EPAPER
Kirrak Couples Episode 1

Horoscope 1 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Horoscope 1 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Astrology 1 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది? వంటి వివరాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. సమస్యలు కొనితెచ్చుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఒత్తిడికి లోనుకావొద్దు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

వృషభం:
వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఊహించని ధన లాభం ఉంటుంది. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృథా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.


మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. సౌభాగ్య సిద్ధి ఉంది. పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకుంటారు. కీలక సమయాల్లో తోటివారి సహకారం అందుతుంది. సమయానికి డబ్బు అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. పని భారం పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో తోటివారి సలహాలు పనిచేస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు.భోజన సౌఖ్యం కలదు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరగవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సహాయం అందుతుంది. అహంకారం, గర్వం దరిచేరనీయవద్దు. ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు తిరుగులేని విజయాలు ఉంటాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో సమస్యలు రావొచ్చు. దుర్గాస్తోత్రం చదవాలి.

Also Read: పితృ అమావాస్య నాడు సూర్య గ్రహణం రానుంది.. ఈ వస్తువులు దానం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి లాభాలు ఉంటాయి. అనుకున్న పనులకు అనుకున్న సమయానికి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉండవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

ధనుస్సు:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి లాభాలు వరిస్తాయి. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాలి. ఆటంకాలు ఎదురుకావొచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది.

కుంభం:
కుంభ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.

మీనం:
మీన రాశివారికి శుభ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. వ్యాపారంలో కీలక ప్రాజెక్టులో ఆచితూచి వ్యవహరిస్తే ఆదాయం పదింతలు అవుతుంది. తలపెట్టిన ప్రతి పనిలో విజయం వరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఇతరుల నుంచి సహాయం అందుతుంది. శివారాధన శుభప్రదం.

Related News

Surya Grahan 2024 : పితృ అమావాస్య నాడు సూర్య గ్రహణం రానుంది.. ఈ వస్తువులు దానం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి

Shardiya Navratri 2024 : శ్రీ రాముడు కూడా శారదీయ నవరాత్రి ఉపవాసం చేసాడని మీకు తెలుసా ?

Kojagori Lokhkhi Puja: కోజాగారి లక్ష్మీ పూజ ఎప్పుడు ? మంచి సమయం, తేదీ వివరాలు ఇవే

Sarva pitru Amavasya 2024: సర్వ పితృ అమావాస్య నాడు బ్రాహ్మణ విందు ఏర్పాటు చేసి దానం చేస్తే శ్రాద్ధం పూర్తిచేసినట్లే

Horoscope 30 September 2024: నేటి రాశి ఫలాలు.. ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Vishnu Rekha In Hand: విష్ణువు రేఖ చేతిలో ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయాలే సాధిస్తారు

Big Stories

×