EPAPER
Kirrak Couples Episode 1

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

TTD Ex Chairman: అబద్ధాన్ని నిజం చేస్తారా.. సీఎం స్థాయిలో ఉండి అబద్ధాలు ప్రచారం చేస్తారా… ఇది మీకు కరెక్ట్ కాదు.. అందుకే సుప్రీంకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా స్పందించింది అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా సీఎం చంద్రబాబుపై శివాలెత్తారు.
తిరుమల లడ్డు వివాదం ఆల్ పార్టీల విమర్శలు కొనసాగుతుండగానే.. సుప్రీం కోర్టుకు చేరింది. దీనితో సుప్రీంకోర్టు విచారణ సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకెక్కడిది అంటూ సుప్రీం చేసిన వ్యాఖ్య ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. అలాగే స్వయంగా టీటీడీ అధికారి కల్తీ జరిగినట్లు భావిస్తున్న నెయ్యి ఉపయోగించలేదన్నారు.. కానీ సీఎం సెప్టెంబర్ 18న కల్తీ జరిగింది అంటూ ప్రకటించారు.. సిట్ విచారణ పూర్తి కాకముందే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎలా ఇటువంటి ప్రకటనలు చేస్తారంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.


ఇలా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఈ సంధర్భంగా సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పదవి ఉందని పెదవి జారినా.. అబ‌ద్ధాన్ని నిజం చేయాలని చూస్తే.. ఇలానే ఉంటుందన్నారు. మహాప్రసాదానికి మలినం అంటగట్టాలని చూస్తే దానిపై సుప్రీంకోర్టు స్పందించిన తీరును అంద‌రూ స్వాగతిస్తున్నారన్నారు. శ్రీవారి ప్రసాదంపై సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు తనను ఎంతగానో బాధించాయన్నారు. టీటీడీ ఈవో చెప్పిన మాటలకు భిన్నంగా తప్పు జరిగిందంటూ ఎల్లోమీడియాలో విషప్రచారం చేశారని, దేవుణ్ణి వివాదాల్లోకి లాగొద్దని ఎంత చెప్పినా విన‌లేదని తెలిపారు. సుప్రీంకోర్టు సరైన విధంగా ప్రశ్నించిందని, దేవుడే సుప్రీంకోర్టుతో ఆ మాటలు పలికించినట్లు తాను భావిస్తున్నానన్నారు.

Also Read: Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

తన హయాంలో కల్తీ జరిగిందని టీడీపీ విషప్రచారం చేసిందని, అందుకే తిరుమలకు వెళ్లి మహా ప్రసాదంలో కల్తీ జరగలేదని శ్రీవారికి హారతి ఇస్తూ ప్రమాణం చేసినట్లు తెలిపారు. కల్తీ జరిగి ఉంటే నేను, నా కుటుంబం నాశనం కావాలని స్వామి వారిని కోరుకున్నానన్నారు. ఇప్పటికైనా అబద్దాలను నిజం చేసే చర్యలను టీడీపీ మానుకోవాలని సూచించారు. దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు నిదర్శనమని, ఇప్పటికైనా వైసీపీపై చేస్తున్న విమర్శలు మానుకోవాలన్నారు.

Related News

JANASENA vs TDP: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

Nagababu Comments: ఆ ఒక్క మాటతో జగన్, ప్రకాష్ రాజ్‌ల పరువు తీసేసిన నాగబాబు.. అందుకే పవన్ అలా స్పందించారట!

Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

Janasena: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×