EPAPER
Kirrak Couples Episode 1

Ratan Tata: నిర్మాతగా మారిన రతన్ టాటా.. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా గురించి మీకు తెలుసా?

Ratan Tata: నిర్మాతగా మారిన రతన్ టాటా.. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా గురించి మీకు తెలుసా?

Ratan Tata: రతన్ టాటా అనే పేరు బిజినెస్ వరల్డ్‌లో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ఎంత సంపాదించినా కూడా విలువలతో ఎలా బ్రతకాలో ఆయనను చూసే నేర్చుకోవాలి అని ప్రజలు అంటుంటారు. బిజినెస్‌లో టాప్ స్థానానికి చేరుకున్నవారు సినీ పరిశ్రమలోకి ఎంటర్ అవుతారు. కానీ రతన్ టాటా మాత్రం వారికి భిన్నం అని అనుకున్నారు. అయినా ఆయన కూడా సైలెంట్‌గా సినిమాల్లో నిర్మాతగా ఎంటర్ అయిన విషయం చాలామందికి తెలియదు. పైగా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా మాత్రం డిశాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ గురించి బయటికొచ్చింది. అది కూడా ఒక బాలీవుడ్ మూవీ అవ్వడం విశేషం.


హాలీవుడ్ సినిమాకు రీమేక్

2000ల్లో రతన్ టాటా నిర్మాతగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆయన అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేసిన ఒక సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ మూవీలో బిపాసా బసు, జాన్ అబ్రహం కూడా ఇతర లీడ్ రోల్స్‌లో కనిపించారు. ఇదొక రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్. 2004లో విడుదలయిన ఈ సినిమా పేరే ‘ఏత్బార్’. ఇది 1996లో విడుదలయిన ‘ఫియర్’ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. భారీ క్యాస్టింగ్‌తో అప్పట్లో భారీ బడ్జెట్‌తోనే ‘ఏత్బార్’ సినిమాను నిర్మించినా దానికి తగిన లాభాలు రాలేదు. పైగా ప్రేక్షకుల దగ్గర నుండి కూడా ఎక్కువగా నెగిటివ్ రివ్యూలే అందుకుంది.


Also Read: కన్న తండ్రే అనుకుంటే కమలహాసన్ కూడా మోసం చేశాడు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

నష్టాలు వచ్చాయి

‘ఏత్బార్’లో అమితాబ్ బచ్చన్.. డాక్టర్ రణవీర్ మల్హోత్రా అనే పాత్రలో కనిపించారు. తన కూతురు రియా మల్హోత్రాగా బిపాసా బసు కనిపించింది. ఇక బిపాసా భర్త ఆర్యన్ త్రివేది పాత్రలో జాన్ అబ్రహం నటించాడు. ఈ సినిమాలో తన కూతురు రియాను భర్త ఆర్యన్ నుండి కాపాడడం కోసం కష్టపడుతుంటాడు రణవీర్ మల్హోత్రా. మంచి థ్రిల్లర్ కథతో తెరకెక్కినా కూడా ఈ మూవీ చాలామంది ఆడియన్స్‌కు రీచ్ అవ్వలేకపోయింది. అందరి దగ్గర నుండి పాజిటివ్ టాక్ అందుకోలేకపోయింది. 2004లోనే ‘ఏత్బార్’ను రూ.9.50 కోట్లు పెట్టి నిర్మించారు రతన్ టాటా. కానీ ఈ సినిమా కేవలం రూ.7.96 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో టాటా మరోసారి నిర్మాణం వైపు అడుగుపెట్టలేదు.

మిక్స్‌డ్ రివ్యూలు

ఇప్పటికీ ‘ఏత్బార్’ మూవీకి సంబంధించిన రివ్యూలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ‘స్టోరీ రియల్‌గా అనిపించలేదు. ఆ స్టోరీలోకి ప్రేక్షకులను తీసుకెళ్లడానికి కూడా దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఇది ఒక చీప్ హారర్ మూవీ. అమితాబ్ బచ్చన్ మాత్రమే సినిమాలో పాజిటివ్‌గా నిలిచారు. అంతకు మించి మరెవ్వరూ ఆ రేంజ్‌లో యాక్టింగ్‌ను కనబరచలేదు’ అంటూ ఒక మూవీ లవర్.. ‘ఏత్బార్’ గురించి నెగిటివ్ రివ్యూ అందించారు. కానీ కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా పర్వాలేదని ప్రశంసించారు. ‘ఈ సినిమా కరెక్ట్ సమయంలో విడుదల కాలేదు. బాలీవుడ్‌కు మంచి థ్రిల్లర్స్ తెరకెక్కించడం చేతకాదు కానీ ఏత్బార్ మాత్రం అలా కాదు’ అంటూ ‘ఏత్బార్’ గురించి పాజిటివ్ రివ్యూలు కూడా కనిపిస్తుంటాయి.

Related News

Madhoo Bala: సీనియర్ నటి మధుబాల కూతుళ్లను చూశారా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Veena Srivani: ప్రాయశ్చిత్త శ్లోకాలంటూ ఓవర్ యాక్షన్.. క్షమాపణ చెప్పండి.. వేణుస్వామి భార్య సంచలన వ్యాఖ్యలు

Karthi: మహేష్- రాజమౌళి సినిమాలో కార్తీ.. ఆయన ఏమన్నాడంటే.. ?

Ananya Panday: ఏంటి పాప నీ కోరిక.. ఫ్యాన్స్ హర్ట్ అవ్వరూ ..!

Swag: శ్రీ విష్ణు స్వాగ్.. కాన్సెప్ట్ నచ్చలేదా లేక శ్రీ విష్ణునే మెప్పించలేదా..?

Koratala Siva: ఆ స్టార్ హీరోతో సినిమా చేయను.. దేవర డైరెక్టర్ కఠిన నిర్ణయం వెనుక కారణం..?

Big Stories

×