EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

Hyderabad Real Boom: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుంది. ఆ కల నెరవేర్చుకొనేందుకు పైసా పైసా కూడబెట్టుకుంటారు అందరూ. అలాగే బ్యాంక్ లోన్స్, ఇతర ప్రైవేట్ లోన్స్ తీసుకొని ఇళ్లు నిర్మించుకోవడం, కొనుగోలు చేయడం అనేది ప్రస్తుతం ప్రతీ కుటుంబంలో జరుగుతోంది. అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు, లేక కొనుగోలు చేసిన స్థలం చివరకు మన చేతి నుండి జారిపోయే పరిస్థితి వస్తే ఆ భాద వర్ణించలేము. అందుకే ఇంటిని, స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు. అందులో తెలంగాణలోని హైదరాబాద్ లో అయితే మరీ నిశితంగా పరిశీలించి వీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.


హైదరాబాద్ లో ఇటీవల హైడ్రా బఫర్ జోన్, ఎఫ్టిఎల్ పరిధిలో గల అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. దీనితో మధ్యవర్తుల మాటలు నమ్మి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలలో గృహాలు నిర్మించుకొని మోసపోయిన వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ధనవంతులకైతే ఏం ఫర్వాలేదు.. కానీ తమ కష్టార్జితంలో ఇళ్లు కట్టుకున్నవారి పరిస్థితి అయితే దారుణమే. తాము ఎన్నో కలలతో నిర్మించుకున్న ఇల్లు హైడ్రా పరిధిలోకి వస్తే ఎలా అనే సందేహాలు అధికంగా నగరవాసుల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే హైదరాబాద్ లో ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తున్నామని మురిసి పోవడం కంటే ముందుగా ఈ విషయాలు తెలుసుకుంటే మీ డబ్బు సేఫ్.

రివర్ వ్యూ సూపర్ ఉంది కదూ.. లేక్ వ్యూ చూసినా చాలుగా అనుకొని ఇంటిని కానీ, స్థలాన్ని కానీ కొనుగోలు చేశారో.. మీది ఇక రోడ్ వ్యూ కాక తప్పదు. అందుకే హైదరాబాద్ లో ఇల్లు, స్థలం, ఫ్లాట్​ కొనుగోలు చేసేవారు.. ముందుగా అవి అక్రమ నిర్మాణాలా, కాదా అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం మీ దగ్గరలోని లీగల్ అడ్వైజర్లను, రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. అప్పుడు ఆ స్థలం పూర్తి చరిత్ర మీరు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కొనే గృహం ఎవరి పేరుపై ఉందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ గృహం వేరే వారిపై ఉండి, మనం మనకు విక్రయించే వారికి డబ్బులు ఇచ్చామో మన డబ్బు హాంఫట్ స్వాహానే. అందుకే అసలు స్థలం, ఇల్లు ఎవరి పేరుపై ఉందన్న పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలి.. అది కూడా పూర్తిగా ధృవీకరించుకున్నాకే మనం కొనుగోలు చేసేందుకు ముందడుగు వేయాలి. స్థలం లింకు డాక్యుమెంట్స్, ఇంటి పట్టాలు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని, సంబంధిత అధికారి వద్దకు వెళ్లి పూర్తిగా నిర్ధారించుకోవాలి. పంచాయతీల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ స్థలమా.. లేక గ్రామ కంఠమా అనేది తెలుసుకోవాల్సిందే.. లేకుంటే ఏనాటికైనా ముప్పే.


Also Read: Hydra: మీ ఇల్లు చెరువుల పరిధిలో ఉందా ? ఇలా చెక్ చేసుకోండి

ఆస్తుల విషయంలో అన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నప్పటికీ మనం అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు న్యాయ సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. అలాగే హైడ్రా తాజాగా ప్రజలు ఎవరూ మోసపోకుండా ఇటీవల తన అధికారిక వెబ్ సైట్ ద్వారా ఒక జాబితాను పొందుపరిచింది. ఆ జాబితాను మనం పరిశీలించినా.. మనం కొనే స్థలం, ఇల్లు హైడ్రా పరిధిలోకి వస్తుందా.. లేదా అన్నది మనకు తెలుస్తుంది. అలాగే మనకు నమ్మకస్తులు అయినప్పటికీ.. స్థలాల కొనుగోలు విషయంలో అన్నీ పత్రాలు సబబుగా ఉన్నాయా లేవా అనేది పరిశీలించుకోవాల్సిందే. చెరువుల పరిధిలోకి వచ్చే గృహాలను మనం కొనుగోలు చేస్తే చివరికీ.. మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచించి, నిర్ధారించుకున్నాక మీ సొంతింటి కల నెరవేర్చుకొనేందుకు ముందడుగు వేస్తే మంచిదని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు. పైపై అందాలు చూసి మురిసిపోయి, డబ్బులు ఇచ్చారో.. మీ దారి రహదారే కానీ మీ ఇంటి దారి మాత్రం కాదు. అందుకే తస్మాత్ జాగ్రత్త సుమా !

Related News

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×