EPAPER
Kirrak Couples Episode 1

Unstoppable4: బాలయ్య షో కి ఫస్ట్ గెస్ట్ ఎవరంటే. టీఆర్పీ రికార్డు పక్కా..!

Unstoppable4: బాలయ్య షో కి ఫస్ట్ గెస్ట్ ఎవరంటే. టీఆర్పీ రికార్డు పక్కా..!

Unstoppable 4.. నటసింహ నందమూరి బాలకృష్ణ (Nanadamuri Balakrishna) హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తున్నారని ప్రకటించినప్పుడు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. అసలు మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈయన హోస్ట్ గా చేయగలరా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఒక్కసారి హోస్ట్ గా స్టేజి పైకి అడుగుపెట్టగానే మొత్తం మారిపోయింది. తన మాట తీరుతో అందరిని ఆకట్టుకున్నారు. మధ్యమధ్యలో కామెడీ చేస్తూ హోస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు షో టీఆర్పీ రేటింగ్ ను కూడా పెంచేసి, అమాంతం సీజన్ సక్సెస్ అయ్యేలా చేశారు.


అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలు..

ఇకపోతే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ సీజన్స్ 1,2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. అలాగే ఎడిషనల్ సీజన్ కింద మూడవ సీజన్ కూడా విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే సీజన్ 4 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ దసరాకి అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య కూడా ఈ సీజన్ 4 పై ఆసక్తికరంగా ఎదురు చేస్తున్నారనే కామెంట్లు కూడా వినిపించాయి . ఇకపోతే గతంలో కంటే ఎక్కువ మంది స్టార్ సెలబ్రిటీలను గెస్ట్ లుగా ఈ సీజన్ కి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం.


ఫస్ట్ గెస్ట్ ఆయనే..

ఇకపోతే తాజాగా సీజన్ 4 కి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) రాబోతున్నారట. తాజాగా ఈయన నటించిన లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి ఆడియన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అయితే సీజన్ 4 మొదటి ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించడం ఖాయం అంటూ అప్పుడే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

లక్కీ భాస్కర్ ప్రమోషన్ షురూ..

ఇక దుల్కర్ సల్మాన్ సినిమా విషయానికి వస్తే.. లక్కీ భాస్కర్ అంటూ తెలుగులో నేరుగా నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ దసరా నుంచి మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఇక ప్రమోషన్స్ లో భాగంగానే ఈ షో కి దుల్కర్ సల్మాన్ గెస్ట్ గా హాజరుకానున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో దుల్కర్ సల్మాన్ తో పాటు నిర్మాత నాగవంశీ , డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా పాల్గొనబోతున్నారట. ఈ ముగ్గురు కూడా తమ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలు కూడా పంచుకోబోతున్నారని సమాచారం. మరోవైపు బాలకృష్ణ, బాబీ డైరెక్షన్లో తన 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని బయపెట్టిన అంజు – యముడి మాటలు విన్న ఆరు

Intinti Ramayanam Today Episode : పల్లవి డ్రామా అవనికి తెలిసిపోయిందా? చక్రధర్ నిజస్వరూపం తెలుసుకున్న రాజేశ్వరి..

Gundeninda GudiGantalu Today Episode : ప్రభావతి, రోహిణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలు.. ట్రయిల్ రూమ్ రొమాన్స్..

Brahmamudi Serial Today September 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు మళ్లీ హార్ట్‌ స్ట్రోక్‌ – కావ్యకు  క్లాస్‌ పీకిన కనకం

Satyabhama Serial Today Episode : క్రిష్ కు సత్య నిజం చెప్తుందా? .. మహదేవయ్య తో పోటికి సై అంటున్న సత్య…

Trinayani Serial Today September 30th: ‘త్రినయని’ సీరియల్‌: మణి కోసం ఇంటికి  వచ్చిన గజగండ – నయనిని చంపేయాలన్న తిలొత్తమ్మ

Big Stories

×