EPAPER
Kirrak Couples Episode 1

Sahithi Infra Case: మోసాలకు బ్రాండ్ అంబాసిడర్.. ఒకే స్థలం నలుగురికి.. సాహితీ హిస్టరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Sahithi Infra Case: మోసాలకు బ్రాండ్ అంబాసిడర్.. ఒకే స్థలం నలుగురికి.. సాహితీ హిస్టరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Sahithi Infra MD Lakshmi Narayana In ED Custody: నమ్మించి మోసం చేయడంలో అతడో బ్రాండ్ అంబాసిడర్. మోకాకా ఫాయిదా ఉఠానా అంటే మొదట ఉండేది అతడే. వరుస స్కాములు, కోట్లల్లో దందాలు. రియల్ ఎస్టేట్ కింగ్ గా కలరింగ్ ఇచ్చుకుని అందరికీ శఠగోపం పెట్టిన చరిత్ర. ప్రీలాంచ్ అనడం, పైసా వసూల్ చేయడం, అమ్ముతానంటూ అగ్రిమెంట్లు చేయడం, ఒకే స్థలాన్ని నలుగురైదుగురికి కట్టబెట్టడం. ఇదే కథ. ఇదంతా ఈడీ అదుపులో ఉన్న సాహితీ లక్ష్మీనారాయణ గురించే. ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చి.. చివరికి మోసాలకే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. సాహితీ లక్ష్మీనారాయణ చరిత్ర చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే.


అవును సాహితీ ఇన్ఫ్రా, ఆ సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు కట్టారా.. ఇక అంతే అవి రానే రావు అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే వేల మంది బాధితులు ఉన్నారు కూడా. బాధిత సంఘం కూడా ఏర్పడిందంటే మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో జస్ట్ ఇమాజిన్. ఎక్కడో మంగళగిరిలో చిన్న బట్టలదుకాణంతో మొదలైన సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ లైఫ్ స్టోరీ.. హైదరాబాద్ లో జనం నెత్తిన పెద్ద శఠగోపం పెట్టే దాకా మధ్యలో చాలా జరిగాయి. రియల్ ఎస్టేట్ కింగ్ గా చెప్పుకుంటూ పొలిటికల్ పార్టీలనూ, బడా నేతలనూ బురిడీ కొట్టించాడు. ఇక బాధితులకు వేసిన టోకరా అయితే అంతా ఇంతా కాదు. అందుకే మోసాలకే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు సాహితీ లక్ష్మీనారాయణ.

ఏ రియల్టర్ అయినా.. ఏ బిజినెస్ టైకూన్ అయినా పనిలో లాభం చూసుకుంటారు. కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ రూటే సపరేటు. అంతా ఫుల్ పైసా వసూల్ కార్యక్రమమే. ప్లాట్లు, ఫ్లాట్లు, ప్రీలాంచ్, తక్కువ ధరకే వరల్డ్ క్లాస్ సౌకర్యాలు అని చెబుతూ స్టోరీ మొదలెడుతారు. ఇక అంతే చాలా మంది బుట్టలో పడుతారు. కొంత మందే తప్పించుకుంటారు. బుట్టలో పడ్డ వారే విలవిలలాడుంటారు. ఈ సాహితీ ఇన్ ఫ్రా దెబ్బకు చాలా మంది జీవితాలే కుదేలయ్యాయి. ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. లక్ష్మీనారాయణను అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని చాలా మంది బాధితులు రోడ్డెక్కారు కూడా.


ప్రస్తుతం సాహితీ లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది. గతంలోనూ సాహితీ సంస్థల్లో రికార్డుల్ని పరిశీలించారు. కేసులు నమోదయ్యాయి. ఆస్తుల్ని సీసీఎస్ సహా ఈడీ అటాచ్ కూడా చేసింది. తాజాగా ఇదే సాహితీ ఇన్ఫ్రా మోసాలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున జనం నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. 1800 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్‌పై ఈడీ మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది. ప్రీలాంచ్‌ పేరుతో 2500 వేల మంది కస్టమర్ల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగస్టులో సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ భూదాటి లక్ష్మీ నారాయణపై హైదరాబాద్‌ సీసీఎస్‌ లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి అదే సంవత్సరం 2న ఎండీ లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై బయటికొచ్చారాయన. సాహితీ బాధితుల సంఘం కూడా ఏర్పడిందంటే మోసాలు ఏ లెవెల్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Also Read: మూసీ ప్రక్షాళనతో రాజకీయాలు.. తెర వెనుక రియల్టర్లు?

ఇప్పటికే ఈ కేసుపై 50కి పైగా కేసులు నమోదు కాగా.. దాదాపు 3 వేల మంది వరకు బాధితులు ఉన్నారు. గతంలో 200 కోట్ల రూపాయల సాహితీ ఆస్తుల్ని సీసీఎస్ అటాచ్ చేసింది. మ్యాటర్ ఏంటంటే జనం నుంచి ప్రీలాంచ్ పేరుతో పెద్ద మొత్తంలో వసూల్ చేసిన డబ్బుల్ని ఎక్కడికి పంపారు.. ఎక్కడ వాడారు. ఏం చేశారన్నదే క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇంత పెద్ద మొత్తాన్ని వాడడం చుట్టూ మనీలాండరింగ్ జరిగి ఉంటుందన్న ఆరోపణలతో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అందుకే మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఈడీ.

చిన్న చిన్న ప్రాజెక్టులు, చిన్న చిన్న అగ్రిమెంట్ మోసాలు, డబ్బులు తీసుకుని ఇండ్లు కట్టివ్వకపోవడం ఇలాంటివి జరిగి ఉంటే.. సాహితీ ఇన్ ఫ్రా మోసాలు అంత ఈజీగా బయట ఎవరికి తెలిసి ఉండేది కాదు. కానీ భారీ టార్గెట్ పెట్టుకున్నారు. వేల మందిని బురిడీ కొట్టించి బిచాణా ఎత్తేయడంతో ఇప్పుడు సాహితీ ఎండీ ఈడీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సాహితీ ఇన్‌ఫ్రా టెక్‌ ఎండీ లక్ష్మీనారాయణ 2019లో ఓ భారీ స్కెచ్ వేశాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ లో సాహితీ శర్వాని ఎలైట్‌ పేరుతో ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు ధూమ్ ధామ్ గా ప్రచారం చేశారు. 23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఉంటాయని ప్రచారం మోత మోగించారు. కలర్ ఫుల్ బ్రోచర్లతో హంగామా చేశారు. అల్ట్రా మోడ్రన్ సౌకర్యాలతో తక్కువ ధరకే నిర్మిస్తామని, ప్రీ లాంఛ్‌ ఆఫర్‌ అంటూ 1,700 మంది నుంచి 539 కోట్ల మేర వసూలు చేశారు. అదే సాహితీ ఇన్ ఫ్రా కథను మలుపు తిప్పింది. నిజానికి అక్కడ కట్టేది లేదు. ఇచ్చేది లేదు. అయిన కాడికి డిపాజిట్లు సేకరించి బిచాణా ఎత్తేయడమే అసలు టార్గెట్. అందుకే అనుకున్న పని ఈజీగా జరిగింది. జనం నమ్మి భారీగా సమర్పించుకున్నారు. సీన్ కట్ చేస్తే లక్ష్మీనారాయణ అవుటాఫ్ కవరేజ్. అదీ సంగతి.

అదొక్కటే కాదు.. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది సాహితీ సంస్థ. సాహితీ స్వాద్‌ పేరుతో 65 కోట్లు, సిస్టా అడోబ్‌ పేరుతో 79 కోట్లు, సాహితీ గ్రీన్‌ పేరుతో 40 కోట్లు, సాహితీ సితార పేరుతో 135 కోట్లు, సాహితీ మెహతో పేరుతో 44 కోట్లు, ఆనంద ఫర్చూన్‌ పేరుతో 45 కోట్లు, సాహితీ కృతి పేరుతో 16 కోట్లు, సాహితీ సుదిక్ష పేరుతో 22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో 7 కోట్లు వసూల్ చేశారు. వసూలు చేసిన డబ్బులో కొంత వ్యక్తిగత అవసరాలకు వాడుకోగా.. మిగితాది దారి మళ్లించారంటున్నారు. ఇప్పుడు ఆ లెక్కలనే ఈడీ బయటకు తీయబోతోంది. ఎవరికి ఇచ్చారు. ఎటు పంపించారు? ఇదంతా తేలబోతోంది.

Related News

TGSRTC: దసరాకు 6 వేల స్పెషల్ బస్సులు.. ముందస్తు రిజర్వేషన్ కోసం సైట్ ఓపెన్..

HYDRA: ఆ ప్రచారాలను నమ్మొద్దు, వారి ఇళ్లను కూల్చం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

KTR: మూసీ పేరుతో బడా స్కెచ్.. రూ. లక్ష కోట్లు స్వాహా : కేటీఆర్

Konda Surekha: అన్నా, చెల్లిపై అలాంటి పోస్టులా? కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

Tension: సిద్ధిపేట జిల్లాలో టెన్షన్..టెన్షన్… గ్రామస్తుల ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేకపోయిన పోలీసులు.. చివరకు..

Telangana Bhavan: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. కొట్టుకున్న కార్యకర్తలు?

Big Stories

×