటు స్నేహ తనను కొట్టేందుకు ప్రయత్నించిన ముసలావిడను కూడా కొట్టి చంపేస్తుంది. వీళ్లిద్దరు కలిసి ప్రేరణను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో సినిమా అయిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్.. Sony liv ఓటీటీలో అందుబాటులో ఉంది.

Read Also: పోలీసే తోటి పోలీసులను టార్గెట్ చేస్తే? ఇలాంటి షాకింగ్ క్లైమాక్స్ మరే సినిమాలో చూసి ఉండరు!

Related News

OTT Movie : పొరపాటున ఆ తప్పు చేసే టీనేజర్స్ ఈ దెయ్యాలకు బలి.. హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ 

OTT Movie : బైబిల్ లోని ఆ 7 అంశాల ఆధారంగా వరుస హత్యలు… మైండ్ బ్లాక్ అయ్యే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ‘సత్యం సుందరం’లాంటి స్టోరీతో ఓటిటిలోకి వచ్చేసిన మలయాళ కామెడీ డ్రామా… ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movie : బెడ్ పై ఓవైపు భర్త, మరోవైపు బాయ్ ఫ్రెండ్ తో… సింగిల్ గా చూడాల్సిన బో*ల్డ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

OTT Movie : లాయర్ కు లవ్ లెటర్స్ పంపే దెయ్యం… ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : 10 రోజుల గ్యాప్ తో ఓటిటిలోకి 3 హారర్ సినిమాలు… ఏ మూవీని ఎక్కడ చూడచ్చు అంటే?

Big Stories

×